కొన్ని పార్టీల ప్రచారం ఎలా ఉందో చూడండి… ప్రభుత్వం రాకెట్ల ద్వారా ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపి, వేల కోట్లు ఖర్చు పెడితే అంబానీ దానిని ఉచితంగా వాడుకుంటున్నాడు అట… ముఖేష్ అంబానీ వేలంలో పాల్గొని కొన్న స్పెక్ట్రమ్ విలువ Rs 88,078 వేల కోట్లు… ఈ డబ్బు దేనికి ఇస్తున్నాడు ప్రభుత్వానికి ? స్పెక్ట్రమ్ ని వాడుకుంటున్నందుకు కాదా ? స్పెక్ట్రమ్ ఏమైనా గాలిలో నుండి పుడుతుందా ? అంబానీ కట్టే 88 వేల కోట్ల రూపాయలు 20 సంవత్సరాల లైసెన్స్ ఫీజ్ కోసమే… అలాంటప్పుడు ప్రభుత్వం నుండి స్పెక్ట్రమ్ వాడుకోకుండా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించి వాడుకోవాలా ? వీళ్ళ ప్రచారం ఎలా ఉంది అంటే ఒక ప్రైవేట్ బస్ ఆపరేటర్ ప్రభుత్వానికి ఫీజు కట్టి, స్వంతంగా రోడ్లు వేసుకొని నడపాలి అని !
******************************************
సొంతంగా ఫైబర్ లైన్లు ఉండగా బీఎస్ఎన్ఎల్ దేనికి..?
Ads
మరో దుష్ప్రచారం… 5G కోసం BSNL ఫైబర్ నెట్వర్క్ ని అంబానీ ఉచితంగా వాడుకుంటాడు.. ఇంతకన్నా అబద్ధం ఉంటుందా ? రిలయన్స్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తన స్వంత ఫైబర్ లైన్ వేసుకున్నది. మరి గ్రామీణ ప్రాంతాలలో BSNL ఫైబర్ నెట్ వర్క్ ని అంబానీ ఉచితంగా వాడుకునే పనేముంది..? పైగా 5G కేవలం పెద్ద నగరాలలోనే అందుబాటులోకి వస్తుంది తప్పితే గ్రామీణ ప్రాంతాలలోకి ఇప్పట్లో రాదు. నగరాలలో లాభాలు బాగా ఉంటే తరువాత టైర్ 2 పట్టణాలలో ప్రవేశపెడతారు. ఇది జరగడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. చిన్న పట్టణాలలో కూడా లాభం వస్తే అప్పుడు గ్రామీణ ప్రాంతాలకి విస్తరిస్తారు. రిలయన్స్ ఫైబర్ నెట్ వర్క్ దేశం మొత్తం ఉంది అలాంటప్పుడు BSNL నెట్‌వర్క్ ఎందుకు వాడతాడు అంబానీ ?
********************************************
ఏకపక్షంగా వేలం సాగిందా..?
మోడీ అంబానీలతో కుమ్మక్కయి వేరే ఆపరేటర్లని వేలంలో పాల్గొనకుండా చేశాడనేది మరో పెద్ద అబద్ధం. ఎవడికి శక్తి ఉంటే వాడు వేలంలో పాల్గొంటాడు.
1) భారతి ఎయిర్ టెల్ – Rs 43,084 వేల కోట్లు పెట్టి పరిమితమయిన స్పెక్ట్రమ్ కొన్నది.
2. వొడా ఐడియా – Rs 18,784 వేల కోట్లు పెట్టి పరిమితమయిన స్పెక్ట్రమ్ కొన్నది.
3. రిలయన్స్ జియో – Rs 88,078 వేల కోట్లు పెట్టి ఎక్కువ బ్యాండ్లు కొన్నది.
4. ఆదానీ – Rs 212 కోట్లు పెట్టి ఒకే ఒక్క బ్యాండ్ కొన్నాడు. వీళ్ళంతా 7 రోజుల పాటు సాగిన వేలంలో పాల్గొని కొన్నారు. అంతేకానీ అంబానీ కుమ్మక్కయి మిగతా వాళ్ళని కొననివ్వలేదా ?
