సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని [Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి, దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ్యక్ష పీఠం నుండి దిగిపోయేలా చేయడానికి కావాల్సిన ప్లాన్ ని చాలా పకడ్బందీగా అమలుచేయడంలో నాటో కూటమి విజయవంతం అయ్యింది. పుతిన్ తాజాగా తాను ఆటమిక్ వేపన్స్ ని ప్రయోగించడానికి వెనుకాడను అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు…
గత ఫిబ్రవరి 23న స్పెషల్ ఆపరేషన్ పేరిట వ్లాదిమిర్ పుతిన్ మొదలు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత ప్రధాని ఎలాంటి సూచన కానీ సలహా కానీ ఇవ్వలేదు పుతిన్ కి. స్పెషల్ ఆపరేషన్ మొదలవడానికి ముందు రష్యన్ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి ఇద్దరూ విడివిడిగా మోడీ, జయశంకర్, అజిత్ దోవల్ గారితో సమావేశం అయ్యి, కూలంకషంగా చర్చించి వెళ్ళిన తరువాత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని లాంఛనంగా భారత్ కి అందచేసే నెపంతో పుతిన్ కూడా న్యూ ఢిల్లీ వచ్చి, మోడీతో కలిసి చర్చలు జరిపిన తరువాతే ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టాడు పుతిన్…
*******************************************
Ads
విమానాశ్రయాలలో పని చేసే సిబ్బంది, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ప్రతి ఇంటి నుండి కనీసం ఒక్కరు అయినా రష్యన్ సైన్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండండి : ఇటీవలే పుతిన్ రష్యన్ ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన ప్రకటన ఇది…
మొత్తం 3 లక్షల సైన్యాన్ని సిద్ధం చేసి ఉక్రెయిన్ మీద దాడి చేయాలని పుతిన్ ప్లాన్. దాని కోసమే ప్రజలని ఉద్దేశించి చేసిన ప్రకటన వలన రష్యాలో యువకుల వలసలు తీవ్రం అయ్యాయని తెలుస్తున్నది. ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదు కానీ పుతిన్ ఉద్దేశాన్ని ప్రజలు అర్ధం చేసుకోవట్లేదు… అదే సమయంలో పుతిన్ ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వట్లేదు! యుద్ధం వలన ధన, ప్రాణ నష్టం తప్పితే ఒరిగేది ఏమీ ఉండదు అని ప్రజల అభిప్రాయం… కానీ అదే సమయంలో ఉక్రెయిన్ కనుక నాటో సభ్యత్వం తీసుకుంటే అది రష్యాకి చేటు తెస్తుంది అనేది కూడా నిజమే ! ఎప్పుడో జరగబోయే పరిణామాలని ఇప్పటి నుండే ఊహించుకుని భయపడడం వ్యర్ధం అని రష్యన్ ప్రజల భావన!
రష్యా రెండో అతి పెద్ద సైన్య శక్తి అనేది కేవలం భ్రమ మాత్రమేనా ?
పశ్చిమ దేశాల ప్రచారం నమ్మలేము కానీ అలా అని వాస్తవాలని విస్మరించలేము కదా ? వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థలలో వస్తున్న సమాచారం కొంచెం అతిగా అనిపించినా కొద్దో గొప్పో నిజాలు మాత్రం ఉంటున్నాయి. ఊహాకి లాజిక్ కి మధ్య దూరం ఉంది కానీ ఒక్కోసారి లాజిక్ కంటే ఊహ నిజం అవ్వవచ్చు.
