ఫాఫం నాగార్జున… నిజంగానే తన మొహం చూస్తే జాలేసింది… అసలు ఆ అవార్డుకు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు తన పరువు తనే తీసుకున్నాడు..? విషయంలో వెళ్దామా..? ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్‌మా పరివార్ అవార్డులు అనే షో నిర్వహించారు… అంటే పెద్ద మిస్టరీ ఏమీ లేదు… ఇప్పటిదాకా జనాన్ని చావదొబ్బిన సీరియళ్లలో ఎవరు ప్రతిభావంతులో తేల్చి, అవార్డులు ఇచ్చి, ఇంకా రెచ్చిపొండి అని ప్రోత్సహించడం అన్నమాట… అది ప్రేక్షక వ్యతిరేకం…
కాకెపోతే జీతెలుగు వాడు ఇలాంటి కార్యక్రమాల్ని అప్పుడప్పుడూ చేస్తుంటాడు… మాటీవీలో తక్కువే… జీవాడిని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఈ పరివార్ అవార్డులు అని మొదలెట్టాడు… అత్యంత వెటరన్ యాంకరిణి సుమ అదే మోనాటనస్ లుక్కుతో, వాక్కుతో చావగొట్టింది… (నిజానికి మాటీవీలో గతంలో నాగార్జునకు కూడా భాగస్వామ్యం ఉండేది… పిలిచి ఓ పిచ్చి అవార్డు ఇస్తున్నప్పుడు అది కూడా గుర్తుకురానట్టుంది వాళ్లకు…) సరే, ఏవేవో అవార్డులు ఇచ్చారు, వాళ్లు కూడా తమ ప్రసంగాల్లో జీవించేశారు, గుడ్… చివరలో నాగార్జునను పిలిచారు… ఎందుకయ్యా అంటే..?
గుడ్ ఎంటర్‌టెయినర్ అవార్డు అట… సరే, ఇస్తే ఇచ్చారు… ఎన్ని సినిమాలు ఫెయిలవుతున్నా సరే, తీస్తూనే ఉంటాడు, జనం మీదకు వదులుతూనే ఉంటాడు… కానీ దానికి కాదు వాళ్లు అవార్డు ఇచ్చింది బిగ్‌బాస్ హోస్టింగ్ చేస్తున్నందుకట… అదీ సరే, ఇస్తే ఇచ్చారు… కానీ ప్రస్తుత సీజన్ కోసం కాదు, గత సీజన్ గురించి అట… దానికి ఓ ఏవీ కూడా చూపించారు… మరి సీజన్-5 కు సంబంధించి ఇప్పుడు అవార్డు ఏమిటీ అంటారా..? అవును, నాగార్జునకు లేని అభ్యంతరం మీకేల..?
Ads
కానీ నవ్వొచ్చేదేమిటీ అంటే… సీజన్-5 తరువాత ఈ సీజన్-6 రేటింగ్స్ పరమ దరిద్రంగా ఉంటున్నయ్… వీకెండ్ షోలలో నాగార్జునను కూడా ప్రేక్షకులు దేకడం లేదు… గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ రేటింగ్స్ 15, 20 శాతం మాత్రమే… ఇలాంటి విషాదసమయంలో నువ్వు మస్తు ఎంటర్‌టెయినర్‌వు బాసూ అని అదే కార్యక్రమానికి అవార్డు ఇవ్వడం అంటే ఒకరకంగా నాగార్జునను కించపరిచినట్టు… మరి తనెందుకు స్వీకరించినట్టు..?!
సరే, ఆ బాగోతం పక్కన పెడితే… ఈసారి వీకెండ్ షోలో బిగ్‌బాస్ మరీ ఓ కొత్త దరిద్రాన్ని మన మెదళ్ల మీద రుద్దుతున్నట్టు అర్థమవుతున్నది… కొందరు ఆడియెన్స్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు… పెయిడ్ మొహాలే… ఆ బాగోతాన్ని కూడా సోషల్ మీడియా బయటపెట్టింది… నాగార్జునతో ప్రశ్న వేయిస్తారు, వాళ్లతో ఓ స్క్రిప్టెడ్ జవాబు చెప్పిస్తారు… ఎందుకయ్యా అంటే… వీళ్ల వోటింగు దందాల్ని, వీళ్ల నిర్ణయాల్లోని పారదర్శకతను జనం నమ్మడం లేదు కాబట్టి… ఈ కొత్త ఆలోచన…
ఓ పది మందిని కూర్చోబెట్టి వాళ్లు ఏది చెబితే అదే ధర్మాసనం తీర్పు అనుకునే పక్షంలో… ఇక వోటింగు లైన్స్ దేనికి..? సుదీప బయటికి పంపబడటం మంచిదే కదా అంటారా..? అసలు సుదీప కాదు, వెంటనే ఆ కంటెస్టెంట్లందరినీ బయటికి పంపించేసి, హౌజుకు తాళాలు వేయడం బెటరనే నా అభిప్రాయంలో మార్పేమీ లేదు… కాకపోతే అందరూ కలిసి ఫాఫం నాగార్జునను పిచ్చోడిని చేస్తున్నారు… అదొక్కటీ కాస్త చివుక్కుమని అనిపిస్తోంది… అంతే… !!
Share this Article