జగన్ కీర్తిపతాకను గగనమెత్తున ఎగరేసిన ఘోరంట్ల ఏదో అన్నాడట కదా… వస్తున్నా, ఒక్కొక్కడికీ నా ఒరిజినల్ చూపిస్తాను అని..!! తను తిట్టిపోస్తున్నది నేరుగా కమ్మ సామాజికవర్గాన్ని, పచ్చ జర్నలిస్టులను కాబట్టి జగన్, రోజా, సజ్జల, నాని, వనిత ఎట్సెట్రా వైసీపీ నాయకగణం భలే సంబరపడిపోయి ఉంటారు… మావాడు బంగారుతొండ అని ఆనందపడుతున్నది వాళ్లే కదా… అది ఒరిజినలా, ఫేకా, ఆ మూమెంట్ సరైనదేనా అనే కోణంలో టీవీ డిబేట్ల ప్రజెంటర్లు వాళ్లకు తెలిసిన చెత్తా భాషలో కొన్నాళ్లు తన్నుకు చావనివ్వండి… కలియుగాంతం సమీపించినా తెలుగుదేశం ఆ అంగాన్ని మాత్రం వదిలేట్లు లేదు… తెలుగు ప్రజలకు అది మరో దరిద్రం… కానీ ఘోరంట్ల భాష, ఆ మాటతీరు, ఆ చూపు, ఆ బాడీ లాంగ్వేజీ, తన పాత కెరీర్, చరిత్ర ప్రజలకు మాత్రం వెగటుపుట్టిస్తున్నాయి… సరే, అదంతా వేరే సంగతి…
తన పాత్రికేయ వృత్తి జీవితంలో రాధాకృష్ణ చాలామంది చాలా వ్యాఖ్యలు చేసినా పెద్దగా సీరియస్‌గా తీసుకోడు… తన వీడియోలపై భారీ ఎత్తున ట్రోలింగ్ సాగుతున్నా లైట్ తీసుకుంటాడు… తన ఎడిటోరియల్ వ్యాసాలపై, తన మీడియా పొలిటికల్ లైన్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా చదివీ చదవనట్టు పక్కకు నెట్టేస్తాడు… కానీ తెలుగు పాత్రికేయం అనే కోణంలో దమ్మున్న జర్నలిస్టుగా చెప్పుకోవడానికి, నిలబడటానికే ప్రయత్నం చేస్తాడు… అలాంటి తనకు కూడా ‘‘మీ ఇళ్లకు వచ్చి నా ఒరిజినల్ చూపిస్తాను’’ అనే ఘోరంట్ల పిచ్చికూతతో ఎక్కడో కాలింది… అర్జెంటుగా ఓ పరువునష్టం దావా వేయబోతున్నాడు… అవసరం కూడా… మాధవ్ వంటి కేరక్టర్లు జగన్‌కు ముద్దేమో గానీ, సభ్యసమాజానికి చేటు…
చట్టం, శిక్షాస్మృతి కోణంలో మాధవ్ బరిబాతల వీడియో నేరం కాదు, కానీ తన పోకడ, తన నడత, తన స్థాయి ఏవగింపు పుట్టించడం లేదా..? పైగా అధికార యంత్రాంగం కూడా ఎందుకు వెనకేసుకొస్తున్నది..? సరే, సిగ్గుమాలిన టీడీపీ క్యాంపు ఇంకా ఇంకా దాన్ని పీకి పీకి పెంట చేస్తూ పొలిటికల్ లబ్ధికి ప్రయత్నం చేస్తోంది, వైసీపీ మొదట్లోనే సైలెంటుగా ఉంటే ఎప్పుడో ఇది చల్లారిపోయి ఉండేది… ఘోరంట్ల స్పందన తీరు కూడా ఇంకా పెట్రోల్ పోసినట్టుగా మంటలు పెంచుతోంది…
Ads
‘‘ఎవరికైనా దెబ్బ తగిలి నొప్పి పుడితే అమ్మా అని అరుస్తారు. అలాంటిది జగన్ అండ్ కో పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌లో కమ్మా అని అరిచే పరిస్థితి ఏర్పడింది’’ అని రాధాకృష్ణ రాసుకున్నాడు ఆదివారం కొత్తపలుకులో… నిజమే, ఒక కులాన్ని ఇంత బహిరంగంగా, నిర్దయగా టార్గెట్ చేసిన కాలం తెలుగు సమాజంలో గతంలో ఎన్నడూ లేదు…
నిజానికి జర్నలిస్టులపై గానీ, జర్నలిస్టులు గానీ వేసే పరువునష్టం దావాలు ఎవరినైనా జైళ్లపాలు చేశాయా..? వాటికి అంత సీరియస్ నేచర్ ఉందా..? గతంలో కేవలం సివిల్ కేసులు, ఈమధ్య దానికి క్రైమ్ అనే యాంగిల్ కూడా జతచేశారు… చట్టం చూస్తేనేమో కఠినంగా కోరలతో కనిపిస్తోంది… ఈ నేపథ్యంలో ఓ తాజా కేసు ఇంట్రస్టింగుగా అనిపించింది… మొత్తం చదివాక ఓ పెద్ద నిట్టూర్పు తప్పదు ఎలాగూ… ఎందుకంటే..?
