ఒక బయోపిక్… అదీ ఓ అడల్ట్ స్టార్ స్టోరీ… దాన్ని సినిమాగా తీయాలంటే ఎంత వర్క్ జరగాలి, స్క్రీన్ ప్లే, కథ, టేకింగ్, డైలాగ్స్,… ఎంత స్టడీ జరగాలి..? అదేమీ లేకుండా సినిమా చుట్టేస్తే ఎలా ఉంటుంది…? కచ్చితంగా షకీలా మార్క్ బీ గ్రేడ్ సినిమాాలాగే ఉంటుంది… అవును, అదే జరిగింది… షకీలా బయోపిక్ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది… ఆమె జీవితం మీద కాదు, ఆమె జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే ఈ సినిమా మీద జాలి కలుగుతుంది…
ఓ పేద ఎక్స్ట్రా ఆర్టిస్టు… ఆమె బిడ్డ… బోలెడంత సంసార బాధ్యత… ఓ బిడ్డను వ్యభిచారంలోకి…. సరిగ్గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ మార్కు వ్యభిచారంలోకి తోసేయడం అంటే…, దాని వెనుక బోలెడంత వేదన, వ్యథ ఉంటయ్… అదుగో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో షకీలా సినిమా నిర్మాత ప్లస్ బోలెడు మంది స్క్రిప్టు రైటర్లు అడ్డంగా ఫెయిలయ్యారు… సేమ్, ఆమే బీ గ్రేడ్ సినిమా కథల్లాగే..
Ads
షకీలా సినిమా అంటే… ఓ అడల్ట్ కంటెంటు… బూతు… విచ్చలవిడితనం…, దాన్ని జస్టిఫై చేయాలంటే… ప్రేక్షకుడిని ఆమె జీవితంతో జర్నీ చేయించాలంటే… ఎంత అధ్యయనం, ఎంత కసరత్తు జరగాలి..? అదేమీ లేదు… సేమ్, అప్పట్లో షకీలా సినిమా తరహాలోనే ఈ సినిమాను కూడా చుట్టేశారు… ఓ ఆత్మ లేకుండా…
ఇక్కడ షకీలా సినిమాలో పాత్రధారుల గురించో, వారి నటన గురించో చెప్పుకోవడం శుద్ధ దండుగ… ఎందుకంటే..? బేసిక్ కథాక్రమంలోనే తేడా ఉంది గనుక… అసలు ఈ నిర్మాతలు షకీలా మనసును అర్థం చేసుకోవడంలోనే ఫెయిలయ్యారు గనుక…
ఎస్.., సిల్క్ స్మిత, షకీలా మాత్రమే కాదు…. బోలెడు మంది, హెలెన్, జయమాలిని, జ్యోతిలక్ష్మి ఎట్సెట్రా బోలెడు మంది… కానీ ఎవరి జీవితం వారిది… అసలు ఆడదాన్ని ఓ సెక్స్ ఆబ్జెక్టుగా చూసే చిల్లర ముం-కొ-కులయిన హీరోలు, వారి చెత్తా ఫ్యాన్స్… ఇక్కడ ఆపేద్దాం… ఎవడూ శుద్దపూస కాదు… దరిద్రపు ముం-కొ….
కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగామా..?
బయోపిక్ అంటే పూర్తిగా నిజజీవితం ఏమీ ఉండదు, చెప్పరు… అది అందరికీ తెలిసిందే… కనీసం కొంతైనా నిజయో, నిజాయితీయో ఏడవాలి కదా… ఈ షకీలా బయోపిక్కే చూసుకుందాం… మచ్చుకు… ఆమెది కేరళలోని వల్లంకులం కాదు… ఆంధ్రప్రదేశ్లోని కోట… మరి చిన్నప్పుడే ద్రౌపది వేషం ఏమిటి..? వస్త్రాపహరణ ఎపిసోడ్ ఏమిటి..? అదెక్కడ జరిగింది..?
వోకే.., ఆమె ఫిగర్ మళయాళీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నవేళ… పెద్ద హీరోల సినిమాల కలెక్షన్లకు తాత్కాలిక అడ్డంకులో, గండ్లు పడ్డాయి సరే…, ఆ స్టార్ హీరో ఏమిటి…? ఆమె ఫిగర్ కోసం అలా దిక్కుమాలిన ఆకర్షణ వ్యవహారంలోకి పడిపోవడం ఏమిటి..? వాడు సైగ చేస్తే వందల మంది కదా… ఆమె సినిమా కలెక్షన్లతో ఈర్ష్య అనేదీ అసాధారణమే… మాస్ హీరోల సినిమాలకు ఈమె బీ గ్రేడ్ మసాలా సినిమాల సీన్ ఎంత..? వాళ్లు భయపడ్డారు అనేది నిజమేనా..? మరీ అతిశయోక్తి కదా…
పైగా దాన్ని పరిగణనలోకి తీసుకుని, షకీలాపై కక్షతో మొత్తం కేరళ సమాజాన్నే ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేయడం సాధ్యమేనా..? నవ్వొచ్చే స్క్రిప్టు… వాడెవడో చెప్పగానే అప్పటిదాకా గుండెల్లో గుడికట్టుకుని, విజిళ్లు వేస్తూ ఆమెను ఆరాధించే సమాజం ఆమెను ఛీకొట్టిందా..? అసలు నిజం ఏమిటి..?
ఏదో బీ గ్రేడ్ కేరక్టర్… క్రమేపీ బరువు పెరిగింది… జనం ఇక ఛీకొట్టడం స్టార్ట్ చేశారు, ఆమె పట్ల ఆకర్షణ తగ్గింది జనంలో… కానీ అది చెప్పే ధైర్యం లేదు దర్శకుడికి… పైగా స్మిత కథ ఆధారంగా తీసిన డర్టీ పిక్చర్తో పోలిక..? ఠాట్… స్మిత కథ వేరు… మరణించేవరకూ ఆమె ఆరాధ్యదేవతే… ఆమె కళ్ల మాయ… ఆమె ఫిగర్ మాయ… క్లాస్ ప్లస్ మాస్… స్మితకు షకీలాకు పోలిక ఏమిటసలు..?
ఇక్కడ నిర్మాణ విలువలు, నటీనటుల ప్రతిభ గట్రా చెప్పుకోవడం వేస్టు… పాటలు, స్క్రీన్ ప్లే, మాటలు గట్రా చెప్పుకోవడం వేస్టు… అసలు షకీలా సినిమా అంటే బీ గ్రేడ్… ఎస్.., ఆమె బయోపిక్ కూడా సేమ్… సేమ్… ఇంతకుమించి చెప్పుకోవడమూ వేస్టు… వేస్టున్నర… ఆమె సినిమా కష్టాలు నిజమే కావచ్చు, కానీ వేలాది మంది ఎక్సట్రా ఆర్టిస్టుల జీవితాలన్నీ ఇంతే కదా… కొత్తగా ఏం ఫీల్ కావాలి..? ఫీల్ కావడానికి ఈ సినిమాలో ఏమీ లేదు… !!
Share this Article