ఎవడో చిన్నపాటి నటుడు అట… అదేదో దిక్కుమాలినపాటి యూట్యూబ్ చానెల్లో కోపంగా బెదిరిస్తున్నాడు… ‘‘మా బాస్‌కు కోట్ల మంది భక్తజనం ఉన్నారు… ఆయన్ని గరికపాటే కాదు, ఘనాపాటే కాదు, ఎవడేమన్నా తాటతీస్తాం… అంతేకాదు, ఆయన ప్రవచనాలకు ఇకపై ఏ సినిమా వ్యక్తీ హాజరు కాడు…” ఎస్, సినిమా వాళ్లంటేనే సంస్కార, సభ్య, నాగరిక, ఆధ్యాత్మిక, పద్దతైన ఏ కార్యక్రమాలకూ ‘‘పిలవదగిన వ్యక్తులు’’ కాదని చాలామంది భావిస్తారు… ఇప్పుడు మీరే చెబుతున్నారు… శుభం…
ఇన్నేళ్లుగా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తున్నాడు… అది రాజకీయ భేటీ కాదు… ఆత్మీయ భేటీ… రాజకీయాల్లో ఉప్పునిప్పూ తరహా పార్టీలు, నాయకులు కూడా అక్కడికి వస్తారు, కాసేపు ఉంటారు… పాలిటిక్స్ అంతిమంగా ఈ సమాజ వాతావరణాన్ని pollute చేయవద్దనేది spirit… అది తెలంగాణ సమాజం కనబరిచే పరస్పర అభిమాన, మర్యాదపూర్వక ధోరణి… మొదటిసారి ఎందుకింత రచ్చ అయ్యింది దత్తన్నా..? వద్దు.., మనసులో బాధపడకు, ఎక్కడ తప్పు జరిగిందో నీకూ తెలుసు… ఏపీ మార్క్ బురద, బూతు పొలిటికల్ culture దిగుమతి అవుతోంది…
మొదటిసారి దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమానికి కృత్రిమత్వం, సంస్కారరాహిత్యం అద్దబడ్డయ్… ఇకపై దత్తాత్రేయ అలయ్ బలయ్ వెళ్లడానికి ఎవరైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు… మొత్తం ఈ నష్టానికి కారకులు ఎవరు..? చిరంజీవిని యండమూరి, రాంగోపాలవర్మ, రాజశేఖర్ ఎట్సెట్రా ఎవరైనా, ఎప్పుడైనా, ఏమైనా అంటే… తను మెత్తగా మాట్లాడతాడు… చుట్టూ ఉన్న కొన్ని చిల్లరగ్రహాలు మొదలుపెడతాయి… చిరంజీవి ఎంజాయ్ చేస్తుంటాడు… వారించడు… నిజంగా నన్ను ప్రేమించేవాళ్లు ఇలాంటి దుర్భాషలు, దుర్వ్యాఖ్యలకు దూరంగా ఉండండి అని ఓ ట్వీట్ ఎందుకు చేతకాలేదు గరికపాటి వివాదంలో…
Ads
అక్కడేమో గరికపాటి ప్రవచనాలు నాకూ ఇష్టం… ఆయన్ని ఇంటికి పిలుస్తాను, భోజనం పెడతా… (అక్కడికి ఆయన ఎవరు పిలుస్తారా, ఎప్పుడు వెళ్లి ఆబగా తిందామా అని ఎదురుచూస్తున్నాడు…) అని చెబుతుంటాడు… ఇద్దరూ అలుముకున్నారు… నిజానికి అక్కడ గరికపాటి చిరంజీవిని ఏమీ అనలేదు… తనను సహఅతిథిగా పిలిచారు… మాట్లాడే సీన్ లేదు, అసలే కోపిష్టి… కాస్త ఆపండయ్యా అన్నాడు… అదేమైనా తిట్టా, అవమానించడమా…? పోనీ, చిరంజీవి సమాజంలో పేరున్న, విద్వత్తున్న ఎవరి మీదనైనా తనవాళ్లు సోషల్ దాడి చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుందాం… ఇదేనా నీకు లభించిన ఇండస్ట్రీ మద్దతు..? తత్వం తెలిసినవాడు కాబట్టి గరికపాటి క్షమాపణ చెప్పాడు… మళ్లీ నాగబాబు ఎందుకు దీన్ని రేపాడు, లేపాడు… పోనీ, ఇదే నాగబాబు ఒక ఫోటో చూడాలి ఓసారి…
