నాయకులైతేనేం… వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉండవా అని ప్రశ్నిస్తుంటారు చాలామంది… నిజానికి ఆ ప్రశ్న సరికాదు… సెలబ్రిటీలు, సొసైటీ మీద ప్రభావం చూపించగలవాళ్ల జీవితాలు స్ఫూర్తిమంతంగా ఉండాలి… పోనీ, ఆదర్శంగా ఉండకపోయినా సరే, కాస్త నైతికంగా హుందాగా సంస్కారయుతంగా ఉండాలని కోరుకుంటే తప్పేముంది..? మళ్లీ ఇక్కడ ఏది ఆదర్శం, ఏది నైతికం, ఏది హుందాతనం అనే ప్రశ్నల్లోకి వెళ్లకుండా… విషయంలోకి వెళ్దాం…
మమతా బెనర్జీ తెల్లారిలేస్తే లక్ష నీతులు చెబుతూ ఉంటుంది… కానీ తన పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ టూ స్థానం వెలగబెట్టిన పార్థా ఛటర్జీ బాగోతం చూశాం కదా… ఓ సినిమా నటితో యవ్వారం, ఆమె ఫ్లాటులో తనిఖీలు చేస్తే 50 కోట్లు… మరోచోట మరో 50 కోట్లు… ఎన్ని ‘ఫ్లాట్లు’ ఉన్నాయో సారు గారికే లెక్క సరిగ్గా తెలియనట్టుంది… అవినీతి అనే అంశం ఇప్పుడు పార్టీని కుదిపేస్తోంది… ఎంపీ కమ్ నటి నుస్రత్ జహాన్, ఎంపీ కమ్ నటి మిమి చక్రవర్తి, ఎమ్మెల్యే కమ్ నటి జూనె మలియా వంటి సెలబ్రిటీ నాయకుల సంపాదన మీద రాష్ట్ర మంత్రి శ్రీకాంతో మహతో బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నాడు…
Ads
పార్టీలో అంతర్గతంగా చర్చ జోరుగా నడుస్తోంది… ఇక్కడ నుస్రత్ జహాన్ పేరు మరోసారి చదవండి… గుర్తుంది కదా… ఈమె బాగోతం… ఓ ధనిక వ్యాపారి నిఖిల్ జైన్‌ను పడేసింది… పెళ్లి కూడా చేసుకుంది… ఏడాదిలోనే గొడవలు… దూరంగా ఉన్నారు… ఆయన విడాకులకు అప్లయ్ చేస్తే, అసలు టర్కీలో జరిగిన పెళ్లికి చట్టబద్ధత ఏముంది, విడాకుల్లేవుఫో అనేసింది… అంటే ఇండియాలో జరిగితేనే చట్టబద్ధతా..? ఆమెను అడిగేవాళ్లు ఎవరు..? తరువాత యశ్‌దాస్‌గుప్తా అని ఓ బీజేపీ నాయకుడు కమ్ నటుడిని పడేసింది…
కొడుకు పుట్టాడు… కొన్నాళ్లు సస్పెన్స్ మెయింటెయిన్ చేసీ చేసీ… యశ్‌దాసే నా కొడుక్కి తండ్రి అని ప్రకటించింది… తిక్క కేసు అనుకుంటున్నారా..? కాదు, నొటోరియస్… 2012లో… కలకత్తాలోని పార్క్ స్ట్రీట్‌లో… ఓ రాత్రి… సుజెతె జోర్డాన్ అనబడే ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ… ఇద్దరు పిల్లల తల్లి… 37 ఏళ్లు… లిఫ్ట్ ఇస్తామని చెప్పి అయిదుగురు వెహికిల్‌లో ఎక్కించుకుని, బెదిరించి, అత్యాచారం చేసి, కదులుతున్న ఆ వాహనం నుంచే ఆమెను బయటికి నెట్టేసి వెళ్లిపోయారు…
ఈమె పేరు దమయంతీ సేన్… టఫ్ ఐపీఎస్ ఆఫీసర్… కలకత్తాలోనే వర్క్… ముఖ్యమంత్రికి ఇష్టం లేదని తెలిసినా… సీనియర్ ఆఫీసర్లు వద్దని వారించినా వినలేదు… కేసును తవ్వింది, ఆ నిందితులు అయిదుగురు ఎవరో గుర్తించింది… పక్కాగా కేసు బిల్డప్ చేసి, వాళ్లలో ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టుకు ఎక్కించింది… మమతకు ఇదంతా సహజంగానే కోపం తెప్పించింది… ఈ దమయంతిని వెంటనే లూప్‌లైన్‌లో పడేసింది… సీన్ కట్ చేస్తే… అయిదుగురిలో ముగ్గురు దొరికారుగా… మరో ఇద్దరు పరారీ… ఒకడు కాదర్ ఖాన్, మరొకడు మొహమ్మద్ ఆలీ…
సదరు కాదర్ ఖాన్ ఈ నుస్రత్ జహాన్ గతంలో ప్రేమికులు… ఈ కాదర్ దుబయ్ వెళ్లిపోయాడని కొందరు, కలకత్తాలోనే అజ్ఞాతంలో ఉన్నాడని కొందరు చెప్పుకోసాగారు… ఈలోపు… అంటే 2015లో సదరు బాధితురాలు మెనింజైటిస్‌తో మరణించింది… పాపం, చాలాకాలం మహిళ హక్కులు, ప్రత్యేకించి రేప్ బాధితులు, గృహహింస బాధితుల యాక్టవిస్టుగా పనిచేసేది… కలకత్తా పోలీసులకు అనుకోకుండా 2016లో కాదర్, ఆలీ ఆచూకీ సమాచారం దొరికింది… ఘజియాబాద్ సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు… ప్రశ్నిస్తే నుస్రత్ ముంబైలోని హోటళ్లలో వేర్వేరు పేర్లతో రూమ్స్ బుక్ చేసేదనీ, వీళ్లు అక్కడ తలదాచుకునేవాళ్లనీ తేలింది…
నుస్రత్ ఇన్‌స్టాగ్రాం చూస్తే బికినీ ఫోటోలు సహా అనేక విచ్చలవిడి ఇమేజెస్… ఇప్పుడు బిగ్‌బాస్-16 సీజన్‌లో పార్టిసిపేట్ చేస్తుందట… కలర్స్ టీవీలో సల్మాన్ ఖాన్ హోస్టుగా ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంటుంది… హిందీ బిగ్‌బాస్ అవాంఛనీయ పోకడలు, అశ్లీల ధోరణులకు అడ్డా… ఈమె ఒక ఎంపీగా ఉండి, అందులో వెళ్లడం అనే వార్తే విస్మయకరంగా ఉంది… వారానికి ఎంత చెల్లించాలి అనే దగ్గర సంప్రదింపులు సాగుతున్నాయిట…
అబ్బే, తప్పేముంది..? ఆమె వృత్తి అది, ప్రజల్ని ఎంటర్‌టెయిన్ చేయడమే ఆమెకు తెలిసింది, దాన్నెలా తప్పుపడతాం అంటారా..? అందుకే దీన్ని ఓ చిక్కు ప్రశ్న అనేది… ప్రజాజీవితంలో ఉన్నవాళ్ల బతుకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ల ప్రవర్తన, మాటతీరు ఎట్సెట్రా జనానికి కాస్త ఆదర్శంగా ఉంటే బాగుంటుందని కోరుకోవడంలో తప్పులేదు కదా…!!
Share this Article