ఫేస్‌బుక్‌లో Siddharthi Subhas Chandrabose వాల్ మీద పోస్టు ఇది… చాలామంది షేర్ చేయడంతో మన న్యూస్‌ఫీడ్‌లో కూడా బాగానే కనిపిస్తోంది… బాగా కనెక్టయింది… అల్టిమేట్… కడుపు నింపుతున్న, చేస్తున్న పనిపట్ల గౌరవం, బతుకుతున్న బతుకు పట్ల గౌరవం, మది నిండా ఆనందం… ఈ క్షణం నాది… ఎంత మంచి ధోరణో కదా… సరే, ఆ పోస్టు యథాతథంగా మీరూ చదవండి ఓసారి…
మీరే కాదు మా ఎమ్మెల్యే కూడా కలుస్తారు నన్ను అన్నాడు. పేరు ఏసు అయినా, అందరూ సోగ్గాడని, శోభన్‌బాబు, నాగేశ్వర్రావు అని పిలుస్తారని చెప్పాడు.
Ads
‘ఇదంతా ఎలా?’ అన్నాను.
‘ఏం ఎందుకు కాదు” అతడు సమాధానం.
“అదికాదు అందరూ చెప్పులు కుట్టడం తక్కువపని అంటారుకదా..”నసిగాను.
“నేను పని చేసుకుని బ్రతకడానికి గర్వపడుతున్నా” అన్నాడు.
కుశలం అడిగాను.
“అందంగా, హాయిగా బ్రతికి చచ్చిపోవాలి కదా, నేను అదే చేస్తునాను అన్నాడు. ఇల్లు కట్టిస్తున్నాను, సమస్యలేవీ లేవన్నాడు.
వెనకాల ఫోటోలు, అటుపక్కన పాటలు వినిపించే స్పీకరు, ఇటు పక్క గాలి విసిరే పంకా, వెనకాల అనుకున్న కుర్చీ, దాన్ని అనుకుని నిటారుగా నిలబడిన వెన్నుముక, మెడ చుట్టూ స్కార్ఫ్, ఇస్త్రీ దుస్తులు, చేతికి వాచీ, వేళ్లకి ఉంగరాలు, దర్జాగా కూలింగ్ కళ్లద్దాలు, పౌడరద్దిన మొహం.. అన్నింటికీ మించి మాట్లాడుతూన్నంతసేపూ నవ్వుమొహం…
మనమూ వున్నాం. ఆముదం మొహాలతో, వడలిపోయిన శరీరాలతో, బిక్కచచ్చిన ధైర్యంతో ఏడుస్తూ, చుట్టుపక్కలను ఏడిపిస్తూ,. బ్రతుకు తెలియక, బ్రతకలేక నిరంతరం చస్తూ.. సెలవు తీసుకుంటూ చెప్పాను, “ఎప్పటికీ ఇలాగే వుండాలి, తగ్గొద్దు”. తనన్నాడు “తగ్గేదేల్యా”….
Share this Article