Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉడ్తా పంజాబ్ సీఎం…! సో వాట్..? విమానం నుంచి దింపేశారు…!!

September 19, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ………… పంజాబ్ ముఖ్యమంత్రి ని విమానం నుండి దింపేశారా ? పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. సెప్టెంబర్ 11 నుండి 18 వరకు జర్మనీ పర్యటన కోసం ముందుగానే షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయితే ఈ నెల 11 న ఢిల్లీ నుండి బయలుదేరి జర్మనీ వెళ్ళాడు మాన్. ఈ పర్యటన ఉద్దేశ్యం పంజాబ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి. అయితే 18/9/2022 ఆదివారం రాత్రి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుండి ఢిల్లీ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం 4 గంటలు ఆలస్యంగా అక్కడి నుండి బయలుదేరింది అని లుఫ్తాన్సా వెబ్ సైట్ లో క్లియర్ గా కనపడుతున్నది.

********************

లుఫ్తాన్సా విమానం ఆలస్యం అవడానికి కారణం సాంకేతిక లోపం అని మొదట ప్రకటించినా, తరువాత సర్దుకొని ఒక ప్రయాణీకుడిని విమానం నుండి దింపడానికి, అలాగే అతని లగేజీ ని విమానం నుండి బయటికి తీయడానికి ఆలస్యం అయింది అని సదరు ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఇంతకీ ఎవరా ప్రయాణీకుడు ? విమాన ప్రయాణానికి అర్హత లేదు అని విమాన కెప్టెన్ ప్రకటించి మరీ విమానం నుండి దించేయడానికి కారణం అయిన వ్యక్తి ఎవరు ?

Ads

అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు తన పేరు చెప్పడానికి నిరాకరిస్తూ అసలు విషయం చెప్పేశాడు. విమానం ఫ్రాంక్ ఫర్ట్ నుండి 1.40 PM (GMT+2) కి బయలుదేరాలి. అలాగే ఢిల్లీకి 12.55 AM IST (GMT+5.30)కి చేరుకోవాలి. కానీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ తో పాటు అతని భార్య మరియు అతని సెక్యూరిటీ సిబ్బంది విమానంలోకి ప్రవేశించగానే మాన్ అడుగులు తడబడుతున్నాయి… కానీ అతని భార్య సెక్యూరిటీ సిబ్బంది మాన్ ని పట్టుకొని జాగ్రత్తగా నడిపించడానికి ప్రయత్నించినా, మాన్ తనంత తానుగా నడవలేని స్థితిలో ఉండడం వలన తోటి ప్రయాణీకులు ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

ఎయిర్ హోస్టెస్ తో పాటు అటెండర్ కూడా మాన్ కి సహాయంగా వచ్చినా లాభం లేకపోయింది. కానీ విమానం ఆలస్యంగా బయలుదేరకుండా ఉండడానికి గాను కెప్టెన్ ప్రయత్నించగా, తోటి ప్రయాణీకులు అభ్యంతరపెట్టారు అతనిని విమానంలోకి అనుమతిస్తే తాము దిగిపోతాము అని… పరిస్థితిని సమీక్షించిన విమానం కెప్టెన్ మాన్ సెక్యూరిటీ సిబ్బందితో విమానం దిగి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. కానీ సెక్యూరిటీ సిబ్బందికి అప్పటికే పంజాబ్ నుండి అధికారులు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యం అవకుండా చూడండి, ఎందుకంటే ముఖ్యమంత్రికి చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయని, ఆలస్యం అయితే అవన్నీ వాయిదా పడతాయి కాబట్టి ప్రయాణం కొనసాగించాల్సిందిగా చెప్పారు…

దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఈయన ముఖ్యమంత్రి అనీ, ఎట్టి పరిస్థితులలోనూ షెడ్యూల్ ఆలస్యం అవడానికి వీలులేదని చెప్పారు. కానీ కెప్టెన్ నిర్ణయమే ఏ ఎయిర్లైన్స్ అయినా పాటించాల్సి ఉంటుంది… కాబట్టి కెప్టెన్ భగవత్ సింగ్ మాన్ ప్రయాణం చేయడానికి అర్హత లేదు అని ప్రకటించి మళ్ళీ విమానం దిగి వెళ్లిపొమ్మని విజ్ఞప్తి చేయడంతో చేసేది లేక మాన్ అతని భార్య, సెక్యూరిటీ సిబ్బంది విమానం దిగి వెళ్లిపోయారు… కానీ లగేజీని తమతోనే ఉంచుకోవాలని పట్టుబట్టారు, కానీ అప్పటికే లగేజీ కంపార్ట్మెంట్ ని మూసివేశారు కనుక ఢిల్లీలో తరువాతి రోజున తీసుకోవచ్చు అని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పినా వినలేదు సెక్యూరిటీ సిబ్బంది… లగేజీ మాతో పాటే తీసుకెళతాం అని పట్టుబట్టడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో మాన్ కి చెందిన లగేజీ ని దింపాల్సి వచ్చింది. ఇదంతా జరగడానికి నాలుగు గంటల సమయం పట్టింది…

