నిజం… అనసూయకు తెలుగు టీవీ ప్రేక్షకులంటే విపరీతమైన చిన్నచూపు… తనకు కీర్తిని, డబ్బును, విలాసాల్ని ఎట్సెట్రా అన్నీ ఇస్తున్న టీవీ ఇండస్ట్రీ అంటేనే తనకు ఓ తేలికపాటితనం… అందులో ఏమాత్రం డౌట్ లేదు… తనకు నటన రాదు, ఆ మొహంలో ఏ ఎమోషన్సూ పలకవు… ఆమధ్య ఏదో క్రౌర్యాన్ని చూపించాల్సిన విలనీ షేడ్ పాత్ర చేసింది… దర్జా సినిమా కావచ్చు… ఫాఫం, ఆ దర్శకుడి ఇజ్జత్ పజీత అయిపోయింది ఆ దెబ్బకు…
ఒక్క విషయం చెప్పుకుని… తరువాత మిగతా విషయాలు చెప్పుకుందాం… మధ్యలో కొన్నిరోజులు ఎటో వెళ్లిపోయి, ఎక్కడా ఎవడూ దేకక, మళ్లీ మల్లెమాల క్యాంపులో వాడినీ వీడినీ బతిమిలాడి, మళ్లీ జబర్దస్త్‌లో చేరిన తీరు అందరికీ తెలుసు… మొత్తం తొమ్మిదేళ్లు అనుకుంటా… ఆమెకు డబ్బు ఇచ్చింది జబర్దస్త్, పాపులారిటీని ఇచ్చింది జబర్దస్త్,… హౌలా డ్రెస్సులు వేస్తూ, వెగటుతనాన్ని ప్రదర్శిస్తే భరించింది జబర్దస్త్… చివరకు చిన్నపిల్లల ప్రోగ్రామ్‌కు కూడా పొట్టిబట్టలు వేసుకునే ‘‘అద్భుతమైన మెచ్యూరిటీ’’ ఆమెది…
Ads
మొన్నామధ్య ఆ జబర్దస్త్‌ను వీడిపోతుంటే, ఫాఫం, మనలో మనిషి వెళ్లిపోతోంది కదా అనుకుని తోటి కమెడియన్లు (సారీ, ఆమె కమెడియన్ కాదు, జస్ట్, యాంకరిణి) ఓ వీడ్కోలు స్కిట్ చేశారు… అది చూస్తూ మూతిని అష్టవంకర్లు తిప్పుతూ, ప్రపంచంలో ఎవడికీ అర్థం కాని ఏదో పిచ్చి ఎమోషన్ కనబరుస్తూ కూర్చుంది… థూ, ఈ స్కిట్ ఎందుకు చేశాంరా అని ఆ కమెడియన్లు బాధపడితే… ఆ డైరెక్టర్ ఎవడో గానీ బకరా అయిపోయాడు… తోటి ఆర్టిస్టుల పట్ల మినిమమ్ గ్రాటిట్యూడ్, కర్టెసీ లేకపోతే ఎలా..?! షో స్టార్టింగ్ సమయంలో ఏదో పిచ్చిపాటకు రికార్డింగ్ డాన్స్ అనబడే నాలుగు తిక్క గెంతులు… మధ్యలో ఆ కుర్చీలో కూర్చుని పిచ్చి నవ్వులు… అంతకుమించి జబర్దస్త్ యాంకర్ చేసేదేముంటుంది..?
ఈమాత్రం దానికి ఏవేవో గొప్పలు చెబుతోంది తాజాగా… ఆమె వచ్చాక టీఆర్పీలు పెరిగాయట… మళ్లీ తనే దాన్ని ఖండిస్తూ టీఆర్పీలతో నాకేం సంబంధం, నాకు ఇచ్చిన డబ్బుకు తగినంత పనిచేశాను అంటోంది… చిన్నమెదడుకు ఏదో అయినట్టుంది… ఎంత డబ్బుకు యాంకర్‌గా ఎంత పని ఉంటుందో ఇప్పుడు అనసూయ చెబితే టీవీ ఇండస్ట్రీ తెలుసుకోవాలి… తనకు బాడీ షేమింగ్ ఎదురైంది, అవమానాలు భరించాను అంటోంది… అందుకేనా తొమ్మిదేళ్లు అక్కడ పనిచేసింది..? అందుకేనా మధ్యలో వెళ్లిపోయి మరీ మళ్లీ వచ్చింది..?
జబర్దస్త్ షోను విడిచిపెట్టి వెళ్లిపోతే ఇక దాని మీద కామెంట్స్ చేయకూడదు… తన అర్హతను మించి జబర్దస్త్ అనసూయకు అన్నీ ఇచ్చింది… ఒక సుడిగాలి సుధీర్‌ను చూడండి… జబర్దస్త్, మల్లెమాల, ఈటీవీ మీద ఎవరెవరో కమెడియన్లు ఏవేవో కూతలు కూసినా సరే, సుధీర్ మాత్రం ఒక్క మాట తూలలేదు, ఎక్కడా మాట్లాడలేదు… ఇప్పుడు అనసూయ చెబుతోంది… రెండేళ్ల నుంచే వదిలేద్దామని అనుకుంటున్నాను… రోజా, నాగబాబు వెళ్లారు కాబట్టి నేనూ వదిలేశాను అనేది తప్పు అని..! రెండేళ్ల నుంచి వెళ్లానని అనుకుంటుంటే ఎవరు అక్కడ కట్టిపడేసింది..?!
ఇప్పుడు నెటిజనం ఆమె మాటల మీద లెఫ్ట్ రైట్ పీకుతున్నారు… అసలే నెటిజనానికి ఆమె అంటే ప్రేమ ఎక్కువ కదా… జబర్దస్త్ అనేదే ఓ వెకిలి షో… కానీ అది ఇన్నేళ్లు తిండి పెట్టింది… ఆ కృతజ్ఞత కూడా లేదీమెకు… ఏమో… కాలం ఆమెను మరింత ప్రేమిస్తే… ఈఎంఐలు కొరడా ఝలిపిస్తే… మళ్లీ మల్లెమాల పెద్దల దగ్గరకు వెళ్లి, బాబ్బాబూ, ప్లీజ్, మళ్లీ చేస్తాను అని బతిమిలాడే సిట్యుయేషన్ రావచ్చునేమో… తత్వం బోధపడునేమో…!!
ఆఫ్టరాల్ అనసూయ, ఆఫ్టరాల్ జబర్దస్త్ అని తీసిపారేయకండి… ఇలాంటివే కదా మనకు మనుషుల తత్వాలను పట్టించేవి..!! అవునూ, నాకూ బాడీషేమింగ్ ఎదురైంది అంటోంది కదా ఈమె… అలా వెక్కిరించే అవకరాలు ఏమున్నాయట..? మంచి హైట్ ఉంది, మంచి కలర్ ఉంది, చూడబుల్ ఫేసుంది, ఐనా ఎందుకు వెక్కిరించారబ్బా…!! అందరూ అంటుంటారు కదా, నేనూ అనేస్తే పోలా అనుకుందేమో…! తనను ఏదో గొర్రెల మంది అటాక్ చేసిందట, అదొక ఊబి అట… మరిన్నేళ్లూ అదేకదా ముద్దొచ్చింది…! అయినా గొర్రెల మందలు అటాక్స్ చేస్తాయా..!? అయినా అనసూయ మాటలకు అర్థాలు ఏముంటాయిలే…!
Share this Article