1. ప్రస్తుతం రష్యా దగ్గర గైడెడ్ క్రూయిజ్ మిసైళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది నిజమే. పశ్చిమ దేశాల డాటా ప్రకారం రష్యా దగ్గర ఇప్పుడు 200 కంటే క్రూయిజ్ మిసైళ్లు లేవు. గత ఆరు నెలలుగా విచక్షణ లేకుండా క్రూయిజ్ మిస్సైళ్ళని ఉక్రెయిన్ భూభాగం మీదకి ప్రయోగించింది రష్యా. సింహా భాగం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూల్చడానికి ప్రయోగించింది అవి విజయవంతంగా పని పూర్తి చేశాయి. ఇక కీలక ఫాక్టరీలు,ఎయిర్ పోర్ట్ ల మీద కూడా క్రూయిజ్ మిస్సయిళ్ల ని ప్రయోగించింది రష్యా. రష్యన్ క్రూయిజ్ మిస్సైల్స్ టార్గెట్ ని ఛేదించడం లో 80% విజయం సాధించాయి. యుద్ధానికి ముందు 700 దాకా ఉన్న క్రూయిజ్ మిస్సైళ్ళ సంఖ్య ఇప్పుడు 200 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ కొత్తవి తయారుచేయాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. ఉన్నవాటిని ప్రయోగించలేదు ఎందుకంటే అత్యవసర పరిస్థితిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది.
2. ఇక యుద్ధ టాంకులు అయితే దాదాపుగా 400 దాకా నష్టపోయింది రష్యన్ సైన్యం ఉక్రెయిన్ లో. అయితే వీటిలో చాలా వరకు పాత తరం యుద్ధ టాంకులు ఉన్నాయి కానీ లేటెస్ట్ అని చెప్పబడుతున్న T-90M MBT ని నెల రోజుల క్రితం ఉక్రెయిన్ దళాలు రష్యన్ దళాల నుండి స్వాధీనం చేసుకున్నాయి. T-90M MBT ఏ మాత్రం దెబ్బతినలేదు కానీ ఉక్రెయిన్ వశం అయ్యింది. దీని మీద రక్షణ రంగ నిపుణులు చెప్తున్నది ఏమిటంటే T-90M MBT ని స్వాధీనం చేసుకున్న వెంటనే దానిని పోలాండ్ దేశానికి తరలించి అక్కడ అమెరికన్ నిపుణులు దానిని అణువు అణువు శోధించి ఎక్కడ ఏ ప్రాంతంలో దాని బలహీనతలు ఉన్నాయో ఈపాటికి ఒక చార్ట్ రూపొందించి ఉంటారు. కాబట్టి ముందు ముందు రష్యా కనుక T-90M MBT ని రంగంలోకి దించితే చాలా తేలికగా దానిని ధ్వంసం చేయగలుగుతుంది ఉక్రెయిన్. అంటే ఈపాటికే దానిని ఎలా నాశనం చేయవచ్చో ఒక ప్రణాళిక రూపొందించి దానిని ఉక్రెయిన్ దళాలకి ఇచ్చేసి ఉంటుంది అమెరికా !
3. రష్యన్ యుద్ధ విమానాలు మొదట్లో ఉక్రెయిన్ భూభాగం మీద దాడి చేయగలిగినా గత మూడు నెలలో సుఖోయ్ లు కానీ మిగ్ లు కానీ ఉక్రెయిన్ భూభాగం మీద దాడి చేయడానికి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళినవి తక్కువ. రష్యన్ జెట్ ఫైటర్స్ ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ రక్షణ వలయాన్ని ఛేదించుకొని దాడి చేయలేక కూలిపోతున్నాయి దాంతో ఎయిర్ ఫోర్స్ ని ఉపయోగించడం లేదు రష్యా. నాటో, అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ ని తప్పించుకోవడం రష్యన్ ఫైటర్స్ వల్ల సాధ్యం కావడం లేదు.
4. ఇక మిగిలింది రష్యన్ నావీ ! ఇప్పటికే రెండు ముఖ్యమయిన ఫ్రిగేట్ లని కోల్పోయిన రష్యా నల్ల సముద్ర తీరానికి దూరంగా ఉంటున్నాయి నావీ షిప్స్. అంటే ఆత్మ రక్షణలో పడిపోయింది రష్యన్ నావీ !
