సాధారణంగా బిగ్‌బాస్ హౌజులో కొన్ని జంటల నడుమ లవ్ ట్రాకులు డెవలప్ కావాలని ఆ టీం ఆశిస్తుంది… తద్వారా షోకు కాస్త రొమాంటిక్ కలర్ వస్తుంది… ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది… అఫ్‌కోర్స్, నటనే అయినా సరే, కొన్ని సహజప్రేమల్లా కనిపిస్తయ్, కొన్ని ఇట్టే తేలిపోతయ్… అది ఆయా ప్లేయర్లు రక్తికట్టించడం మీద ఆధారపడి ఉంటుంది… లాస్ట్ సీజన్‌లో శ్రీరామచంద్ర, హమీదా నడుమ ప్లజెంట్ లవ్ ట్రాక్ కనిపించింది… కానీ సిరి, షన్నూ నడుమ వెగటు కలిగించింది…
ఈసారి మూడు వారాలు గడిచినా బిగ్‌బాస్ టీం త్రికోణం కాదు కదా, కనీసం ఒక లవ్ ట్రాకును ట్రాకు ఎక్కించలేకపోయింది… కొంతలోకొంత ఆరోహి, ఆర్‌జే సూర్య అలియాస్ కొండబాబుల నడుమ బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నాగార్జున సహా బిగ్‌బాస్ టీం నానా అవస్థలూ పడుతోంది… ఆరోహి, సూర్య కూడా తమ లవ్ ట్రామాను బాగానే పండిస్తున్నారు… వాళ్లు ఇద్దరూ ఒకే చానెల్‌లో, ఒకే ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్నారు, పాత పరిచయం ఉంది, ఒకరంటే ఒకరికి అభిమానం, స్నేహభావన కూడా ఉన్నయ్…
మిగతావాళ్లలో చాలామంది పెళ్లయినవాళ్లు, ఆల్‌రెడీ బయట లవర్స్ ఉన్నవాళ్లు ఉన్నారు… ఎలిజబుల్ జంటలు కాగలిగేవాళ్లు తక్కువే… వారిలో రాజశేఖర్ టాప్‌లో ఉన్నాడు… శ్రీసత్య కోసం తనేదో ఆసక్తి చూపిస్తున్నాడు కానీ… ఆమె తన పాత అనుభవాల రీత్యా మగవాళ్లను దగ్గరకు రానిచ్చే సీన్ కనిపించడం లేదు… రాజశేఖర్ ఇంట్రస్టును సరదాగా ఆసక్తిగా గమనిస్తున్నది, అంతే… మరోవైపు కీర్తితో ముడిపెడదామని బిగ్‌బాస్ టీం ఏదో ప్రయత్నం చేసింది కానీ పెద్దగా క్లిక్ కాలేదు ఫాఫం…
Ads
అనూహ్యంగా, పెద్దగా ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు, అంతెందుకు రాజశేఖరే విస్తుపోయాడు ఓ దశలో… ఎలిమినేటైన నేహా వెళ్తూ వెళ్తూ రాజశేఖర్‌తో తనకు బాగా పెరిగిన బంధాన్ని ఎక్స్‌ప్రెస్ చేసింది… నాగార్జున కూడా అలా వింటూ, చూస్తూ ఉండిపోయాడు… ‘‘కొన్నేళ్లుగా నా జీవితంలోకి ఏ మగవాడి ఫ్రెండ్‌షిప్‌నూ రానివ్వలేదు… దూరంగా పుష్ చేస్తూ వచ్చాను, అలాంటిది రాజశేఖర్‌తో బాగా చిక్కని బంధం ఏర్పడిపోయింది…’’ అని ఒక్కసారి ఎమోషన్‌కు గురైంది… ‘‘బయటికి వచ్చిన తరువాత కూడా నేనే నీకు బాడీగార్డ్’’ అని తన మనసులో ఫీల్‌ను సూటిగానే చెప్పేసింది… (ఆమెకు బ్రియాన్ లారా సపోర్టుగా ఇన్‌స్టా స్టోరీ పెట్టిన సంగతి చెప్పుకున్నాం కదా…)
ఆమె ఎమోటివే కానీ ఇన్నాళ్లు హౌజులో పెద్దగా బయటపడలేదు… అలాంటిది హౌజు నుంచి పోతూ పోతూ తన మనసులోని ప్రేమభావనను స్పష్టంగానే ఆవిష్కరించి వెళ్లడం ఇంట్రస్టింగుగా అనిపించింది… ఇవి తప్ప ఇక వేరే లవ్ ట్రాకులు ఏమీ ఈసారి కనిపించడం లేదు… సీపీఐ నారాయణకు ఒక్కరూ పనిపెట్టడం లేదు… ప్చ్… ఏం ఆడుతారయ్యా ఆట…?!
Share this Article