ఎన్డీటీవీలో ఆల్‌రెడీ అడుగుపెట్టిన ఆదానీ… క్రమేపీ దాన్ని కబళించడం ఖాయం..! దానితోనే ఆగిపోతాడా..? నెవ్వర్… అలా ఆగిపోవడానికి కాదుకదా ఎన్డీటీవీని మింగేస్తున్నది… ఇంకా చాలా విస్తరణ ప్రణాళికలు ఉంటయ్… అవి మెల్లిమెల్లిగా ఆచరణలోకి వచ్చేస్తయ్… వయాకామ్, నెట్‌వర్క్18 ద్వారా అంబానీ ఎక్కడికో వెళ్లిపోతున్నాడు… అనేక భాషల్లో డిజిటల్ న్యూస్, టీవీ న్యూస్, ఎంటర్‌టెయిన్‌మెంట్, బ్రాడ్‌కాస్టింగ్… ఇంకా విస్తరిస్తాడు… ఆదానీ ఎందుకు ఊరుకుంటాడు..? ఊరుకోడు…
సరే, ఆదానీ మీడియా విస్తరణ ఖచ్చితంగా బీజేపీ ప్రయోజనాల కోసమే అని ఆరో తరగతి చదివే చిన్న పిల్లాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తాడు… జనానికి ఆ క్లారిటీ ఉంది… బీజేపీకి ఆ అవసరం ఉంది, ఆ ఆలోచన ఉంది, ఆ దిశలో ఆదానీకి ప్రోత్సాహమూ ఉంది… ఎన్డీటీవీ మూతపడటం కావాలి, అది తమకు అనుకూలంగా మారాలి… బీజేపీకి రెండు కోరికలు… మరి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ బలమైన కాషాయ మీడియా కావాలి ఎలా..? ఆదానీ విస్తరణ ప్లాన్లు సరే… కానీ ఇంకా కావాలి… ఎలా..?
ఏయే భాషల్లో ఏ గ్రూపు మీడియా బలంగా ఉంది, ప్రస్తుతం ఎవరికి సపోర్ట్ చేస్తోంది… వాళ్ల బలహీనతలు ఏమిటి..? వాచ్ నడుస్తూనే ఉంది… సయోధ్య ప్రయత్నాలు సాగుతూనే ఉన్నయ్… ఈనాడు రామోజీరావుతో అమిత్ షా భేటీ ఆ కోణంలోనిదే… టీవీ9 లొంగుబాటు సరేసరి… మిగతా భాషల్లోనూ ఈ దిశలో అడుగులు పడుతూనే ఉంటయ్… అంతేకాదు, మరో బలమైన మీడియా కేంద్రాన్ని బీజేపీ ఆలోచిస్తోంది… ఎంతసేపూ మన దేశానికే మన ఆలోచనల్ని పరిమితం చేస్తున్నాం… కానీ ఇంటర్నేషనల్ వాయిస్‌ను క్రియేట్ చేయగలిగితే..?
Ads
అవును, ఇక్కడ దిహిందూ దగ్గర నుంచి అక్కడ న్యూయార్క్ టైమ్స్ దాకా ఏదిపడితే అది రాసేస్తున్నాయనీ, ప్రత్యేకించి యాంటీ-బీజేపీ ప్రాపగాండా ప్లాన్డ్‌గా సాగుతోందని బీజేపీ సందేహం… అందుకని రిపబ్లిక్ మీడియా గ్రూపు పెద్ద ఎత్తున విస్తరించాలని ప్లాన్… నిన్న జరిగిన రాష్ట్ర సర్వోపరి సమ్మేళన్‌లో సదరు మీడియా గ్రూపు ఎడిటర్ ఇన్ ఛీఫ్ ఆర్నబ్ గోస్వామి మాట్లాడుతూ… ‘‘రెండేళ్లలో ప్రతి భాషలోకి విస్తరిస్తాం… బ్రాడ్‌కాస్టింగ్, పబ్లిషింగ్… ఈ దేశం కేంద్రంగా, ఈ దేశమే ఆత్మగా అంతర్జాతీయ మీడియా సంస్థను డెవలప్ చేస్తాం’’ అని ప్రకటించాడు…
అంటే ప్రధాన భాషల్లో పత్రికలు, డిజిటల్, టీవీ వార్తల మీద కాన్సంట్రేట్ చేస్తారన్నమాట… ప్లస్ ఇంటర్నేషనల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్… ఇండియాపై, బీజేపీపై సాగే ప్రచారాన్ని కౌంటర్ చేయడం ధ్యేయం… నిజానికి రెండేళ్లుగా తను ఈమాట చెబుతూనే ఉన్నాడు… కానీ ఇప్పుడున్న ఇంగ్లిష్, హిందీ చానెళ్లకు అదనంగా… అప్పటికప్పుడు ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల అవసరం కోసం బెంగాలీ చానెల్ స్టార్ట్ చేయడం మినహా వేరే ఏ ఇతర భాషలోకి కూడా ఆర్నబ్ విస్తరించలేకపోయాడు… (tv9 కూడా బంగ్లా చానెల్ ప్రారంభించింది)…
ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నాడు… రెండేళ్లలో అని…!! నిజానికి గతంలోలాగా లేదిప్పుడు… భయానికో భక్తికో దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు బీజేపీ మీద వ్యతిరేకతను గుడ్డిగా ప్రదర్శించడం లేదు… కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాలు, టీవీలు, పత్రికలు మాత్రమే ప్రతిపక్ష వాయిస్‌గా కనిపిస్తున్నాయి… ఐనా సరే, బీజేపికి ఓ బలమైన సొంత మీడియా సెక్షన్ కావాల్సిందే… అదే రిపబ్లిక్ తాజా శపథం…!!
Share this Article