రాహుల్ గాంధీ ఎన్ని జోడో యాత్రలు చేసినా వేస్టు… ముందుగా తమ నాయకుల నోళ్లను అదుపు చేయాలి… ఏవైనా పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి వణకాలి… సరైన వ్యాఖ్యలకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద ఓ కాంగ్రెస్ నాయకుడు నోరుపారేసుకున్నాడు… ఆయన పేరు ఉదిత్ రాజ్, మాజీ ఎంపీ…
అసలు విషయం ఏమిటంటే… మొన్న 3న ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘దేశం పాల ఉత్పత్తిలో మొదటిస్థానం, వినియోగంలోనూ మొదటిస్థానం… శ్వేతవిప్లవం గుజరాత్ నుంచే ప్రారంభమైంది… అంతెందుకు..? దేశంలో 70 శాతం మంది గుజరాత్ ఉప్పునే తింటున్నారు…’’ అని ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పింది… నిజానికి అందులో తప్పేముంది..? ఇందులో గుజరాతీ అనుకూల విధేయత ఏముంది..?
సపోజ్, ఎవరైనా ‘దేశంలో 70 శాతం మంది తెలంగాణ బియ్యమే తింటున్నారు… దేశానికి తిండి పెడుతున్నది తెలంగాణే’ అని వ్యాఖ్యానిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుంది..? ఒక రంగంలో ఘనతను చెప్పి అభినందించడం అది… కానీ గుజరాత్ ఉప్పు వ్యాఖ్యల్ని సదరు కాంగ్రెస్ నాయకుడు నెగెటివ్‌గా తీసుకున్నాడు… ప్రధానిని కించపరుస్తూ ఓ రెండు ట్వీట్లు వదిలాడు… ఓ ఆదివాసీ, వివాదారహిత మహిళ తొలిసారిగా ఈ దేశపు అత్యున్నత రాజ్యాంగపదవిలో ఉంది… పైగా ప్రధాని చేసే వ్యాఖ్యల్ని ఒకటికి నాలుగుసార్లు రాష్ట్రపతిభవన్ టీం పరిశీలించాకే అవి బయటకు వస్తాయి… ఆమె ఈ దేశానికి రాష్ట్రపతి హోదాలో మాట్లాడుతుందే తప్ప ఓ పార్టీ నాయకురాలిగా కాదు కదా…
Ads
నిజానికి ఉదిత్ రాజ్ బీజేపీ మనిషే… 2014 నుంచి 2019 వరకు నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీయే… 2019లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు… దాంతో కాంగ్రెస్‌లో చేరాడు… ఇప్పుడు ఏమంటాడంటే..? ‘‘ముర్ము వంటి వ్యక్తి ఏ దేశానికీ ప్రెసిడెంట్ కాకూడదు… చెంచాగిరీకయినా సరే ఓ హద్దు ఉంటుంది…’’ అని ఒక ట్వీట్… ‘‘ముర్మును గిరిజనుల ప్రతినిధిగా ఫోకస్ చేసి వోట్లు అడిగారు… ఆమె రాష్ట్రపతి మాత్రమే కాదు, గిరిజనుల ప్రతినిధి కూడా… ఎస్సీ, ఎస్టీ పేరుతో పదవుల్లోకి వెళ్లి మౌనంగా ఉంటే ఏడుపు వస్తుంది’’ అని మరో ట్వీట్…
నిజానికి ద్రౌపది ముర్ముపట్ల కాంగ్రెస్ ధోరణి ఇదేమీ కొత్తకాదు… గతంలో కాంగ్రెస్ లోకసభ ఎంపీ అధిర్ రంజన్ చౌదురి ద్రౌపది ముర్మను ఉద్దేశించి రాష్ట్రపత్ని అని వ్యాఖ్యానించాడు… ఉదిత్ రాజ్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ కిక్కుమనలేదు… అంటే ఏమిటి దానికి అర్థం..? ఆమోదిస్తున్నట్టా..? ఓ ఆదివాసీ మహిళా రాష్ట్రపతిని కించపరిచే వ్యాఖ్యలకు పార్టీ స్పందన ఇదేనా..? చివరకు ఉదిత్ రాజే ఏమనుకున్నాడో ఏమిటో… అబ్బే, ఇవి నా వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదు అని స్పందించాడు… ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏవైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధం ఉంటుంది, ఉండాలి…!!
Share this Article