ఫోటోలున్న కుండలు పగలగొట్టి నామినేషన్ చేయడం… మొహాలపై ఇంకు స్టాంపులు వేయడం… మెడల్లో జంతువుల పేర్లతో బోర్డులు వేలాడదీయడం…. ఈసారి బిగ్‌బాస్ సీజన్ చూస్తుంటే పాత సీజన్లే మళ్లీ చూస్తున్నట్టుగా ఉంది… ఇంట్రస్టు లేక ఈ సీజన్‌ను వదిలేశారా..? లేక క్రియేటివ్ టీం కెపాసిటీయే అలా ఉందా..? కొత్త ఆలోచనలు రావడం లేదా..? మెదళ్లు ఖాళీ అయిపోయాయా..?
అసలు దరిద్రమైన రేటింగ్స్ వస్తూ… డబ్బులు తెచ్చే యాడ్స్ కూడా లేని స్థితిలో… ఎవరైనా సరే, కొత్తగా ఆలోచిస్తారు… చించాలి… కానీ బిగ్‌బాస్ టీం మరింతగా ముడుచుకుని పోయింది… ఈరోజు పోటీ చూడండి… బీబీ హోటల్… సేమ్, గతంలోలాగే… గెస్టులు, సప్లయర్స్, సేవలు… చివరకు ఓడిన టీం నుంచి ఒకరు, గెలిచిన టీం నుంచి ఒకరు, ఇండివిడ్యుయల్‌గా బాగా ఆడినవాళ్లు మరొకరు కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెండర్స్ అవుతారట… ఒకరికి సీక్రెట్ టాస్క్ ఉండనే ఉంటుంది… షాళా ఫాత చింతకాయ పచ్చడి…
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లకు పెట్టే పరీక్షలు… వాళ్ల వ్యక్తిగత మెరిట్‌ను ఎక్స్‌పోజ్ చేయడమే కాదు… ప్రేక్షకులకు కాస్త ఫన్, వినోదాన్ని పంచాలి… ఎంతసేపూ కంటెస్టెంట్లు అరుచుకోవడం, ఒకరిపైనొకరు కుట్రలు పన్నడం అనేది ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని ఇవ్వదు… గతంలో ఇలాంటివి చూసీ చూసీ బోర్ వచ్చేసింది… ఏదైనా కొత్త తరహా టాస్కులు కోరుకుంటున్నారు ప్రేక్షకులు… అదుగో, అదే ఇప్పుడు లోపించింది…
Ads
పైగా గత సీజన్లలో లవ్ ట్రాకులు, రొమాన్స్ ఫ్లేవర్ షోకు అడిషినల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ వాల్యూను యాడ్ చేసేవి… ఈసారి అవీ లేవు… పెళ్లయినవాళ్లను, ఆల్‌రెడీ బయట బుక్కయినవాళ్లను, బిట్టర్ ఎక్స్‌పీరియెన్స్ ఫేస్ చేసినవాళ్లను తీసుకొస్తే ఇక హౌజులో ప్రేమవినోదం పండేదెక్కడ..? అందుకే కేరక్టర్లన్నీ ముడుచుకుపోయాయి… ఒక్క ఆరోహి, ఆర్జే సూర్యల జంట మాత్రమే ధైర్యంగా ఎక్స్‌పోజ్ అవుతోంది… కీర్తికి ఏడుపే ఎప్పుడూ…
శ్రీసత్య ఇంకా పాత అనుభవాల ప్రభావం నుంచి బయటపడినట్టు లేదు… వాసంతి డల్… ఫాఫం, రాజశేఖర్‌పై మరులుగొన్న నేహను పంపించేశారు… అభినయను రెండో వారమే పంపించారు… ఈసారి వాసంతిని కూడా పంపించేస్తే మరో వికెట్ డౌన్… మగ తోపులు కూడా పెద్ద యాక్టివ్‌గా లేవు… సేఫ్ గేమ్ ఆడుతూ ఈ సీజన్‌ను రంగురుచివాసన లేని ప్రోగ్రాంగా మార్చేస్తున్నారు… కాస్త డిఫరెంటుగా అనిపించినా సరే గీతు, రేవంత్ లేకపోతే అసలు హౌజ్‌కే తాళాలు వేయాల్సిన దుస్థితి… ఫాఫం, నాగార్జున కూడా వీకెండ్ షోలకు వచ్చి ఏం చేయగలడు..? క్లాసులు పీకితే వినోదం వస్తుందా..?
ఇప్పుడు ఫైమా కాస్త యాక్టివ్ అయినట్టుంది… ఇనయ కూడా యాక్టివే, కాకపోతే ప్రతి చిన్న విషయానికీ రియాక్టయ్యే తీరు బాగాలేదు… అందరూ ఆమెను టార్గెట్ చేసి, బలపడేట్టు చేస్తున్నారు…. ఇక ఇవే హోటల్ టాస్కులు, ఇవే పాత తరహా గేమ్స్ మీద ఆధారపడితే మాత్రం ఈసారి సీజన్ మాటీవీకి చేతులూమూతులూ కాలిపోవడం ఖాయం… వచ్చే సీజన్ ఉండదు, షో ఎత్తేస్తారని అప్పుడే ట్యూబర్లు, సైట్లు రాసేస్తున్నయ్… అది నిజం కాకపోవచ్చు… నాన్ ఫిక్షన్ కేటగిరీలో బిగ్‌బాస్ తప్ప మాటీవీకి మరో రియాలిటీ షో చేతకావడం లేదు… సో, కంటిన్యూ అవుతుంది… కాకపోతే చాలా మార్పులు తప్పవు… ఏమో, నిర్వాహకులే మారిపోవచ్చు… ఇక ఈ సీజన్ ఎలాగోలా చుట్టేస్తారు… మమ అనిపించేస్తారు…!!
Share this Article