కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టులో కేసు అంటే… దాని వెనుక సమర్థనీయమైన సంకల్పం, ఉద్దేశం, స్పూర్తి ఉండాలి… ఎట్‌లీస్ట్ ఉండాలని కోరుకుంటాం… పైగా ఏళ్ల తరబడీ సొసైటీకి పనికొచ్చేలా పర్యావరణ, సామాజిక రంగాల్లో అలుపెరగని వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి వంటి మేధావులు, నిపుణులు ఒక కేసు వేశారంటే దానికి ఓ బలమైన జస్టిషికేషన్ ఉండాలి… ఉండాలని కోరుకుంటాం… కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకు అసెంబ్లీ సీట్లను పెంచడం లేదంటూ ఆయన వేసిన కేసు స్పూర్తికి భిన్నంగా ఉంది… అసంతృప్తిగా ఉంది…
స్వాతంత్య్రానికి పూర్వం పుట్టిన ఆయన ఈరోజుకూ సొసైటీకి సర్వ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు… ఈ కోణంలో ఎవరికీ కంప్లయింట్స్ లేవు, ప్రశంసార్హుడే… మరి ఈ అసెంబ్లీ సీట్ల కేసు ఏమిటి..? తను చెబుతున్న లీగల్ గ్రౌండ్స్ ఏమిటీ, సుప్రీం ఏం చెప్పబోతున్నదీ అనేది వేరే విషయం… కానీ సీట్ల పెంపుతో సొసైటీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? దేని కోసం ప్రొఫెసర్ కొత్త తన్లాట..? ఇదీ ఆశ్చర్యకరం…
ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రాజ్యాంగ నిబంధనలతో ఆడుకుంటోంది… ఇప్పట్లో దేశంలో ఎక్కడా సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉండదు అంటూనే కేంద్రం జమ్ముకాశ్మీర్‌లో ఆ ప్రక్రియ చేసేసింది… పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆ ప్రక్రియకు సిద్ధపడుతోంది… తెలుగు రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోంది… సరే, దానికి కేంద్రం చెప్పే కారణాలు ఎలా ఉన్నా, డిబేట్ సేక్, ఈ ప్రొఫెసర్ చెప్పిందే కరెక్టని కాసేపు నమ్ముదాం… అయితే… దానికీ తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుకూ లంకె ఏమిటి..?
Ads
రాష్ట్ర విభజన చట్టంలో సీట్ల పెంపును పేర్కొన్నారు కాబట్టి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందే అనే వాదన హేతువిరుద్ధం, తర్కవిరుద్ధం… చట్టం చేసినంతమాత్రాన అదేమీ అల్టిమేట్ కాదు… అసలు రాజ్యాంగాన్నే బోలెడన్నిసార్లు సవరించుకున్నాం… గట్టిగా అడిగితే మొత్తం రాజ్యాంగాన్నే తిరగరాయాలీ అంటాడు కేసీయార్… విభజనచట్టంలో ఉంది కాబట్టి సీట్లు పెంచాలా..? ఈ పర్యావరణ నిపుణుడికి ఈ సీట్లు పెంచకపోతే వచ్చిన బాధేమిటి..?
ఫీల్డ్‌లో రియాలిటీ ఏమిటంటే… ఎమ్మెల్యేలు నయా జమీందార్లు అయ్యారు… వాళ్లు చెప్పిందే ఊళ్లల్లో రాజ్యాంగం… వాళ్ల మాటే శాసనం… వాళ్లు కోరుకున్నవాళ్లే అధికారులు… ఇక దందాలు, వ్యక్తిగత వ్యవహారశైలి మీద ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… మరి వీళ్ల సంఖ్యను పెంచితే ప్రజలకు స్థూలంగా వచ్చే ఫాయిదా ఏముంది..? ఎలాగూ చట్టాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి సీఎంలు ఏది చెబిది అది ఫైనల్… ఎమ్మెల్యేలు కాదు, మంత్రులే ఏమీ మాట్లాడరు…
చట్టం ప్రకారం… తెలంగాణలో సీట్లను 119 నుంచి 153కు పెంచాలి, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలి… పెంచితే పార్టీలకు ఉపయోగకరం… అసలు విభజనచట్టంలో ఈ క్లాజు ఎందుకు పెట్టారో, ఎవరి ప్రయోజనం కోసమో బిల్లు రాసిన జైరాం రమేషే చెప్పలేడు అనుకుంటా బహుశా… రాజకీయ అశావహులను అడ్జస్ట్ చేయటానికి, ఇంకొంతమందికి అవకాశాలు కల్పించటానికి ఈ సీట్ల పెంపు ఉపకరిస్తుందే తప్ప ప్రజలకు వీసమెత్తు ఫాయిదా లేదు… అసలు శాసనమండళ్ల ఉనికి మీదే మేధోసమాజంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది… ఈ ప్రొఫెసర్‌కు రాజకీయ ఉద్దేశాలు ఏమీ ఉండవు… వాటికి తను అతీతుడు… పోనీ, బీజేపీ మీద దాడి అనే ధోరణి కూడా కాదు… ఏమిటీ కొత్త అడుగులు ప్రొఫెసర్..?
Share this Article