2023 ఆస్కార్ బరిలో Jr. NTR..? జేమ్స్ బాండ్‌గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్‌లో వినిపిస్తున్న రెండు వేర్వేరు వార్తలు ఇవి ! హాలీవుడ్‌కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం 2023 ఆస్కార్ అవార్డులకి గాను రాజమౌళి బ్లాక్ బస్టర్ RRR ని నామినేట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది! ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ లో RRR ని ఆస్కార్ అవార్డ్ కోసం జ్యూరీకి పంపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అలాగే ఉత్తమ విదేశీ చిత్ర నటుడు విభాగంలో జూనియర్ NTR ని ప్రతిపాదించాలనే విషయం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తమ దర్శకుడు విభాగానికి రాజమౌళి పేరుని కూడా ప్రతిపాదించే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఆ కథనం తెలిపింది…
నిజానికి సర్దార్ ఉద్ధమ్ [Sardar Udham] సినిమాని కూడా ఆస్కార్ నామినేషన్ కోసం పంపించాలనే ప్రతిపాదన మొదట్లో ఉండేది. విక్కీ కౌశల్‌ని ఉత్తమ నటుడు విభాగంలో ఉంచి, పరిశీలనకు పంపించాలని అనుకున్నారు. కానీ ఆస్కార్ జ్యూరీ బ్రిటీష్, అమెరికన్లతో ప్రభావితం అయిఉంటుంది కాబట్టి, జలియన్వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి, సర్దార్ ఉద్ధం ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళి జనరల్ డయ్యర్ ని హత్య చేసే నేపథ్యం ఉంది కాబట్టి, ఆస్కార్ జ్యూరీ ఈ సినిమాని పక్కన పెట్టే అవకాశం ఉంది.
ఆస్కార్ అవార్డ్ కోసం ఏ చిత్రాన్ని పంపాలనే నిర్ణయం తీసుకునే భారత జ్యూరీలోని సభ్యుడు సుమిత్ బసు సర్దార్ ఉద్దం సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉందనీ, క్లైమాక్స్ సీన్ రావడానికి చాలా సమయం తీసుకున్నాడనీ అంటున్నాడు… దర్శకుడు యంటీ క్లైమాక్స్ సీన్ కి ముందు చాలా డ్రాగ్ చేశాడు అంటూ తన అభ్యంతరం చెప్పాడు. మరో సభ్యుడు ఇంద్ర దాస్ గుప్తా మాట్లాడుతూ సర్దార్ ఉద్ధం సినిమా బ్రిటీషర్స్ పట్ల మన ద్వేష భావాన్ని ప్రతిబింబిస్తున్నది కాబట్టి, పరిశీలన దశలోనే ఆస్కార్ జ్యూరీ ఈ సినిమాని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పరిశీలనకు పంపించకపోవడమే ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు…
Ads
RRR ని ఆస్కార్ కోసం పంపించడం మీద భిన్నమయిన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. బ్రిటన్ కి చెందిన స్పెక్టేటర్ అనే వెబ్సైట్ మాత్రం RRR నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ తన అసహనాన్ని వ్యక్తీకరించింది ఇప్పటికే… RRR సినిమా రెసిజమ్ [జాతి వివక్ష ]ని ప్రోత్సహిస్తున్నది అంటూ వాపోయింది…. NetFlix RRR సినిమా హక్కులు కొనడం మీద అసంతృప్తి వ్యక్తం చేసింది స్పెక్టేటర్ వెబ్ సైట్… నిజమే, చరిత్రని చరిత్రగా చూపించాలి అంటే తెల్ల జాతీయులని మహానుభావులుగానే చూపించాలి. అప్పుడే స్పెక్టేటర్ లాంటి వెబ్సైట్స్ సంతోషంగా ఉంటాయి…
రామ్ చరణ్ జేమ్స్ బాండ్ అవుతాడా ?
సాధారణంగా భారతీయ నటులని జేమ్స్ బాండ్ పాత్ర కోసం ఇంతవరకు ఆలోచించలేదు ఎవరూ… కానీ అనూహ్యంగా మార్వెల్ సిరీస్ సృష్టి కర్త అయిన ల్యూక్ కేజ్ [Luke Cage ] మాత్రం ప్రస్తుతం రాబోయే జేమ్స్ బాండ్ సినిమా కోసం కొత్త నటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ, RRR లో నటించిన రామ్ చరణ్ పేరుని సూచిస్తూ, జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాతలని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశాడు… ‘‘జేమ్స్ బాండ్ కి కావలసిన అన్ని అర్హతలు రామ్ చరణ్ లో ఉన్నాయి. రామ్ చరణ్ పేరుని కూడా పరిశీలనలోకి తీసుకుంటే మంచిది. ఇప్పటికే నలుగురు నటులు లిస్ట్ లో ఉన్నా రామ్ చరణ్ ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిది అని సూచిస్తున్నాను..’’
ఇలా ల్యూక్ కేజ్ ట్వీట్ చేసిన తరువాత అతనికి మద్దతుగా కొంతమంది హాలీవుడ్ విమర్శకులు ల్యూక్ కేజ్ ని సమర్ధిస్తూ, మేము కూడా RRR ని చూసాము, మాకు రామ్ చరణ్ లో ఆ పొటెన్షియల్ ఉందని అనిపిస్తున్నది. రామ్ చరణ్ 007 కి సరిపోతాడు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇది కార్యరూపం ధరించే దాకా నమ్మకం లేదు కానీ పోటీలో రామ్ చరణ్ ఉండడం కొంచెం సంతోషం కలిగించే వార్తే అవుతుంది… అఫ్కోర్స్ ఒక భారతీయ నటుడి పేరును ప్రతిష్టాకరమయిన 007 పాత్ర కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు ఇంతవరకు… కనీసం ప్రాబబుల్స్‌లో ఐనా ఇలా చోటు దక్కినందుకు సంతోషం…
Share this Article