నాగార్జునలో ఎందుకో గానీ మునుపటి బిగ్ బాస్ హోస్ట్ కనిపించలేదు… పేలవంగా ఉంది మొదటి వీకెండ్ షో… బహుశా CPI నారాయణ చేస్తున్న హార్ష్ వ్యాఖ్యల ప్రభావం కాదు కదా..!! ఐనా నారాయణ మాటల్ని కూడా పట్టించుకుంటే ఎలా సార్… ఆయన పార్టీలోనే ఎవరూ పట్టించుకోరు…
టీవీ సీరియల్స్, బూతు సినిమాలు, విశృంఖల వెబ్ సీరీస్, పబ్బులు, రేవ్ పార్టీలు, లైంగిక దోపిడీలు… అసలు చుట్టూ ఎలాంటి బ్లూ కల్చర్ వ్యాప్తి చెందుతోందో సోయి లేదు… ఒక్క బిగ్ బాస్ హౌజ్ మాత్రం వ్యభిచార కొంప అని ముద్ర వేయడం దారుణం… ఆ పోటీదారులను, లేడీ సెలబ్రిటీలను ఏమని నిందిస్తున్నట్టు..? ఒక లెఫ్ట్ జాతీయ పార్టీకి తను కార్యదర్శి అట… ఫాఫం పార్టీ… చివరకు నాగార్జునను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తన హోదాకు, తన వయస్సుకు ఏమాత్రం తగని వ్యాఖ్యలకు దిగాడు కూడా…
సరే, హౌజ్ కి వస్తే… మామూలుగా వీకెండ్ షో అంటే ఒక వైపు ఎవరు బయటికి వెళ్ళాలో, ఎవరు అక్కడే ఉండాలో కొత్త కొత్తగా రివీల్ చేయాలి… సేమ్ టైం, వినోద ప్రధానంగా చిన్న చిన్న టాస్క్స్, పోటీలు, పాటలు, ఆటలు ఉంటాయి… కానీ ఈ శనివారం అవేమీ లేవు… మొత్తం అందరికీ రకరకాల అంశాల్లో హితవు చెప్పాడు, ఒకరిద్దరికి క్లాసులు పీకాడు… అంతే…
Ads
చివరకు ఈ షో ఎంత పేలవంగా సాగిందంటే… మామూలుగా ఎవరైనా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాం అని తెలిస్తే, ఆనందపడతారు, తోటివాళ్లు హగ్ చేసుకుని, హ్యాండ్స్ షేక్ చేసి అభినందిస్తారు కదా… ఈరోజు ఎలిమినేషన్ నుంచి బయటపడిన నామినేటెడ్ కంటెస్టెంట్లు శ్రీసత్య, చంటిని అభినందించినవాళ్లు లేరు… వాళ్ల మొహాల్లో కూడా ఆనందపు ఛాయలు కనిపించలేదు…
ఏదో తను వచ్చాడు… గంటన్నర గడిచిపోయింది… కంటెస్టెంట్లలో ఉత్సాహమేమీ లేదు… షో ముగిసింది… ఇదేనా వీకెండ్ షో..? ఇదేం వినోదం..? ఇంత పేలవమైన షోకు ఈసారి రేటింగ్స్ ఎంత దారుణంగా రాబోతున్నాయో చూడాలి… అసలే బిగ్బాస్ 5 సీజన్ రేటింగుల్లో తీసికట్టు… ఈసారి కంటెస్టెంట్ల నాణ్యమైన ఎంపిక లేదు… సో, ఈసారి రేటింగ్స్ పరిస్థితి ఏమిటో…
నిజానికి మాటీవీ ఈ రియాలిటీ షో మీదే బాగా ఆశలు పెట్టుకుంది… తను మిగతా ఏ అంశంలో రియాలిటీ షో ప్రయోగం చేసినా సరే, అవి అడ్డంగా తన్నాయి తప్ప, ఒక్కటీ క్లిక్ కాలేదు… ఈ బిగ్బాసేమో ఖర్చెక్కువ… ప్రయాస ఎక్కువ… దానికి తగినట్టు రేటింగులు ఆశించడంలో తప్పులేదు… కానీ కంటెస్టెంట్లు బోర్ కొట్టిస్తున్నప్పుడు కనీసం అత్యంత సరదాగా వీకెండ్ షోలు సాగాలి… ఫాఫం, ఇక్కడే రివర్స్ తంతోంది…!! అవునూ, నాగ్ భయ్యా… మనలోమనమాట… కొంపదీసి బ్రహ్మస్త్ర రిజల్ట్ ప్రభావంతో డిస్టర్బ్ అయిపోయావా..?! ఐనా మనదేం పోయింది..? మనం పెట్టింది ఏముంది..?
ఏమాటకామాట… నారాయణకు నాగార్జున వీకెండ్ షో వేదిక మీదే ఇచ్చిన కౌంటర్ మాత్రం అదిరిపోయింది… రోహిత్, మరీనా జంట హౌజులో ఉంది కదా… వాళ్ల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలున్నయ్… సో, ఓసారి గట్టిగా కౌగిలించుకొండి అని చెప్పాడు నాగార్జున… మీకు లైసెన్స్ ఉంది, పర్లేదు, భార్యాభర్తలు కౌగిలించుకుంటే తప్పేముంది..? నారాయణ, నారాయణ అని వెటకారాన్ని దట్టంగా కూర్చి మరీ వదిలాడు ఓ డైలాగ్… ఐనా నారాయణ చర్మానికి ఆ చురక, ఆ సురుకు ఏమీ ఆనతాయా..?!
Share this Article