క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చైనా అన్ని దేశాలకంటే ముందుంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందుంది. 2017 లో మొదటిసారిగా ఫోటాన్లని 73 నుండి 113 వరకు డిటెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో రెండు వేగవంతమయిన క్వాంటమ్ కంప్యూటర్లని తయారు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నది. వీటిని ఫోటానిక్ మరియు సూపర్ కాండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ [photonic and superconducting quantum computing] అని పిలుస్తారు.
ప్రతీ సిగ్నల్ లో ఉండే క్వాంటమ్ Key ని తీసుకొని దానిలో ఉండే సమాచారాన్ని డీకోడ్ చేయాలంటే ఆ సిగ్నల్ ని తీసుకున్న శాటిలైట్ కానీ లేదా భూమి మీద ఉండే యాంటెన్నా కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థని కలిగి ఉండాలి, అలాగే దాని వేగం కూడా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇంతా చేస్తే ఆ సిగ్నల్ లో ఉండే సమాచారం ఏమిటో దానిని సృష్టించిన వాళ్ళకే తెలుస్తుంది తప్పితే వేరే దేశానికి తెలియదు. ఈ పద్ధతి ఇప్పటివరకు అత్యంత సురక్షితమయిన కమ్యూనికేషన్ టెక్నాలజీ !
Ads
ఒకప్పుడు బ్లాక్ బెర్రీ ఫోన్ మెసేజెస్ End to End ఎన్క్రిప్షన్ కలిగి ఉండేవి కాబట్టి FBI, CIA లాంటి సంస్థలకు కూడా బ్లాక్ బెర్రీ ఫోన్లని హాక్ చేయడం వీలయ్యేది కాదు, కానీ క్వాంటమ్ Key దానికంటే అత్యంత క్లిష్టమయిన వ్యవస్థని కలిగి ఉంటుంది. డీకోడ్ చేయడం సాధ్యం కాదు. చైనా తన పవర్ గ్రిడ్ ని వేరే దేశం శాటిలైట్ ద్వారా ధ్వంసం చేయకుండా, తన స్వంత శాటిలైట్ మరియు గ్రౌండ్ యాంటెన్నాల ద్వారా క్వాంటమ్ కంప్యూటేషన్ చేసింది. దాని కమాండ్ సెంటర్ తైవాన్ దేశానికి సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పింది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పవర్ గ్రిడ్ ని కంట్రోల్ చేసే వ్యవస్థని ఎవరూ ధ్వంసం చేయలేరు.
క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో చైనా అమెరికా కంటే చాలా అడ్వాన్స్ గా ఉంది. అయితే ఈ టెక్నాలజీని అమెరికా నుండి దొంగిలించి దానిని అభివృద్ధి చేసుకుంది. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మిగతా దేశాలు ఎందుకు అడ్వాన్స్ గా లేవు ? చాలా చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని అది. అంత పెద్ద మొత్తంలో ప్రయోగాలు చేయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లని ఖర్చు చేయాలి, పోనీ ఖర్చు చేసినా ఫలితం ఉంటుందా ? చెప్పడం కష్టం… అలా ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. సమయం, డబ్బు ఖర్చుచేస్తూనే ఉండాలి.
చైనా దగ్గర కావలసినంత డాలర్ రిజర్వ్ ఉంది. అలాగే సెమీ కండక్టర్ రంగంలో చైనా మొదటి నుండి ముందుంది. కాబట్టి కావలసిన ఎలెక్ట్రానిక్ విడిభాగాలని తానే స్వంతంగా తయారు చేసుకోగలదు అలాగే ప్రయోగాల మీద ఖర్చు పెట్టగలదు. ప్రస్తుతం చైనా ఇప్పుడున్న దశకి రావడానికి 15 ఏళ్ల నిరంతర కృషి ఉంది. యుద్ధ ప్రాతిపదికన క్వాంటమ్ కంప్యూటింగ్ మీద బిలియన్ల కొద్దీ డాలర్లని ఖర్చు చేసింది. వేల మంది శాస్త్రవేత్తల నిరంతర కృషి ఉంది. 2005 వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ లో చైనా పోటీలో లేదు. ఇప్పుడు అమెరికా, యూరోపు దేశాలని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది 2017 నుండి…
సో, ప్రస్తుతం శ్రీలంక దక్షిణ రేవు అయిన హంబన్తోటలో లంగరు వేసి ఉన్న యువాన్ వాంగ్ 5 అనే గూఢచార నౌక అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ తో గూఢచర్యం చేస్తుంది కాబట్టి దానిని ఎవరూ అడ్డుకోలేరు. అంత సామర్ధ్యం ఉన్న అమెరికా మౌనంగా ఉండి, తన పని తాను చేసుకుపోయేది కదా ? కానీ ఎందుకు అభ్యంతర పెట్టింది ? తాను ఏమీ చేయలేదు కనుక ! ఈ విషయంలో మనం చేయగలిగింది ఒక్కటే ! దానిని మిసైల్స్ తో సముద్రంలో ముంచివేయడమే ! (ఆ నౌక తనే నిన్న శ్రీలంకను వదిలిపెట్టింది)