ఈ పార్టీలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే… వీళ్ళ సపోర్ట్ తో నడిచిన UPA ప్రభుత్వ హయాంలో ఎవరు పడితే వాళ్ళు టెలీకామ్ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకుండా చట్టం తెచ్చారు అని… ఎంత మొత్తానికి వేలం పాడుతారో అంత మొత్తానికి బాంక్ గ్యారంటీ చూపించగలిగిన వాళ్ళే వేలంలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది అని చట్టం చేసింది UPA2 ప్రభుత్వం… అలాగే కాషన్ డిపాజిట్ గా కనీసం 100 కోట్లు కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ పాట పాడిన తరువాత ఆ మొత్తాన్ని నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి కట్టకపోతే 100 కోట్లు ప్రభుత్వానికి వెళ్లిపోతాయి. UPA2 హయాంలో ఒక సంస్థ టెలీకామ్ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొని పాట పాడి, ఆ మొత్తాన్ని కట్టలేక చేతులు ఎత్తేసిన తరువాత కొత్త చట్టం రూపొందించారు. అంతే కానీ అంబానీ కుమ్మక్కు అవలేదు. 3G, 4G స్పెక్ట్రమ్ వేలంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పటివరకు తిరిగి రాలేదు ఏ టెలీకామ్ సంస్థకి కూడా… అందుకే 5G విషయంలో ఎక్కువ ఆసక్తి చూపలేదు. అంతే తప్ప ఇందులో ఎలాంటి స్కామ్ కనిపించడం లేదు… పోటీలో ఉండాలి అని ప్రస్తుతం కొన్నారు కానీ ఈ డబ్బు తిరిగి రాబట్టుకోలేము అన్న సంశయం ఉంది అందరిలోనూ…!
*************************************************************
4జీ పెట్టుబడులే ఇంకా తిరిగి రాలేదు…
ఇక టెలీకామ్ లైసెన్స్ ఫీజ్ విషయంలో అమెరికా, యూరోపు దేశాలకంటే మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయని బ్లూమ్ బర్గ్ పేర్కొన్నది. అలాగే కాల్,డాటా చార్జీలు అమెరికా, యూరోపు దేశాలకంటే భారత్ లోనే తక్కువగా ఉన్నాయని తెలిపింది. మన దేశంలో లైసెన్స్ ఫీజ్ ఎక్కువ… కాల్, డాటా ఛార్జీలు తక్కువ ! గత 20 ఏళ్ల అనుభవంతో టెలీకామ్ సంస్థలు కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టడంలో ఆసక్తి చూపకపోవడానికి కారణం ఇదే ! పైగా కోవిడ్ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో ప్రజలు కొత్త టెక్నాలజీ మీద ఖర్చు పెడతారా అన్న సందేహం ఉండనే ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న వాళ్ళు ఎలాగూ ఖర్చు పెట్టగలరు కానీ సామాన్యుడు ఇప్పుడు 4G తో సంతృప్తిగానే ఉన్నాడు, అలాంటిది ఎక్కువ వేగం కోసం 5 G కి మారతాడా ?
*************************************************************
కొత్తగా 5 G ఫోన్ కొన్నా, సిమ్ కార్డ్ 4G ఉన్నా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే 5g ఫోన్ హార్డ్ వేర్ టెక్నాలజీ వల్ల 4G సిగ్నల్ 10% ఎక్కువ వేగంతో పని చేస్తుంది… అలాగే 5G నెట్వర్క్ ఉన్న చోట 4G సిమ్ కార్డ్ ఉన్న ఫోన్లు పనిచేస్తాయి కాబట్టి అందరూ కొత్త ఫోన్లు కొనే అవకాశం ఇప్పట్లో ఉండదు…
*************************************************************
ఇక రిలయన్స్ జియో 5G ఫోన్లని తన సిమ్ కార్డ్ తో అమ్ముతుంది త్వరలో… బహుశా ధర 6 వేల లోపే ఉండవచ్చు. అలాగని జియో కేవలం వాళ్ళ ఫోన్లలోనే పనిచేస్తుంది అనే అపోహ వద్దు. మీరు ఏ బ్రాండ్ 5జీ ఫోన్ కొన్నా అన్ని నెట్వర్క్ ల మీద పనిచేస్తుంది… ఇప్పటికే 5G ఫోన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. రెండు రోజుల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో వివిధ బ్రాండ్ల 5G ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి… మోడీ త్వరలో తక్కువ ధరల చైనా స్మార్ట్ ఫోన్లను నిషేధించనున్నాడు… అది జరిగితే చైనాకు నష్టం… బహుశా లెఫ్ట్ పార్టీల శోకాలు అందుకేనేమో… వాళ్ల అభిమాన చైనా నాసిరకం కంపెనీలు పన్ను ఎగవేతల దందాలు కూడా ఈమధ్య చదివాం కదా…!!
**************************************************************
Share this Article