Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓటీటీ షో రేంజులో అశ్లీలం ఉంటే… నాగార్జున ఇజ్జత్ పోవడం ఖాయం…

August 11, 2022 by M S R

వీడు ఫైనల్… ఈమె ఖరారు… ఇదుగో బిగ్‌బాస్ ఆరో సీజన్ లిస్టు… అంటూ కొన్నివారాలుగా తెగ రాసేస్తున్నారు… అక్కడ ఖరారైందీ లేదు, అగ్రిమెంట్లు కుదిరిందీ లేదు… వెటరన్ యాంకర్ ఉదయభాను, మరో యాంకర్ దీపిక పిల్లి దగ్గర నుంచి జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి దాకా బొచ్చెడు పేర్లను ప్రచారంలోకి తీసుకొచ్చారు… ఇంకా నయం యాంకర్ సుమ, యాక్ట్రెస్ సురేఖావాణి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ పేర్లు ప్రచారంలోకి రాలేదు… మరీ పాఠకులు నమ్మబోరని అనుకున్నారేమో…

ప్రస్తుతానికి కన్‌ఫమ్ అయ్యింది టీవీ9‌లో ఇస్మార్ట్ న్యూస్‌లో చేసే యాంకర్ అరోహి రావు అలియాస్ అంజలి… ఈజ్ ఉంది అమ్మాయిలో… పాత వరంగల్ జిల్లా అమ్మాయి… జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రస్తుతం… మొదట్లో వరంగల్‌లో చిన్నాచితకా టీవీల్లో కనిపించేది… టీవీ9 వచ్చాక కుదురుకుంది… బిగ్‌బాస్‌తో ఇంకాస్త పాపులర్ అయిపోతుంది… శుభం…

ఐనా బిగ్‌బాస్ అంటే టీవీ9 నుంచి ఎవరో ఒకరు ఉండాల్సిందే కదా… వారానికో బయటికొస్తారా..? కాస్త పోటీ ఇచ్చి నాలుగురోజులు నిలకడగా ఉంటారా లేదానేది వేరే విషయం… కానీ టీవీ9 ప్రాతినిధ్యం ఉంటుంది… ఫస్ట్ సీజన్, ఫిఫ్ట్ సీజన్లలో మాత్రమే ఈ సెంటిమెంట్ బ్రేకయినట్టుంది… మొదట్లో దీప్తి… తరువాత జాఫర్… ఆ తరువాత దేవి… జాఫర్ మొదటి వారమే బయటికి వచ్చేశాడు… తను ఆ ఆటకు ఫిట్ కాడు… దీప్తి కాస్త మంచి పోటీయే ఇచ్చింది… దేవి టెంపర్‌మెంట్‌కు బిగ్‌బాస్ వేషాలు సూట్ కావు… అందుకే కొన్నాళ్లకు బయటికొచ్చేసింది… తరువాత పొరపాటున కూడా బిగ్‌బాస్ ఇమేజీని తన పాపులారిటీకి వాడుకోలేదు… ఆ పేరుతో పిచ్చి పిచ్చి టీవీ షోలలో పాల్గొని సొమ్ము చేసుకునే కక్కుర్తికీ పాల్పడలేదు…

Ads

arohi

నిజానికి అదుగో బిగ్‌బాస్, ఇదుగో వచ్చేసింది అని ప్రోమోలు కుమ్మేస్తున్నారు గానీ అది వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో ప్రసారం అవుతుంది… అప్పుడే కంటెస్టెంట్ల ఎంపికకు తొందర అవసరం లేదు… అదంతా యూట్యూబ్ చానెళ్లు, సైట్ల ఆత‌ృత… కరోనా పిరియడ్‌లో అందరినీ క్వారంటైన్ చేశారు కాబట్టి చాలా ఎర్లీగా ఎంపికలు చేశారు… ఇప్పుడు ఆ జంఝాటం అవసరం లేదు… అదే స్టూడియో, అదే సెటప్, అదే హోస్ట్… కాకపోతే దీనికి ముందు ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్ అంటూ హాట్‌స్టార్ ఓటీటీకి ఓ షో చేశారు…

విజేత బిందుమాధవి… కానీ ఆ షోలో అశ్లీలం, అసభ్యత ఎక్కువైందనే విమర్శలు వచ్చాయి… ఓటీటీలో అంతసేపు ఎవరు చూస్తారు ఆ షోను..? అందుకే బూతు డోస్ బాగా పెంచారు… ఇప్పుడు టీవీ ప్రసారం కాబట్టి అదే డోస్ ఉంటే నాగార్జున ఇజ్జత్ బజారున పడటం ఖాయం… ఇప్పటికే తను నటించిన ప్రోమో మీద విమర్శలొస్తున్నయ్… పెళ్లిళ్లలో అప్పగింతలు అనేది ఓ ఎమోషనల్ ఘట్టం… దాన్ని కూడా వెకిలి చేస్తూ బిగ్‌బాస్ షోకు ప్రమోషన్ ప్రోమో చేశారు… ఇన్‌సెన్సిటివ్ క్రియేటివిటీ..!! ఐనా నాగార్జున కదా… మన్మథుడు-2 చూశాం కదా… తను ఏదైనా చేయగలడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions