హబ్బ… ఏం సక్సెస్ స్టోరీ..? జస్ట్, చేతిలో అయిదారు వేల రూపాయలతో మొదలుపెట్టి, స్టాక్ ఎక్స్‌ఛేంజీలతో, స్టాక్ మార్కెట్లతో ఆడుకున్నాడు… 40 వేల కోట్లు సంపాదించాడు… ఇది కదా సక్సెస్ అంటే… ఇది కదా లైఫ్ అంటే… ఇది కదా థ్రిల్ అంటే… ఇలా మీడియా, సోషల్ మీడియా మస్తు రాసేశాయి రాకేష్ ఝన్‌ఝన్‌వాలా గురించి… తను సంపాదించిన డబ్బును మాత్రమే చూశారు, కానీ ఎందుకు తను కేవలం 62 ఏళ్లకే చనిపోయాడో మాత్రం పట్టించుకోలేదు…
ప్రస్తుత ఆయుప్రమాణాల కోణంలో 62 ఏళ్ల వయస్సు మరణించాల్సిన వయస్సేమీ కాదు… 60 ఏళ్లు అంటే గతంలో ముసలితనం… ఇప్పుడు జస్ట్, మధ్యవయస్సు… మరి ఈ బిగ్‌బుల్ ఎందుకు చనిపోయాడు..? సింపుల్… ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి తన జీవితానికి పర్‌ఫెక్ట్‌గా వర్తిస్తుంది… ఒక దశలో తన దగ్గరకు ప్రధాని వచ్చినా వీల్ చెయిర్ నుంచి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాడు… తనకు బాగా నచ్చిన కజరారే పాట వేసుకుని, వీల్ చెయిర్‌లోనే కాళ్లూ చేతులూ ఊపుతూ డాన్స్ చేశాడు… గత ఆరు నెలల కాలంలో నాలుగు నెలలు పదే పదే బ్రీచ్‌కాండ్ హాస్పిటల్ చుట్టూ తిరిగాడు…
కిడ్నీ సమస్యలు, డయాలిసిస్… ఎన్నో ఏళ్లుగా ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండేది కాదు… అంటే కనీస వ్యాయామం కూడా ఉండేది కాదు… దానికి తోడు రోజూ ఆరేడు పెగ్గుల మద్యం తప్పనిసరి… 20-25 సిగరెట్లు తగలేసేవాడు రోజూ… ఏ సమయానికి ఏం తింటున్నాడో తనకే తెలియదు… ఫలితంగా సుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయేవి… ఒక అరాచకమైన లైఫ్ స్టయిల్… ఏమాత్రం ఆరోగ్యస్పృహ లేదు…
Ads
నిజానికి ఇదంతా సోషల్ మీడియాలో ఓ ముంబైవాసి రాసుకొచ్చిన వివరాలు… అబద్ధాలో నిజాలో తెలియదు… అబద్ధాలే అయినా సరే ఓసారి చదవాల్సిన విషయమే… ఓ చేదు నిజం ఏమిటంటే..? తను స్టార్ హెల్త్ షేర్లలో బాగా ఇన్వెస్ట్ చేశాడు… కోట్ల మంది తమ వైద్య అవసరాల కోసం ఆశ్రయిస్తున్న బీమా కంపెనీ… కానీ తన అనారోగ్యానికి మాత్రం ఆ షేర్లలో పెట్టిన ఒక్క రూపాయి కూడా ఉపయోగపడలేదు… (ఏటా వందల కోట్ల టర్నోవర్ ఉన్న మెడికల్ డిస్ట్రిబ్యూషన్, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో ఆర్థిక సంబంధాలు, భాగస్వామ్యాలున్నా కరోనా కాలంలో ఓ హైదరాబాదీ సేటు అనాథగా చితిమంటల్లో కాలిపోయిన విషాదం చదువుకున్నాం కదా… బ్యాడ్ టైమ్…)
అరాచకమైన అనారోగ్య జీవనవిధానంతో సుగర్, తత్సంబంధ సమస్యలు పెరిగాయి… ESRD ( End Stage Reanal Disease)… HD ( haemodialysis )… ఇది మెడికల్ టర్మినాలజీయే… కానీ తనను మరణానికి వేగంగా చేరువ చేసిన స్థితులు… 40 వేల కోట్లు పోగేసుకున్న రాకేష్ చివరకు తనతో ఏం తీసుకుపోయాడు..? అదే ప్రశ్న… కరోనా దుర్దినాల్లో పదే పదే వినిపించిన అదే ప్రశ్న ఇక్కడ కూడా… ‘‘ఆరోగ్యాన్ని కొనలేం, సంపాదించలేం, మెయింటెయిన్ చేయాలి..’’ అనే గోల్డ్ సూక్తిని మరోసారి గుర్తుచేస్తోంది రాకేష్ లైఫ్…
తన మరణవార్తలు చదవండి, అన్నింట్లోనూ మీకు గుండెపోటు అనే కనిపిస్తుంది… సివియర్ కార్డియాక్ అరెస్ట్… నిజమే, దానికి కారణాలేమిటనేది ముఖ్యం కదా… సరే, ఇంతకన్నా అరాచకమైన లైఫ్ స్టయిల్‌తో కూడా ఎనభై, తొంభై ఏళ్లు దుక్కల్లా బతికిన వాళ్లున్నారు… బతుకుతున్న వాళ్లూ ఉన్నారు… మరి వాళ్ల సంగతేమిటి అంటారా..? వాళ్లు పుట్టుకతో తెచ్చుకున్న మంచి బాడీ కాన్‌స్టిట్యూషన్, గుడ్ డెస్టినీ… వాళ్లే ఈలోకంలో నిజమైన అదృష్టవంతులు…!!
Share this Article