ఇళయరాజా… ఈయన జగమెరిగిన సంగీత దర్శకుడు… స్వరకర్త… అయితేనేం..? లౌకిక, వ్యవహారిక అంశాల్లో ఆ పేరుప్రఖ్యాతులేమీ ఉపయోగపడవు కదా… ఎల్వీ ప్రసాద్ ఉన్నప్పుడు మద్రాసులోని తన స్టూడియోలోని ఓ గదిని ఇళయరాజాకు కేటాయించాడు, వాడుకో బ్రదర్ అన్నాడు… రూం నంబర్ వన్… దాన్ని ఇళయారాజా రికార్డింగ్ థియేటర్ అని పిలిచేవారు… మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మాట ఇది… అప్పట్లో ఈయన ఫుల్ బిజీ… స్టూడియో బిజీ… బోలెడు సినిమాలు… రికార్డింగులు, సిట్టింగులు… ఈయన అవసరం వాళ్లకుంది… వాళ్ల అవసరం ఈయనకుంది… సత్సంబంధాలున్నయ్… కాలం గిర్రున తిరిగింది…
ఇళయరాజాది అంతా గతవైభవమే కదా… ఆ స్టూడియోది కూడా అంతే… ప్రసాద్ గతించాడు… అసలు చెన్నై ఫిలిమ్ ఇండస్ట్రీయే బాగా తగ్గిపోయింది… ఇతర దక్షిణాది భాషల సినిమా ఇండస్ట్రీలు వేర్వేరు గమ్యాలను వెతుక్కున్నాయి ఎప్పుడో… ప్రసాద్ గౌరవించినట్టుగా ప్రసాద్ వారసులు ఇళయరాజాను గౌరవించాలని ఏముంది..?
Ads
స్టూడియోను రినోవేట్ చేసి, ఏదో పెద్ద ఐటీ కంపెనీకి ఇచ్చేయాలని అనుకున్నారు… మరి ఇప్పుడు స్టూడియోలకు పనేముంది గనుక..? సో, ఓ ఫైన్ మార్నింగ్… ‘‘అంకుల్, మీరు ఆ రూం ఖాళీ చేయాలి ప్లీజ్’’ అని చెప్పేశారు… తప్పదు కదా, ఈ ఒక్క రూం కోసం మొత్తం ఖాళీగా ఉంచలేరు కదా… కానీ ఇళయారాజాకు అది అగౌరవంగా తోచింది… అసలే కెలుకుడెక్కువ మనిషి కదా… ఠాట్, కుదరదు అన్నాడు…
ప్రసాద్ ఇచ్చాడు, మీరెవరు ఖాళీ చేయమని చెప్పడానికి అన్నాడు… వాళ్లిక తప్పనిసరై ఓరోజు గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్లతో అడ్డగింపజేసి, నో అడ్మిషన్ ప్లీజ్ అనిపించారు… అది మరింత అవమానం అనిపించింది ఈయనకు…
ఆ రూం తాళాలు నా దగ్గరే ఉన్నాయి, ఈ పంచాయితీ ఏమిటో తేల్చండి అని కోర్టుకెక్కాడు… (ఆమధ్య బాలసుబ్రహ్మణ్యంతో పాటల రాయల్టీ మీద కొన్నాళ్లు పంచాయితీ నడిచింది)… నీ రూమే సరే, కానీ లీగల్గా రైట్స్ ఏమీ లేవు కదా… గట్టిగా అడగడానికి ఏముంది..? ఈయనేమీ కొన్న ప్రాపర్టీ కాదు కదా… ఏదో మాట, మర్యాద మీద ఇన్నేళ్లూ వాడుకున్నాడు…
ఓ దశలో తనకు ప్రసాద్ వారసులు పెడుతున్న మానసిక క్షోభకు గాను 50 లక్షల పరిహారం డిమాండ్ చేశాడు… పోటీ కక్షిదారులు నవ్వుకున్నారు… ఇక మర్యాదేముంది..? మాస్టారూ, అంకుల్ అనే పదాలు వదిలేసి… ఫోఫోవోయ్ అనేశారు… ఏం చేయాలో అర్థం గాక… ఓరోజు చివరిసారిగా తన రూం చూసుకుంటాననీ, తను గతంలో రికార్డ్ చేసిన పాటల నోట్స్, కొన్ని సంగీత పరికరాల్ని తెచ్చుకుంటానని చెప్పాడు కోర్టుకు… జస్ట్, నలుగురు అయిదుగురితో మాత్రమే వెళ్లి, ధ్యానం చేసుకో కాసేపు, ఈలోపు మీ సహాయకులు మీ నోట్స్, మీ వస్తువులు సర్దేస్తారు, ఖాళీ చేసేయండి అని హైకోర్టు తీర్పు చెప్పింది… కోర్టు చెప్పింది కాబట్టి ఒక్కపూటకు ఆయన్ని స్టూడియోలోకి అనుమతిస్తామని ప్రసాద్ వారసులు చెప్పారు…
ముందుగా ఇళయరాజా లాయర్ వెళ్లాడు… అప్పటికే ఆ రూం తలుపులు విరగ్గొట్టేశారు… ఆయనకు సంబంధించిన తబలాలో, వీణలో, ఫ్లూటులో, నోట్సో, హార్మోనియం పెట్టెలో… తీసుకెళ్లి గోడౌన్లో పడేశారు… ఈ విషయం తెలిసి ఇక ఖిన్నుడై ఆ పరిసరాలకే వెళ్లలేదు ఈయన… ప్చ్… అంతే… ఒకరి దగ్గర దొరికిన మర్యాద ఆయన వారసుల నుంచీ దొరుకుతుందని ఆశించలేం, దానికి పరిస్థితులు కూడా సహకరించకపోవచ్చు… సేమ్, ఈ కేసులాగే…!!
Share this Article