బిగ్బాస్ నాలుగో సీజన్…. రేటింగ్స్ మాయలో గండరగండడు అనిపించుకున్న ది గ్రేట్ మాటీవీ సైతం చేతులెత్తేసింది… తుస్… తుస్సున్నర… అరె, అన్ని వెబ్సైట్లు ఆహా ఓహో… మస్తు రేటింగ్స్, 19.5 రేటింగ్స్ వచ్చాయి, దుమ్మురేపింది, నాగార్జునా సాహో, నీకు తిరుగులేదు, మాటీవీ రేటింగ్స్ మాయామర్మానికి రందిలేదు అని చెబుతున్నవేళ ‘ముచ్చట’ ఏమిటి, తుస్సుమని చెప్పడం ఏమిటి అంటారా..? ఆధారాలతో చెబుతాం… బిగ్బాస్ నాలుగో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఎలా అంటే..?
చూశారు కదా… ఇదీ బార్క్ తాజా రేటింగ్స్ చార్ట్… ‘ముచ్చట’ క్రెడిబులిటీ ఇది… బిగ్బాస్ నాలుగో సీజన్ ది గ్రాండ్ ఫినాలే సాధించిన రేటింగ్స్ జస్ట్ 13.49 మాత్రమే… 19.5, 20, 21 పిచ్చి జనానికి చెప్పుకొండి… మొత్తం తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే అది పెద్ద ఫ్లాప్ ఇది… నాగార్జున అయిదో సీజన్ హోస్టింగు చేయకపోవడం బెస్ట్ అని చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు ఇప్పుడు,.,. ఎందుకంటే..?
Ads
బిగ్బాస్ మొదటి సీజన్… ఎన్టీయార్ హోస్ట్… లాంచింగ్ 16.8 రేటింగ్స్… ఫినాలే 14.23 రేటింగ్స్… చీఫ్ గెస్టూ లేడు, హైపూ లేదు, హంగామా లేదు…
బిగ్బాస్ రెండో సీజన్… నాని హోస్ట్… లాంచింగ్ 15 రేటింగ్స్… ఫినాలే 15.05 రేటింగ్స్… వెంకటేష్ వచ్చినట్టున్నాడు గెస్టుగా… పర్లేదు, డౌన్ కాలేదు…
బిగ్బాస్ మూడో సీజన్… ఇదే నాగార్జున హోస్ట్… లాంచింగ్ 17.92 రేటింగ్స్… దుమ్ము రేగిపోయింది.,. అసలే మాటీవీ… మీటర్లు గిర్రున తిప్పి ఉంటుంది… ఫినాలే 18.29 రేటింగ్స్… ఇదే చిరంజీవి గెస్టు… హబ్బ… అదిరిపోయింది అనుకున్నారు అందరూ… మాటీవీ తన మీటర్ల మాయను బాగా ప్రయోగించింది…
బిగ్బాస్ నాలుగో సీజన్… అసలే చస్తూబతుకుతూ నడిచింది… హోస్ట్ నాగార్జునే, లాంచింగ్ 18.5 రేటింగ్స్… మాటీవీ టీం పండుగ చేసుకుంది… కానీ షో నడుస్తునన్ని రోజులూ నానా కారణాల చేత ఫ్లాప్ అయిపోయింది… అవన్నీ కొట్టేసి, కొత్త చరిత్ర రాయడానికి ఫినాలే గ్రాండుగా ప్లాన్ చేసింది… అదే చిరంజీవి గెస్టు… షో నడిచినన్ని రోజులూ టీం వైఫల్యం కొట్టుకుపోయి ఫినాలే దుమ్మురేపాలి అనుకున్నారు… కానీ..?
లాంచింగే అంత గ్రాండ్గా ఉంటే, ఇక ఫినాలే ఎలా ఉండాలి…. దాదాపు అయిదు గంటల ప్రోగ్రాం… ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు… మస్త్ హంగామా… డాన్సులు, పాటలు, అతిథులు, వాట్ నాట్..? ఒక దశలో ఈ షో ఆల్ టైం రికార్డ్ 23 దాకా trp కొడుతుందని టీవీ ఇండస్ట్రీ అంచనా వేసింది… కానీ జనానికి నిజంగా అంత ఆసక్తి లేకుండా పోయింది అని చెప్పడానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే..?
మాటీవీ ఎన్ని మాయోపాయాలు చేసినా సరే… అది సాధించిన రేటింగ్స్ జస్ట్, 13.49 మాత్రమే… మరీ దరిద్రం ఏమిటయ్యా అంటే… అసలు జనం ఈమధ్య ఛీకొడుతున్న కార్తీకదీపం సాధించిన రేటింగ్స్ కూడా సాధించలేకపోయింది… ఏదో ఊడబొడుస్తుందీ అనుకుని స్పాన్సర్ చేసిన కంపెనీలు తెల్లమొహం వేశాయి… మాటీవీని బూతులు తిడుతున్నాయి ఇప్పుడు… ఇది చాలా..? ఇంకా వివరాలు కావాలా..? మాటీవీ టీం అట్టర్ ఫ్లాప్… ఇక మాట్లాడకండి…
ఇదీ మా టీవీ చెప్పుకున్న రేటింగ్… నిజానిజాలు barc చెప్పాలి… హహహ…
Share this Article