ఇదే నీ దేవుడు చిరంజీవి 150 వ సినిమా ఫంక్షన్లో ఇదే మెగాభిమానం బీభత్సం… గరికపాటి సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఈ దాడి… పోనీ, మంత్రి శ్రీనివాస యాదవ్ జోలికో, అక్కడి దాకా ఎందుకు హైదరాబాద్ టీఆర్ఎస్ ముఖ్య లీడర్ల జోలికో వెళ్లి చూడండి… సరే, ఇక ఆ పంచాయితీలోకి లోతుగా వెళ్లడం అనవసరం గానీ, అనంత శ్రీరాంను చూస్తే మాత్రం జాలేసింది… ఎంత అంటే… పాపం ఈ పిల్లాడికి ఇంత చిన్న ఏజ్‌లో చిప్ కొట్టేయడం ఏమిటి అనేంతగా…
తనకు చిరంజీవి ప్రాపకం కావాలి, సో, తన పాదతీర్థ సేవనం ముప్పూటలా చేసుకోనీ… ఎవరూ కాదనరు… నిజమైన విద్వత్తు ఉన్నవాడికి కాస్త పొగరు ఉంటుంది… అనంత శ్రీరామ్ అనేవాడికి జన్మలో రాదు… రామాయణం నుంచి ఏదో పిట్ట కథ చెప్పాడు… ‘అమ్మా, నిన్ను చూశాను అంటే రాములవారు నమ్మడు, చూడామణి, నగలు ఆనవాలుగా ఇచ్చినా సరిపోదు, మీ ఇద్దరికే తెలిసిన ఏదైనా సంఘటన చెప్పు అన్నాడుట హనుమంతుడు సీతతో… (అందరూ ఆదిపురుష్ ఓంరౌత్‌లు అయిపోతున్నారు…)
‘‘కాకి రూపంలో ఓ అసురుడు నన్ను గాయపరుస్తుంటే, నా ఒళ్లో పడుకున్న రాములవారికి మెలకువ రావద్దని ఓర్చుకుంటున్నాను… నా రక్తపుచుక్క మీదపడి రాముడు లేచి, కోపంతో పక్కనే ఓ గరికను తెంపి, బ్రహ్మాస్త్రంగా విసిరాడు… ఇక్కడ గరిక నేనొక బ్రహ్మాస్త్రాన్ని అనుకోవడం తప్పు, దాన్ని అలా మంత్రించినవాడి గొప్పతనం…’’ అని చెబుతూ పోయాడు అనంతుడు… అసలే ఈమధ్య పిచ్చి పిచ్చి పదాలతో ట్యూన్లు నింపుతున్నాడు… ఇంకా తనలో ఈ జ్ఞాన పైత్యం కూడా దాగి ఉందా..?
తన దృష్టిలో రాముడు విసిరిన గరికకు ఏ విలువా లేదు… రాముడు మంత్రిస్తేనే బ్రహ్మాస్త్రం అయ్యింది… అసలు ఏమైనా నప్పిందా ఈ కథ ఈ వివాదానికి..? ‘‘తాటతీస్తాం’’ బ్యాచులో సభ్యత్వం తీసుకున్న అనంతుడూ… గరికపాటిని చిరంజీవి మంత్రిస్తేనే అంత తోపు అయ్యాడనా నీ భావన..? చిరంజీవి గరికపాటికి విద్య నేర్పించాడా..? అవధానం మెళకువలు చెప్పాడా..? ధారణ సామర్థ్యం పెంపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాడా..? అసలు అవధానం అంటే తెలుసా నీకు అనంత శ్రీరామ్..? నీలాంటి వెయ్యి మందికి ఒకేసారి జవాబు చెప్పగల అసాధారణ విద్వత్తే సహస్రావధానం… ఆయన ఎదుట నువ్వెంత ‘గరిక’పాటో అర్థమైంది కదా…
ఎహె, గరికపాటి కోపం, మాటతీరు, పెడసరం, ఆ సందర్భంలో తను వ్యవహరించిన తీరు బాగాలేవు… ఎస్, అక్కడి నుంచి సైలెంటుగా లేచి రావల్సింది… సినిమా వాళ్లు వచ్చే సమావేశాలు ఎలా ఉంటాయో తెలియదా..? ప్రత్యేకించి తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను ఏటేటా పెంచబోయి దత్తన్న ఒకేసారి గరిష్టంగా చెడగొట్టాడు… ఒక్కమాట… కవిసార్వభౌమ శ్రీనాథుడి అహంకారం అంటే నాకు ఏవగింపు… అయితేనేం… ఆయనలోని సాహితీ వైభవాన్ని, సృజనను తిరస్కరించలేను… తాటతీస్తాను నా కొడకా అని తూలనాడలేను… ఈ దేశం నిన్ను పద్మభూషణుడిని చేసింది… గౌరవించింది… దానికి ఓ విలువ ఉంది… ఒక్కసారి దాని ముందు నిలబడి.., ఇలాంటి అనంత శ్రీరామ్ వంటి చిల్లర పెంకుల వీడియోలను, వ్యాఖ్యలను తలుచుకుని ఆనందించడం కాదు, ఆత్మసమీక్ష చేసుకోవాలి…!!
Share this Article