పార్ధసారధి పోట్లూరి…… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి FCRA అనుమతిని రద్దు చేసిన కేంద్ర హోమ్ శాఖ ! భారత హోమ్ మంత్రిత్వ శాఖ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి విదేశాల నుండి తీసుకునే విరాళాల మీద నిషేధం విధించింది ! రాజీవ్ ఫౌండేషన్ మరియు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ రెండూ కూడా NGO లు. ఈ రెండు సంస్థలు విదేశాల నుండి విరాళాలు సేకరించడం కోసం FCRA [Foreign Contribution (Regulation) Act] ఇచ్చిన లైసెన్స్ ని రద్దు చేసింది హోమ్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23,2022 న !
ఏదన్నా NGO లు విదేశాల నుండి విరాళాలు స్వీకరించాలి అంటే FCRA కింద లైసెన్స్ తీసుకోవాలి. మరి నిషేధం ఎందుకు ? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మరియు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ని సోనియా, రాహుల్, ప్రియాంకలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా! చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుండి విరాళాలు సేకరిస్తున్నట్లు ఈ రెండు NGO ల మీద ఆరోపణలు వచ్చాయి ! అయితే వీటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి గాను 2020 లో ఆర్ధిక,హోమ్ శాఖల అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేసిన సిఫారసులకి మీద నిన్న అంటే 23-10-2022 న రెండు సంస్థల లైసెన్స్ ని రద్దు చేశారు!
సోనియా ఈ రెండు ట్రస్ట్ లకి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నది ! జూన్ నెల 2020 లో అప్పట్లో గాల్వాన్ లోయలో భారత చైనా సైనికుల జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 14 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే ! ఆ మరుసటి రోజు భారత సైనికులు చేసిన ప్రతి దాడిలో 140 మంది చైనా సైనికులు మరణించారు ! అయితే ఈ ఘటన మీద అప్పట్లో రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రధాని మోడీ భారత భూభాగాన్ని చైనాకి అప్పచెప్పాడు అంటూ ! అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయిందీ అనే దానిమీద మాత్రం నోరు విప్పలేదు !
Ads
2005-2006 ఆర్ధిక సంవత్సరానికి గాను చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుండి భారీగా విరాళాలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మరియు ఛారిటబుల్ ట్రస్ట్ ఖాతాలలో జమ అయ్యాయి ! రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మరియు ఛారిటబుల్ ట్రస్ట్ లకి ప్రధాన దాత బిల్ & మెలిన్డా గేట్ ఫౌండేషన్! సోనియా చైర్ పర్సన్ గా ఉన్న రెండు NGOలకి భారీగా విరాళాలు ఇచ్చింది బిల్ & మెలిన్డా గేట్ ఫౌండేషన్ అన్నది గమనార్హం ! తాజాగా 2020 – 21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ లో తాము ఎలాంటి విరాళాలు స్వీకరించలేదు అని డిక్లరేషన్ ఇచ్చాయి రెండు ట్రస్ట్ లు కలిసి…
కానీ బాంక్ ఖాతాలని పరిశీలిస్తే వరుసగా రెండు ట్రస్ట్ లలో ఒక దానిలో 11 కోట్ల 50 లక్షలు మరియు ఇంకో దానిలో 13 కోట్ల 50 లక్షలు ఉన్నట్లు కనుకొన్నారు అధికారులు. ఈ రెండు తప్పు రిటర్న్స్ కాక ఇంకా చాలా వాటిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. దాంతో హోమ్ మంత్రిత్వ శాఖ విదేశీ విరాళాలు స్వీకరించడానికి వీలు లేకుండా లైసెన్స్ ని రద్దు చేసింది !
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని 1991 లో స్థాపించారు. చైర్ పర్సన్ గా సోనియా , బోర్డ్ ఆఫ్ ట్రస్టీ లుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియ, సుమన్ దూబే, చిదంబరం, రాహుల్, ప్రియాంక వాద్రా లు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ని 2002 లో స్థాపించారు దీనికి కూడా సోనియా చైర్ పర్సన్. ఈ రెండు ట్రస్టు లు కూడా న్యూఢిల్లీ లోని అత్యంత ఖరీదయిన ప్రాంతం రాజేంద్ర ప్రసాద్ రోడ్ లోని జవహర్ భవన్ కేంద్రముగా పనిచేస్తున్నాయి……….
Share this Article