ఆ ఐడీ కార్డు కలకలం రేపుతోంది… అది నిజమైందో కాదో తెలియదు కాబట్టి ఆ కార్డు బొమ్మ ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు… విషయం ఏమిటంటే… చిరంజీవికి పీసీసీ డెలిగేట్ అని కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఐడీ కార్డును జారీ చేసింది అనేది వార్త… రెండుమూడు రకాల కార్డులు వార్తల్లో కనిపిస్తూ ఉండేసరికి డౌటొచ్చింది… పైగా ఇటు చిరంజీవి క్యాంపు గానీ, అటు ఏపీ కాంగ్రెస్ గానీ దీనిపై ఏమీ వ్యాఖ్యానించడం లేదు… కానీ ఈ కార్డు ఫోటో మాత్రం ఎందుకు కలకలానికి దారితీస్తున్నదంటే..?
తను లూసిఫర్ అనే మలయాళ సినిమాను గాడ్‌ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నాడు… అది దసరాకు విడుదల కానుంది… అందులో ఒక డైలాగ్… ‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను, కానీ నాకు రాజకీయాలు దూరంగా లేవు’’… నిజానికి అది లూసిఫర్‌లో ఉన్న డైలాగే… అయితే నిజంగా చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నాడా అని మీడియా, సోషల్ మీడియా వార్తల్ని కుమ్మిపారేశాయి… ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టుగా ఆ ఐడీ కార్డులు కనిపించడమే కలకలానికి కారణం…
చాన్నాళ్లుగా చిరంజీవి నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు… కానీ రాజకీయాలు మాత్రం తనకు దూరంగా లేవు… అది చెప్పాలంటే ఏడాది క్రితం జరిగిన కథ ఒకటి గుర్తుచేయాలి… ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఎక్కడో మాట్లాడుతూ ‘‘చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేడు’’ అన్నాడు… అవునేమో, ఎలాగూ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు కదా, కాంగ్రెస్‌లో లేడేమో అని అందరూ నమ్మారు… కానీ తను ఇంకా ఆ పార్టీలో ఉన్నాడో లేదో చెప్పాల్సింది తనే కదా… సైలెంటుగా ఉన్నాడు… కానీ..?
Ads
ఏపీ కాంగ్రెస్ మాత్రం ఓ ప్రకటన జారీ చేసింది… ‘‘అబ్బే, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు… ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజాసేవ చేస్తున్నాడు… ఆయన, ఆయన కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్‌వాదులే.., భవిష్యత్తులో పార్టీ సేవలకు అందుబాటులోకి వస్తాడు… పత్రికలు అసత్యవార్తలు రాయడం దారుణం…’’ అంటూ ఏపీసీసీ ఓ ప్రకటన జారీ చేసింది…
కాంగ్రెస్ పార్టీ ఎందుకంతగా ఉలిక్కిపడింది..? ఆయన పార్టీలో ఉన్నాడో లేదో అర్జెంటుగా పార్టీయే వివరణ ఇవ్వడం దేనికి..? చిరంజీవి, ఆయన కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్‌వాదులేననే ముద్ర వేయడం దేనికి..? ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజారాజ్యం అనే సొంత పార్టీ స్థాపనతో… అంతకుముందు తన రాజకీయాల్లోనే లేడు… తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం కథ ముగిశాక జనసేన అని తను సొంత పార్టీ పెట్టుకున్నాడు… టీడీపీతో, బీజేపీతో, లెఫ్ట్ తదితర పార్టీలతో కలిసి ప్రయాణించాడు తప్ప ఎప్పుడూ తను కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా రాలేదు… రమ్మన్నా రాడు… మరిక మెగా కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్‌వాదులే అని చెప్పడం దేనికి ఇప్పుడు..?
అందరికీ తెలుసు, చిరంజీవి ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్సులోనే కాదు, అసలు రాజకీయ వాసనలకే దూరంగా ఉంటున్నాడని..! (నిజానికి తను ప్రజారాజ్యం అమ్ముకోకుండా, సారీ, కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేయకుండా ఉంటే, స్వతంత్రంగా ఆ పార్టీ అలాగే కొనసాగుతూ ఉండి ఉంటే… ఇప్పుడు తను ఏపీ రాజకీయాల్లో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఉండేవాడు…) ఇప్పుడు విస్మయకరంగా అనిపించింది ఏమిటీ అంటే..? ఒక పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఒక నాయకుడు మా పార్టీలో లేడు అని చెప్పాక… ఆ నాయకుడు స్పందించడం సహజం… ఉంటే ఉన్నాననీ, లేకపోతే లేననీ క్లారిటీ ఇవ్వాల్సింది తనే… కానీ తాను సైలెంటుగా ఉండి, ఏపీసీసీ ఉలిక్కిపడింది ఎందుకో మరి…
నిజంగా మళ్లీ రాజకీయంగా క్రియాశీలమయ్యే సూచనలు కూడా లేవు… ఎంచక్కా తనకు అచ్చొచ్చిన సినిమారంగంలోకి తిరిగి వెళ్లిపోయాడు… తెలంగాణలో కేసీయార్‌తో, ఏపీలో జగన్‌తో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేసుకుంటున్నాడు… ఒకటీరెండు నిర్ణయాలకు సంబంధించి జగన్‌ను మెచ్చుకున్నాడు కూడా… చిరంజీవికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది… చిరంజీవి ఖండించలేదు, కిమ్మనలేదు… ఈ కాంగ్రెస్ కొత్త ఐడీ కార్డుల మీద కూడా స్పందించడం లేదు… అంటే మౌనం అర్ధాంగీకారమా..? ఎహె, నేను స్పందించనుపో అని పరోక్షంగా చెబుతున్నట్టా..?!
Share this Article