పాదయాత్ర అంటే… పూర్తిగా నడకే అక్కర్లేదోయ్… కాసేపు నడువ్… తరువాత క్యారవానో, కంటెయినరో ఎక్కేసి, కాస్త ఊపిరి పీల్చుకో, మళ్లీ నడువ్, మళ్లీ కాసేపు రిలీఫ్… ఎవరు వచ్చి, ఎక్కడ కలవాలో, ఏం ఫోటోలు దిగానో, ఏది మీడియాకు ఇవ్వాలో అంతా వెల్ ప్లాన్డ్… కలిసే జనం, కలిసి నడిచే జనం కూడా ఫేక్… ఎవరి అవసరాలు వాళ్లవి… నిరాహారదీక్ష అంటే మరీ వీజీ… ఇప్పుడు నిరవధిక దీక్షలు లేవు కదా… ఎవరూ పొట్టి శ్రీరాములు కాదుగా… ఉదయం ఫుల్లు బ్రేక్ ఫాస్ట్ ఎక్కించేసి, సాయంత్రానికి ప్రెస్‌మీట్ పెట్టేసి, ఎవడో నిమ్మరసం ఇస్తాడు, దీక్ష విరమణ ఫోటోలు దిగేసెయ్…
మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, పలు రాజకీయ పరిణామాలకు దారితీసింది కేసీయార్ నిరవధిక నిరాహార దీక్ష… మధ్యలోనే దాన్ని విరమించడం, విద్యార్థుల ఆగ్రహంతో మళ్లీ కొనసాగిస్తున్నట్టు ప్రకటించడం వంటి ఎపిసోడ్లు ఓ చరిత్ర… ఆ దీక్ష బోగస్ అని వెక్కిరిస్తూ లగడపాటి చేసిన దీక్ష మరో చర్చనీయాంశం… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ప్రాంతాలు వేర్వేరు కావచ్చుగాక… రాజకీయ నాయకులందరూ ఒకే తరహా…
వరుస కట్టి మంత్రుల అవినీతి బట్టబయలవుతున్నయ్… మేనల్లుడి దందాలు, బాగోతాలూ బజారుకెక్కుతున్నయ్… మమతకు ఊపిరాడటం లేదు… సీబీఐ, ఈడీ దాడుల వెనుక మోడీ లేడట… ఒకప్పుడు మోడీ మీద కత్తియుద్ధం చేసిన మమతక్క చేతిలో ఉన్నది నిజానికి ఉత్త కాగితం కత్తి మాత్రమేననీ, ఎక్కడో ఏమూలో మొదలైన భయం, ఆందోళన వెన్నులో జరజరా పాకుతోందని తాజా వార్తలు, వ్యాఖ్యలు చెబుతున్నాయి… అసలు తను టీలో ఈగలా తీసేసిన గవర్నర్‌కే మద్దతు ప్రకటించాల్సి రావడం కూడా అందులో ఒకటి… ఒకప్పటి మమతేనా ఈమె..?
Ads
ఇదంతా ఎలా ఉన్నా… మమత కూడా ఓ బోగస్ దీక్ష చేసిన తీరును ఒకప్పుడు ఆమెకు వీరవిధేయుడిగా మెలిగిన దీపక్ కుమార్ ఘోష్ బయటపెట్టాడు… ఆమె 2006లో 26 రోజులపాటు దీక్ష చేసింది… 26 రోజుల దీక్ష అంటే మజాక్ కాదు… ఐనా ఆమె మామూలుగానే ఉంది… కారణం… ఆమె రహస్యంగా ఆహారాన్ని తీసుకోవడమేనని ఆయన బయటపెట్టేశాడు… నిజానికి ఆయన 2012లోనే ఓ పుస్తకం రాశాడు… ‘‘నాకు తెలిసిన మమత- ఓ దేవత వైఫల్యం’’ అనే అర్థమొచ్చే పేరు పెట్టాడు… ఇప్పుడు కొందరు ట్విట్టర్‌లో ఆ బుక్కులోని ఒకటీరెండు చాప్టర్లను ట్వీట్ చేసి, కొత్తగా చర్చకు తెరలేపుతున్నారు…
తనే రాస్తాడంటే… దీక్ష రోజుల్లో ఆమె నిమ్మరసం, గ్లూకోజు నీళ్లు తీసుకునేది… రహస్యంగా వెజ్, చికెన్ శాండ్‌విచ్‌లు, చేపముక్కలు లాగించేది… ఆమె పీఏ గౌతమ్ బసు ఇవన్నీ చూసుకునేవాడు… పిల్లో కింద ఇంపోర్టెట్ చాకొలేట్లను దాచుకుని తరచూ గుట్టుగా నమిలేది… సరే, ఏం చేస్తేనేం… పొలిటికల్‌గా మంచి ఫాయిదా పొందింది… ఇలాంటి ఆందోళనలతో పాపులర్ అయిపోయింది… ఫైటర్, ఫైర్ బ్రాండ్ పేరొచ్చింది… ప్రజలు తరువాత ఎన్నికల్లో సీపీఎంను బొంద పెట్టేశారు… ఇప్పటికీ అది మళ్లీ కోలుకోలేదు… బహుశా కోలుకోదు… సో, దీక్ష ఎలా చేశారనేది కాదన్నయ్యా… ఏం సాధించారనేదే ముఖ్యం… అదీ సంగతి…
Share this Article