పాకిస్థాన్ లో ఏదైనా సాధ్యమే ! హై ఎండ్ బెంట్లీ కారు[Bentley Mulsanne sedan] లండన్ లో దొంగిలించబడ్డది ! చివరికి అది పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోని ఒక బంగ్లాలో దొరికింది ! లక్జరీ బెంట్లీ కారు $3,00,000 [మూడు లక్షల డాలర్లు ] విలువగలిగినది… లండన్ నగరంలో ధనవంతులు ఉండేది DHA area… అక్కడ ఒక భవంతిలో పార్క్ చేసిన బెంట్లీ కారు చోరీకి గురయ్యింది కొన్ని వారాల క్రితం ! లండన్ పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు వాళ్ళకి.
UK నేషనల్ క్రైమ్ ఏజెన్సీ వాళ్లు [UK National Crime Agency] బెంట్లీ కారు కంపెనీ వాళ్ళని సంప్రదించారు… సదరు కారుకి ఉండే ట్రాకింగ్ పరికరం గురించి తెలిపారు కంపెనీ వాళ్లు… దాంతో ఆ కారుకి ఉన్న ట్రాకింగ్ పరికరం వెతకగా చివరికి అది పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోని ఒక భవంతిలో పార్క్ చేసి ఉన్నట్లు కనుక్కున్నారు. UK National Crime Agency అధికారులు వెంటనే పాకిస్థాన్ లోని Collectorate of Customs Enforcement (CCE) అధికారులకి సమాచారం ఇచ్చారు… సదరు అధికారులు కరాచీ నగరంలో ఉన్న ఆ భవంతి మీద దాడి చేసి కారుని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాళ్ళు కారులో ఉన్న ట్రేసింగ్ డివైజ్ ని స్విచ్ ఆఫ్ చేయలేకపోయారు… దాంతో దాని లొకేషన్ దొరికింది.
ఆ కారు తూర్పు యూరోపులోని ఒక దౌత్యవేత్త పేరుతో పాకిస్థాన్ లోని కరాచీ పోర్ట్ కి చేరుకుంది… అది దౌత్యవేత్త కారు కాబట్టి ఎలాంటి పన్నులు చెల్లించకుండా బయటికి తీసుకొచ్చారు… అలాగే కరాచీలో దానిని రిజిస్ట్రేషన్ చేయించి కరాచీ నంబర్ ప్లేట్ కూడా తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు సదరు యాజమానిని ప్రశ్నించగా ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేకపోయాడు. కారు యజమానితో పాటు అమ్మిన బ్రోకర్ ని కూడా అరెస్ట్ చేసిన తరువాత తెలిసింది ఏమిటంటే అది బోగస్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అని… మామూలుగా అయితే ఒక డిప్లొమాట్ కారుకి ఆ దేశ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు… అది ఏ దేశానికి చెందినది అయితే అదే దేశపు నంబర్ ప్లేట్ తో తిరగవచ్చు…
Ads
దాదాపుగా 3 కోట్ల పాకిస్తానీ రూపాయల కస్టమ్స్ పన్ను ఎగవేశారు దొంగలు. ఈ పని లండన్ లో ఉన్న పాకిస్తానీ జాతీయులు చేశారు కానీ వాళ్ళు ఎవరో ఇంతవరకు తెలియరాలేదు. కానీ ఒక ఖరీదయిన బెంట్లీ కారు లండన్ రేవు నుండి ఎలా పాకిస్థాన్ కి చేరుకుంది ? ఎవరికీ అనుమానం రాలేదా ? కనీసం కరాచీ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయకుండా వదిలేశారా ? పత్రాలు నకిలీవి అని కనిపెట్టలేకపోయారు సరే ! అది సదరు యూరోపు దేశపు రాయబార కార్యాలయం అధికారులు వచ్చి విడిపించుకు పోవాలి కదా ? సాధారణ పాకిస్తానీ పౌరులకి ఎలా అప్పచెప్పారు ? దొంగతనం జరిగిన వెంటనే దానిని సముద్రం దాటించేశారు అన్నమాట… అందుకే పాకిస్థాన్ లో ఏదయినా సాధ్యమే !!
Share this Article