5. రష్యన్ ఇంటెలిజెన్స్ సంస్థ FSB వైఫల్యం కొట్ట వచ్చినట్లు కనపడుతున్నది. అటు మిలటరీ ఇంటెలిజెన్స్ కూడా తగినంత సమాచారాన్ని సేకరించలేకపోయింది ఇప్పటి వరకు. కెనడా కి చెందిన ఇద్దరు మిలటరీ వ్యూహకర్తలు రష్యన్ దళాలకి బందీలుగా చిక్కారు అంటే గత నాలుగు నెలలుగా అంటే ఫిబ్రవరి నుండి జులై నెల వరకు ఇద్దరూ కూడా ఉక్రెయిన్ లోనే ఉండి రష్యన్ దళాల కదలికల మీద ఎలాంటి చర్య తీసుకోవాలో సలహాలు ఇస్తూ వచ్చారు కానీ రష్యన్ మిలటరీ ఇంటిలిజెన్స్ కి ఏ మాత్రం క్లూ లేదు వాళ్ళు యుద్ధ ఖైదీలుగా పట్టుబడేవరకు.
6. ఇక రష్యన్ ఆర్టీలరీ అయితే పెద్ద మొత్తంలో ఉక్రెయిన్ సైన్యం వశం అయిపోయి చాలా రోజులు అయ్యింది. రష్యన్ సైనికులు పెద్దగా శిక్షణ పొందిన వారు కాకపోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి కావాల్సిన సప్లై చైన్ ని ఉక్రెయిన్ దళాలు ఆపేశారు… దాంతో విధిలేని స్థితిలో వాళ్ళు లొంగిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యన్ సైన్యం ఆర్టిలరి మీద ఆధారపడలేదు. పోనీ యుద్ధ టాంకులు అన్నా ఆసరాగా ఉంటాయా అంటే రిజర్వ్ లో ఉన్న దాదాపు 2 వేల టాంకులు నిర్వహణ లేకుండా సంవత్సరాల తరబడి ఎక్కడ ఉన్నవి అలానే పడి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వాటిని తిరిగి సన్నద్ధం చేయాలి అంటే కనీసం నెల రోజులు పడుతుంది.
7. ఫిబ్రవరి నెలలో ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు 1,10,000 మంది సైనికులని ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద మోహరించింది అని వార్తలు వచ్చాయి కానీ వాళ్ళలో ఎంతమంది సునిశితమయిన శిక్షణ తీసుకున్న వారు ఎందరో ఎవరికీ తెలియదు. చాలా మంది మధ్యలోనే ఆయుధాలు వదిలేసి లొంగిపోవడమో లేదా రష్యాలోకి పారిపోవడమో జరిగింది.
8. ఇప్పుడు 3 లక్షల మంది సైన్యంతో ఉక్రెయిన్ మీద దాడి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు పుతిన్ కానీ ఎవరూ పుతిన్ మాట వినే స్థితిలో లేరు.
9. రష్యా నుండి జార్జియా సరిహద్దుల చెక్ పోస్ట్ ల దగ్గర వందలాది వాహనాలు నిలిచి ఉన్నాయి ఇప్పుడు. రష్యా నుండి పొరుగు దేశాలకి వలస వెళ్లిపోతున్నారు ప్రజలు. మరో వైపు పుతిన్ నుండి జార్జియా దేశానికి సందేశం వెళ్ళింది : ఎట్టి పరిస్థితులలోనూ రష్యన్ ప్రజలని జార్జియాలోకి అనుమతించవద్దు అంటూ…
10. జార్జియాలోకి అనుమతి దొరకకపోతే మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలకి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారు రష్యన్ ప్రజలు కానీ వెనక్కి వెళ్ళి రష్యన్ సైన్యంలో చేరడానికి సిద్ధంగా లేరు…
11. రష్యాకి మరో సరిహద్దు దేశం అయిన ఖజకిస్తాన్ దేశ సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర కూడా వందలాది రష్యన్ కార్లు, ట్రక్కులు నిలిచి ఉన్నట్లు తాజా వార్తలు తెలుపుతున్నాయి. తమ దేశంలోకి వచ్చే రష్యన్ ప్రజలకి అనుమతి ఇస్తే పుతిన్ కి కోపం వస్తుంది అనుమతి ఇవ్వకపోతే తీవ్రమయిన చలిలో ప్రజలు ఇబ్బంది పడాల్సిన స్థితి! ఎటూ తేల్చుకోలేక ఖజకిస్తాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రష్యన్ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఖజకిస్తాన్ లోకి వెళ్ళవచ్చు. అలాగే మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలలోకి రష్యన్ పాస్పోర్ట్ తో తేలికగా ప్రవేశం దొరికిపోతుంది.
