నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం…
అస్సోం చీఫ్ మినిస్టర్ హిమంత విశ్వ శర్మ ప్రత్యేకంగా ఒక ఏనుగు రెస్క్యూ కోసం అటవీ మంత్రి సహా నలుగురు సభ్యుల ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, తమిళనాడుకు పంపిస్తున్నాడు… అదీ వార్త… క్రూరహింసకు గురైన ఆ ఏనుగును తిరిగి తమ రాష్ట్రానికి తీసుకుపోవడానికి ఆ కమిటీ… కానీ ఎందుకలా..? తమిళనాట ప్రతి గుడిలోనూ ఓ ఏనుగు కనిపిస్తుంది… వాటి పోషణకు మావటీలు ఉంటారు… దేవస్థానాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాయి… మరి ఈ ఏనుగు దుస్థితి ఏమిటి..?
అస్సోం నుంచి ఏనుగులు ఏ పద్ధతిలో తమిళనాడుకు వెళ్తున్నాయి… వాటి నిర్వహణ, పోషణ ఎలా ఉంది..? ఇప్పుడు జయమాలను అవసరమైతే తిరిగి అస్సోంకు తిరిగి తీసుకురావడమే గాకుండా… ఇతర ఏనుగుల పరిస్థితేమిటో ఆ హైలెవల్ కమిటీ అధ్యయనం చేయనుంది… వాటి మీద సాగుతున్న క్రూరహింసకు తెరవేయడం ఎలా..? వాళ్లకు అప్పగించిన మరో టాస్క్ అది..! తమిళనాడు ప్రభుత్వం మాత్రం కిక్కుమనడం లేదు..!!
Ads
Share this Article