అలా 5.52 PM (GMT+2)కి ఫ్రాంక్ ఫర్ట్ లో బయలుదేరి ఢిల్లీ కి 4.30 AM IST (GMT+5.30) చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 1. 40 pm కి బయలు దేరాల్సిన విమానం 5.52 కి బయలుదేరింది అన్నమాట. చందర్ సూత దోగ్రా [Chander Suta Dogra] డైరెక్టర్, మీడియా కమ్యూనికేషన్స్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాట్లాడుతూ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కి స్వల్ప అస్వస్థత వలన ఢిల్లీకి రావలసిన ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో జరుగుతున్న విషయం అప్పటికే బయటికి రావడం వలన ముఖ్యమంత్రి షెడ్యూల్ యధా ప్రకారం జరుగుతుంది అంటూ ముందు చెప్పినా, సదరు చందర్ సూత దోగ్రా తరువాత మాట మార్చి చెప్పాల్సి వచ్చింది।

punjab

కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి:

ఈ నెల 13 న BMW అధికారులతో సమావేశం అయ్యాక మాన్ ఒక ప్రకటన చేశాడు జర్మనీ నుండి : BMW తన స్పేర్ పార్ట్శ్ తయారుచేసే ఫాక్టరీని పంజాబ్ లో పెట్టడానికి అంగీకరించింది అని… కానీ మరుసటి రోజే BMW ప్రతినిధి మాట్లాడుతూ తాము ఎలాంటి ఫాక్టరీని పంజాబ్ లో పెట్టట్లేదు అని ప్రకటించాడు. అసలు అలాంటి MoU ఏదీ కూడా తాము ఎవరితోనూ కుదుర్చుకోలేదు అని వివరంగా తెలిపాడు. పంజాబ్ కి BMW వస్తున్న వార్త వైరల్ అయింది, కానీ సదరు BMW అధికారి ఆ వార్తని ఖండిస్తూ చేసిన ప్రకటన మాత్రం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు.

punjab

ఈ నెల 11 నుండి 18 వరకు భగవత్ సింగ్ మాన్ బెర్లిన్, మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ లలో పర్యటించాడు. చివరికి DRINKTEC 2022 అనే అంతర్జాతీయ మద్యం ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు. DRINKTEC 2022 అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎగ్జిబిషన్ అన్నమాట. ప్రపంచంలోని అన్ని దేశాల మద్యం బ్రాండ్ల కంపెనీలు ఒకేచోట పాల్గొంటాయి. భగవత్ సింగ్ మాన్ డిప్లొమాట్ హోదాలో DRINKTEC 2022 కి వెళ్ళాడు కాబట్టి ముఖ్య అతిధికి ఇచ్చే ఫ్రీ బాటిల్స్ బాగానే ఇచ్చి వుండవచ్చు. అలాగే అన్ని ప్రముఖ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లని కొని ఉండవచ్చు.

punjab

దొరికిందే తడవుగా బాగా తాగేసి విమానం ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో తడబడ్డాడు. ఇక లగేజీలో కూడా భారీగా మద్యం ఉండి ఉండవచ్చు. ఢిల్లీలో గ్రీన్ చానెల్ ద్వారా బయటికి రావొచ్చు ఎలాంటి తనిఖీలు లేకుండా… కాబట్టి లగేజీ తమతోనే తీసుకెళ్తాం అని పట్టుబట్టడానికి ఇదే కారణం అయి ఉండవచ్చు. గతంలో కూడా భగవత్ సింగ్ మాన్ బాగా తాగి న్యూసెన్స్ సృష్టించిన సంఘటనలకి కొదువ లేదు అన్న సంగతి తెలిసిందే ! కేజ్రీవాల్ ఎటూ ప్రకటనల రూపంలో భారీగా అన్ని మీడియా సంస్థలకి ముట్టచెప్తూ ఉంటాడు కాబట్టి ఈ వార్తని తొక్కి పెట్టి ఉండవచ్చు. కాకపోతే రేపో మాపో ఎవరో ఒకరు విమానంలో తీసిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదే సంఘటన వేరే పార్టీల నాయకులు అయినట్లయితే బ్రేకింగ్ న్యూస్ తో రెండు రోజుల పాటు చర్చలు పెట్టేవాళ్ళు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions