ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్ గురించి అందరికీ తెలిసిందే కదా.., మన బ్రహ్మంగారిలాగే కాలజ్ఞానం రాసిన ప్రముఖ జ్యోతిష్కుడు… చాలామందికి ఆయన జోస్యాలు నిజమవుతాయనీ, అవుతున్నాయనీ, అవుతాయనీ విశ్వాసం… కాకపోతే జోస్యాలు అన్నీ మార్మికంగా ఉంటయ్… దాంతో చాలామంది వాళ్ల అవగాహన మేరకు, వాళ్లకు అర్థమైన మేరకు ఎవరికితోచిన బాష్యాలు వాళ్లు చెప్పారు, చెబుతూనే ఉన్నారు… నోటికొచ్చింది రాసి, కమర్షియల్‌గా బుక్స్ అమ్ముకున్నవాళ్లూ ఉన్నారు…
‘నోస్ట్రాడామస్… ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్’ పేరిట మా రియో రీడింగ్ అనే పెద్దమనిషి ఓ పుస్తకం రాశాడు… నోస్ట్రాడామస్ జోస్యాల్ని తాను సరిగ్గా అర్థం చేసుకున్నానని చెబుతాడు ఆయన… 2005లో ఈ బుక్ రిలీజైంది.,. ఇప్పుడది హఠాత్తుగా ఆ పుస్తకం మళ్లీ చర్చల్లోకి వచ్చింది… బుక్ సేల్స్ పెరిగాయి… కారణం :: బ్రిటన్ రాజకుటుంబంలో జరిగే పరిణామాల్ని అది ప్రస్తావించడం, అందులో ఒకటి నిజం కావడం, మరొకటి ఆశ్చర్య పరిణామాన్ని సూచిస్తుండటం…
Ads
క్వీన్ ఎలిజబెత్ మరణించాక, ప్రిన్స్ చార్లెస్ రాజు అయ్యాడు కదా… అయితే తను బ్రిటిష్ సింహాసనాన్ని వదిలేసుకుంటాడనీ, తన స్థానంలో తన రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ రాజు అవుతాడని ఓ జోస్యం రాసి ఉంది… అది ఇంట్రస్టింగే… కానీ ఆల్‌రెడీ చార్లెస్ రాజు అయిపోయాడుగా… పైగా సదరు ప్రిన్స్ హ్యారీ, తన భార్య మేఘన్ మార్క్‌లేతో సహా ఈ రాజరికపు కృతిమత్వం నచ్చక, బందిఖానా వంటి పద్ధతులు నచ్చక రాజరికాన్నే 2020లోనే వదిలేసి, అన్ని రాచరిక హోదాలకు దూరంగా ఎక్కడో దూరంగా అమెరికాలో ఉంటున్నారు… ఆ నిర్ణయం వెనుక మేఘన్ మార్కెల్ ఒత్తిడే ప్రధాన కారణం… మరి ఈ జోస్యం ఎలా నిజం అవుతుంది..?
ఇదే అడిగితే రీడింగ్ ఏమంటాడంటే..? ‘‘కింగ్ చార్లెస్ విడాకుల్నే ప్రజలు అంగీకరించలేదు… పైగా అతడు ఓ అసమర్థుడు, సింహాసనానికి అనర్హుడు అనే భావన ప్రజల్లో బలంగా ఉంది… చూస్తూ ఉండండి… కొంతకాలానికి తనను బలవంతంగా గద్దె దింపుతారు ఇదే ప్రజలు… ఎవరూ ఊహించని వ్యక్తి సింహాసనం ఎక్కుతాడు’’…. ఇదీ తన వివరణ… ఎవరూ ఊహించని వ్యక్తి ప్రిన్స్ హ్యారీయే ఎందుకు కావాలి అనేది మరో ప్రశ్న…
1555 కవితలుగా జోస్యాలు రాసిన నోస్ట్రాడామస్ తన ‘లెస్ ప్రొఫెటీస్’లో రాణి ఎలిజబెత్ మరణం సుమారు 2022 ప్రాంతంలో, అంటే 96 ఏళ్ల వయస్సులో జరుగుతుందని ఊహించాడు… అదే జరిగింది… దాంతో హఠాత్తుగా ప్రిన్స్ హ్యారీ రాజు అవుతాడని అంచనా వేస్తున్న ఈ మారియో రీడింగ్ పుస్తకానికి గిరాకీ పెరిగింది… అనుకోని వ్యక్తి అంటే అది ప్రిన్స్ హ్యారీ అనేది రీడింగ్ ఉద్దేశం… సో, అది కూడా జరుగుతుందని కొందరి నమ్మకం…
అంటే రాచరికపు హోదాలన్నీ ఎడమకాలితో తన్నేసి, రాజరికాన్ని ఓ బందిఖానాలా భావించి వెళ్లిపోయిన మేఘన్ మార్కెల్ మళ్లీ ఆ రాచరికపు మర్యాదల చట్రంలోకి, ఆ హోదాల అత్యున్నత గౌరవ ఖైదులోకి అడుగుపెట్టక తప్పదా..? అంగీకరిస్తుందా..? ఏమో మరి… నోస్ట్రాడామస్ అదే చెప్పాడేమో…!!
Share this Article