12. మేము యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా లేము అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసనకి దిగుతున్నారు రష్యన్ ప్రజలు. ఈ రోజు వరకు ఇప్పటికే 2 వేల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ నిరసన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. పుతిన్ మొండి పట్టుదల, చివరకి స్ట్రాటజిక్ అణు బాంబులు ప్రయోగించే స్థితికి వెళ్ళే అవకాశాలు కొట్టివెయ్యలేము.
*******************
ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు పుతిన్! పెద్ద సంఖ్యలో ఏ మాత్రం నైపుణ్యం లేని వాళ్ళని యుద్ధంలోకి దించడం ఇప్పటికే విజయవంతం కాదని తెలిసినా మళ్ళీ అదే వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతున్నాడు పుతిన్. హిట్లర్ 15 ఏళ్లు నిండిన యువతీ, యువకులని యుద్ధంలోకి దించి చివరిదశలో ఓటమి పొందిన సంగతి చరిత్ర, కానీ దాని నుండి గుణపాఠాలు నేర్చుకోలేదు పుతిన్.
******************
మరో వైపు ఎక్కువ ఆయుధాలు వాడకుండా రష్యా చేత ఆయుధాలని ఖర్చు పెట్టించి వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ వరుస విజయాలు సాధిస్తున్నది కానీ ఇది నాటో, అమెరికన్ యుద్ధ వ్యూహకర్తల పకడ్బందీ ప్లాన్ మాత్రమే ! ఈ విషయం పుతిన్ ఎందుకు గ్రహించట్లేదో ?
********************
సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని [Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ్యక్ష పీఠం నుండి దిగిపోయేలా చేయడానికి కావాల్సిన ప్లాన్ ని చాలా పకడ్బందీగా అమలుచేయడంలో నాటో కూటమి విజయవంతం అయ్యింది. పుతిన్ తాజాగా తాను ఆటమిక్ వేపన్స్ ని ప్రయోగించడానికి వెనుకాడను అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు.
**************************
Strategic Nuclear Weapons అంటే పరిమిత స్థాయిలో రేడియేషన్ ని కలుగచేస్తాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కేవలం 10 కిలో మీటర్ల పరిధిలో అణు ధార్మికతని సృష్టించగలవి అలాగే 2 కిలోమీటర్ల పరిధిలో కూడా అణు ధార్మికతని సృష్టించగల చిన్న వెపన్స్ ఉన్నాయి.
***************************
పుతిన్ తాజా ప్రకటనలో ఉక్రెయిన్ తో పాటు నాటోతో కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నాడు! ఇది చాలా ప్రమాదకరమయిన హెచ్చరిక ! ఎందుకంటే సాంప్రదాయ యుద్ధం చేసే స్థితిలో లేడు పుతిన్ ! హైపర్ సానిక్ మిసైల్ మరియు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్ళు [ICBM] మాత్రమే ప్రస్తుతం పుతిన్ దగ్గర ఉన్నాయి, వాటికి అణు వార్ హెడ్లని తగిలించి దాడి చేయగల సత్తా ఉంది పుతిన్ కి. ఇప్పుడు బాల్ నాటో కూటమి కోర్ట్ లో ఉంది. ఆడతారా ? డ్రా చేస్తారా ?
***********************
రష్యా కానీ, చైనా కానీ పేపర్ పులులు అని తెలిపోతున్నది. రష్యా కనీసం ప్రయత్నం చేసింది ఇంకా చేస్తున్నది కానీ చైనా మాత్రం గాల్వాన్ లోయ నుండి వెనక్కి వెళ్ళిపోయింది. తాజాగా పుతిన్ మరో వివాదానికి తెర తీశాడు. అది అలాస్కా ! అలాస్కాని తిరిగి స్వాధీనం చేసుకుంటాను అంటూ ప్రకటన చేశాడు. వివరాలు మరో పోస్ట్ లో తెలుసుకుందాం…..
Share this Article