ఒక సీజన్‌లో గుర్తుందా..? రోల్ కేస్టర్ ఎక్కిన బ్రహ్మానందంలాగే… సంపూర్ణేష్ నన్ను హౌజు నుంచి పంపించండ్రో అని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు… ఎస్, బిగ్‌బాస్ హౌజులో ఓ 3 నెలలు ఉండటం ఈజీ టాస్క్ కాదు… అసలు ఆ ఆటను అర్థం చేసుకోవాలి ముందు… జబర్దస్త్ చంటికి అది చేతకాలేదు… ఆ గేమ్ అర్థమైనవాళ్లు మాత్రమే అక్కడ ఉండగలరు… అలా ఉండలేక చంటి తనంతట తనే బయటికి వచ్చేశాడు… చేతులెత్తేసి…
అది గేమ్, అందరితో బాగుండాలి అనుకుంటే కుదరదు, కూర్చుండబెట్టి తిండిపెట్టడానికి కాదు కదా వచ్చేది… ప్రేక్షకులు ఎందుకు చూస్తారు అలాగైతే… అసలు ఆ షో కాన్సెప్టే అది కాదు కదా… మొదటి నుంచీ చంటి ఇనాక్టివ్… ఓ టాస్క్‌లో సరిగ్గా ఉండడు… ఓ పోటీలో ఉండడు… చివరకు కెప్టెన్సీ టాస్కుల్లో పార్టిసిపేట్ గాకుండా బ్యాన్‌కు గురయ్యాడు… తరువాత ఒక్కసారిగా డల్ అయిపోయాడు… తినడం లేదు… నేను ఉండను, నేను పోతాను అంటున్నాడు…
నిజానికి తనకు అంత రెమ్యునరేషన్ వేస్ట్… అసలే రేటింగ్స్ లేక, యాడ్స్ లేక, రెవిన్యూ లేక ఇప్పటికే బిగ్‌బాస్-6 సీజన్ దివాలా తీసింది… అదేమిటో తరువాత చెబుతా… సో, ఎలాగూ అక్కడ తిండి తినడం లేదు, ఇబ్బందిగా మారాడు, అంత డబ్బు వేస్టు, తనే పోతాను అంటున్నాడు, సో, వోటింగ్ గీటింగ్ జాన్తా నై… ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు చంటిని…
Ads
తను హౌజులోకి ఎంటరైనప్పుడు మంచి చాయిసే అనిపించింది… కానీ ఫైమాకు అర్థమైనంత కూడా చంటికి ఆట అర్థం కాలేదు… నిజానికి ఈసారి ఎంపికలే పెద్ద దరిద్రం… సరే, ఉన్నంతలో ఆలోచిస్తే గీతు, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా కాస్త బెటర్‌గా కనిపిస్తున్నారు… వాళ్లకు బిగ్‌బాస్ గేమ్ అంటే ఏమిటో తెలుసు… ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం… బార్క్ రేటింగ్స్ మరింత ఘోరంగా పడిపోయాయి… ‘చిన్నబ్రేక్, చిటికెలో వస్తాను అని నాగార్జున అని కాసేపు మాయమవుతాడు కదా…
నిజానికి ఆ గ్యాపులో యాడ్స్ కుమ్మేయాలి… ఏమీ లేవు… ఎంత ఘోరం అంటే వీక్ డేస్‌లో మరీ 1.82 రేటింగ్ నుంచి 2.5 వరకు మాత్రమే కనిపిస్తున్నాయి… ఇంకా విచిత్రం ఏమిటంటే వీకెండ్ షోలలో శనివారంకన్నా ఆదివారం కాస్త ఎక్కువగా రేటింగ్స్ ఉంటాయి కదా… మొన్నటిసారి ఆదివారంకన్నా శనివారమే కాస్త బెటర్… ఓవరాల్‌గా 4 రేటింగ్ (హైదరాబాద్) దరిదాపుల్లోనే… ఇక ఈ షో లేవదు, లేపరు… అవసరం లేదు… అట్టర్ ఫ్లాప్ సీజన్ ఇది…
సర్‌ప్రైజ్ ఎంట్రీలు లేవు… ఉన్నవాళ్లలో ఎక్కువ రెమ్యునరేషన్ ఉండి, మినిమం పర్‌ఫామెన్స్ కూడా చూపని కేరక్టర్లను వదిలించుకోవడమే… నిజం చెప్పాలంటే… హౌజుకు తాళాలు వేసి, అందరినీ ఇళ్లకు పంపించేయడం బెటర్… అలా చేస్తే ఇజ్జత్ పోతుంది, క్రెడిబులిటీ పోతుంది అనేదేమీ లేదు… అసలు ఈసారి కావాలనే స్టార్ గ్రూపు ఏవో కొత్త ఒప్పందాలు, కంట్రాక్టుల నేపథ్యంలో… బిగ్‌బాస్‌ను అండర్ ప్లే చేస్తోందనే ప్రచారం కూడా ఉంది… అదే నిజమైతే ఇక ఈ షో ఎండ్ దాకా ఇలాగే నిస్సారంగా, నీరసంగా సాగుతుంది…!!
Share this Article