అన్ని కేసుల్లాగే దశాబ్దాలుగా నలిగిన కేసే ఇది… ఆలస్యపు న్యాయం అసలు న్యాయమే కాదు అనే సూక్తి చెప్పుకోవడానికే గానీ వాస్తవంలో భారతీయ న్యాయవ్యవస్థ ఎప్పుడూ దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోదు… ఎప్పుడో 1994లో పయనీర్, స్వతంత్ర భారత్ అనే పత్రికలు ముజఫర్‌నగర్ కలెక్టర్ ఇంటర్వ్యూను ప్రచురించాయి… అందులో సదరు డీఎం అనంతకుమార్ సింగ్ గారు ‘‘అడవి వంటి ఏకాంత ప్రదేశంలో ఎవరైనా మహిళ ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయాలనే అనిపిస్తుంది ఎవరికైనా’’ అని చెప్పాడట… వీళ్లు రాసిపారేశారు…
అలాగే కూసి ఉంటాడు… ఐఏఎస్ అంటే సరైన, సమర్థ వ్యక్తిత్వాన్ని చూసి ఎంపిక చేయరు కదా… అదో దిక్కుమాలిన ఎంపిక విధానం… తెల్లారే ప్రజల నుంచి ఛీత్కారాలు వచ్చేసరికి, నో, నో, నేనలా అనలేదు అని ప్లేటు మార్చి, ఓ ఖండన పంపించాడు పత్రికలకు… అసలు నేను ఇంటర్వ్యూయే ఇవ్వలేదు అన్నాడు… సదరు పత్రికలకు చిరాకెత్తి, వారంరోజులు ఆగి, ఆ ఖండనను తీసుకెళ్లి ‘‘ఎడిటర్‌కు లేఖలు’’ కాలమ్‌లో పబ్లిష్ చేశాయి… పనిలోపనిగా సదరు రిపోర్టర్లతో మా ఇంటర్వ్యూ నిజమే అనిపించాయి… దీంతో కలెక్టరయ్య కోర్టుకు ఎక్కాడు… పరువునష్టం కేసు పెట్టాడు…
2007లో లక్నో స్పెషల్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ రిపోర్టర్ రమణ క్రిపాల్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ భట్టాచార్యతె, పబ్లిషర్ సజ్జీవె కన్వర్‌లకు ఐపీసీ కింద శిక్షలు ఖరారు చేసింది… కేసు తరువాత ఎక్సట్రా సెషన్స్ జడ్జి వద్దకు చేరింది… అక్కడా అదే శిక్షను ఖరారు చేశారు… అక్కడి నుంచి కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది… నడిచీ నడిచీ కేసు ఇన్నాళ్లకు తెమిలింది… 28 ఏళ్లు…
ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్‌లో సెక్షన్ 4 అని ఉంటుంది… దానిప్రకారం కోర్టు జర్నలిస్టులకు జరిమానాలు విధించి వదిలేసింది… కోర్టుకే ఈ జాప్యంతో విసుగెత్తి ఉంటుంది… లేకపోతే సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వచ్చేదేమో… ఇది పాత కేసు కాబట్టి అప్పట్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండేవి కావు పరువునష్టం కేసుల్లో… ఇప్పుడు వేరు… ఇక రాధాకృష్ణ పెట్టాలనుకునే కేసు ఏ మలుపులు తీసుకుని, ఎన్నాళ్లు నడుస్తుందో చూడాలి… ఎవరైనా మాంఛి సుప్రీం లాయర్‌ను మాట్లాడండి సార్… అసలు ఎంపీలకు నైతిక ప్రవర్తన నియమావళి ఎందుకు ఉండకూడదు అనే ఇంకో పిల్ కూడా వేయండి పనిలోపనిగా…!!
Share this Article