యుద్ధం అంటూ వస్తే, చైనాని దెబ్బ కొట్టాలంటే, ముందుగా అంతరిక్షంలో ఉన్న అత్యాధునిక ఉపగ్రహలని యాంటీ శాటిలైట్ మిసైళ్ళ తో కూల్చివేయాలి. అయితే ఈ పని చైనా కూడా చేయగలదు. పనిలో పనిగా కమ్యూనికేషన్ సాటిలైట్స్ ని కూడా కూల్చివేయగలదు కాబట్టి అంతరిక్షంలోని ఉపగ్రహాలని కూల్చకుండా ఒక ఒప్పందాన్ని చేసుకోవాలి అని అమెరికా ఎప్పటి నుండో ప్రతిపాదిస్తున్నది కానీ ఎవరూ ముందుకు రాలేదు ఇంతవరకు. ఇలాంటి ఒప్పందాలని యుద్ధ సమయంలో ఎవరు గౌరవిస్తారు ? ఒకరి కమ్యూనికేషన్ ఉపగ్రహాలని ఇంకొకరు కూల్చుకుంటూ వెళితే ప్రపంచం మొత్తం 1950 ల నాటికి వెళ్ళిపోతుంది…
చూస్తూ చూస్తూ చైనాని ఇంతవరకు తెచ్చిన ఆమెరికాది పెద్ద తప్పు ! ఆర్ధికంగా ఎదగడానికి అమెరికా, యూరోపు దేశాల దిగుమతులు చైనాకి లాభించాయి. పాకిస్థాన్, చైనాలకి మద్దతు ఇస్తూ భారత్ ని ఇరుకున పెట్టడానికి చైనాకి ఇతోధికంగా తోడ్పడింది అమెరికా !
బరాక్ ఒబామా రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా నుండి ఆయుధాలు, ఫార్మసీ, బయో టెక్నాలజీ, ఎలెక్ట్రానిక్స్ రంగాలకి చెందిన కీలక సమాచారం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది. బరాక్ ఒబామా యంత్రాంగం మాత్రం చైనా దొంగిలించింది పాత తరం టెక్నాలజీ అంటూ వెకిలి నవ్వు నవ్వింది. ఇప్పుడు ఏమయింది ? గత అయిదేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో చైనా నౌకాస్థావరాన్ని కడుతున్నా సరే, చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది తప్ప ధైర్యం చేసి దాడి చేయలేకపోయింది. ఎందుకంటే చైనా దేశం ఇరాక్, లిబియా లాంటి దేశం కాదు కదా ? గుడ్డిలో మెల్లలాగా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద పన్నులు పెంచాడు. చైనా టెలీకమ్యూనికేషన్లకి అమెరికాలో వ్యాపారం చేయకుండా అడ్డుకున్నాడు.
జర్మనీని హిట్లర్ టెక్నికల్ గా అభివృద్ధి చేసి ప్రపంచానికి సవాల్ విసిరాడు. బ్రిటన్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కలిసి జర్మనీని ఓడించలేకపోయాయి… అమెరికా మాత్రం ఆయుధాలు అమ్ముకుంటూ చూస్తూ ఉండిపోయింది తప్ప కలుగచేసుకోలేదు… చివరకి జర్మనీకి కూడా ఆయుధాలు అమ్మింది… కానీ జపాన్ పేరల్ హార్బర్ మీద దాడి చేయగానే తప్పనిసరి పరిస్థితులలో తాను కూడా యుద్ధంలో కాలుమోపింది. సోవియట్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కలిసి జర్మనీని లొంగదీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు చైనా జర్మనీ స్థానంలోకి వచ్చి కూర్చున్నది. మళ్ళీ ప్రపంచం మొత్తం ఏకమయితే కానీ చైనాని లొంగదీయలేరు… కానీ అది అతి పెద్ద విలువయిన యుద్ధం అవుతుంది. అన్ని దేశాలు కనీసం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాయి…
ప్రస్తుతం ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ విషయంలో చైనా ముందున్నది. చైనా టార్గెట్ అమెరికా కానీ మన దేశం కాదు. కాబట్టి ప్రతి దానికి చైనాని భారత్ ఛాలెంజ్ చేయాలి అని అనడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి చైనాని ఛాలెంజ్ చేసే ప్రక్రియ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదలయ్యింది కాబట్టి ఇప్పటికిప్పుడు మెరుపు ఫలితాలని ఆశించవద్దు. శత్రువు ఎంతటి బలవంతుడో తెలుసుకొని డానికి అనుగుణంగా మెలగాలి తప్పితే ఊకదంపుడు వ్యవహారాలని చేయకూడదు. కుదరవు… ప్రస్తుత రోజుల్లో యుద్ధం అంటే వోడిన వాడు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడు అన్న చందంగా ఉంటుంది. ఉక్రెయిన్ ఆస్తులని నష్టపోయి ఏడుస్తుంటే, రష్యా ఇప్పటివరకు పెట్టిన ఖర్చుని చూసి ఏడుస్తున్నది ! అంచేత అతి ప్రచారం చేయకూడదు !
Share this Article