ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? ఆ పత్రిక ధోరణి అదే… భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ్స్. చివరకి భారత దేశ ఆర్ధికాభివృద్ధి ఈ సంవత్సరం 7% ఉండబోతున్నది అంటూ బాధతో వాపోయింది గతి లేక… ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్ధికంగా దిగజారుతున్న సమయంలో ఒక్క భారత దేశమే అభివృద్ధి బాట పడుతున్నది అంటూ హెడ్ లైన్ లో పేర్కొంది.
***************************************
Ads
అమెరికా, యూరోపు, చైనాల అభివృద్ధి సూచీ తగ్గుదలని చూపిస్తున్నది గత మూడు నెలలుగా… అయితే భారత్ మాత్రం 7% అభివృద్ధి సూచీతో నిలకడగా కొనసాగుతున్నది- న్యూయార్క్ టైమ్స్…
***************************************
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఇదే న్యూయార్క్ టైమ్స్ పొంతన లేని పోలికలు చూపెడుతూ బంగ్లాదేశ్ భారత్ కంటే అభివృద్ధి సూచీలో ముందు ఉంది అంటూ చెత్త రాతలు వ్రాసింది. న్యూయార్క్ టైమ్స్ వార్తనే ప్రతిపక్ష నాయకులు ఉటంకిస్తూ మోడీ, కేంద్ర ప్రభుత్వం మీద హేళనగా మాట్లాడారు. మన దేశం నుండి ఎక్కువగా డబ్బులు ఇచ్చి వార్తలు వ్రాయించుకునేది కేజ్రీవాల్ ! ఢిల్లీ విద్యా వ్యవస్థ ఆసియాలోనే బెస్ట్ మోడల్ అంటూ డబ్బులు ఇచ్చి మరీ ఫోటోలు, వార్తలు వ్రాయించుకున్నాడు తను…
న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో మనీష్ సిసోడియా ఫోటోతో తెగ హడావిడి చేసింది. కానీ అసలు విషయం ఏమిటంటే గత రెండేళ్లుగా ఢిల్లీ లోని స్కూళ్ళు, కాలేజీ అధ్యాపకుల జీతాలు పెంచలేదు సరికదా సమయానికి కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నాడు కేజ్రీవాల్… టీచర్లు, లెక్చరర్లు రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్నా ఎవరూ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురారు. ఈ విషయం మటుకు న్యూయార్క్ టైమ్స్ చెప్పదు. ఇలాంటి న్యూయార్క్ టైమ్స్ వార్తకి విలువ ఇచ్చి, హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ?
***************************
అసలే కోవిడ్ వల్ల మందగించిన గ్లోబల్ ఎకానమీ… రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసేసరికి వంట నూనెలు, గోధుమలు దొరకక యూరోపు, అమెరికాలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, సహజవాయువు కొరతతో రవాణా ఖర్చులు పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోతున్నాయి ప్రపంచం మొత్తం… ఇలాంటి స్థితిలో భారత్ 7 % వృద్ధి రేటుని నిలకడగా కొనసాగించగలదా అనే సందేహాలూ ఉన్నాయి… కానీ మొదట 8% వృద్ధి రేటుగా అంచనా వేసినా, అది 7% దగ్గర నిలకడగా ఉంటుంది అని ప్రపంచ బాంక్ ఖచ్చితంగా చెప్తున్నది ఇప్పుడు…
********************
న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తని ప్రచురించడానికి తప్పనిసరి కారణం ఉంది. గత మంగళవారం అంటే సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ ద్రవ్యనిధి [International Monetary Fund (IMF) అధ్యక్షురాలు అయిన జార్జివా [Georgieva] భారత ప్రధానిని కలిసినప్పుడు ధన్యవాదములు తెలిపింది. మోడీ నాయకత్వంలో భారత దేశం చాలా త్వరగా కోవిడ్ నష్టాల నుండి బయటపడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది అంటూ శ్లాఘించింది క్రిస్టిలిన జార్జివా… అలాగే డిజిటల్ పేమెంట్ విషయంలో భారత్ చేసిన కృషి మిగతా దేశాలకి ఒక మోడల్‌గా నిలిచింది అని కూడా వ్యాఖ్యానించింది [యూరోపియన్ యూనియన్‌ని నడిపిస్తున్న జర్మనీ రిఫండ్ విషయంలో 18 నెలల సమయం తీసుకుంటున్నది ఆ దేశపు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ] .
********************
ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలిన జార్జివా ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ ‘‘ఇప్పుడు భారతదేశానికి ధృఢమయిన నాయకుడు ఉన్నాడు. ఆయన దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముందు ఉండి నడిపిస్తున్నాడు. మోడీకి నా అభినందనలు తెలుపుతున్నాను . ఐఎంఎఫ్ నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను భారత్ తో కలిసి నడవడానికి… రాబోయే G20 దేశాల సమావేశాలలో భారత దేశాన్ని అధ్యక్షురాలిగా ప్రకటించబోతున్నారు. మోడీ భారత ప్రధాని హోదాలో మరియు G20 దేశాల అధ్యక్షుడిగా మరింత అభివృద్ధి వైపు తీసుకెళతారని నాకు నమ్మకం ఉంది. G20 దేశాలకే కాదు ప్రపంచానికి భారత ప్రధాని లాంటి వ్యక్తి సేవలు ఇప్పుడు అత్యవసరం !’’ అని పేర్కొంది…
********************************
ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వ్రాయకతప్పదు మరి ! బహుశా SCO సమావేశంలో రష్యా మరియు ఉక్రెయిన్ సమస్యకి మధ్యవర్తిత్వం వహించమని ప్రతిపాదన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోటి వెంట వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసే శక్తి రష్యాకి లేదు… కానీ అమెరికా, యూరోపు దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధ సహాయం చేస్తున్నాయి కాబట్టి, ఇప్పట్లో అది ఆగే అవకాశాలు లేవు, అలా అని రష్యా యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేదు. కర్ర విరగకుండా పాము చావకుండా సంధి చేయమని పుతిన్ అడుగుతాడు! జరిగేది అదే…!!
Share this Article