ఎన్నడూ లేనిది ఓ బ్రిటన్ ప్రధాని గురించి ఇంతగా చర్చించుకుంటున్నాం దేనికి..? మనవాడు కాబట్టి… ఇక్కడ మనవాడు అంటే ఏమిటి నిర్వచనం..? ఇండియాలో పెద్ద ఎత్తున తన గురించి చర్చ జరుగుతోంది… ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, మనవాడు అని ఓన్ చేసుకుంటున్నాం, కానీ నిజానికి తన రూట్స్ ఇండియావేనా..? కావు..! పాకిస్థాన్‌వి..!!
నిజమే… గుజ్రన్‌వాలా అని ఓ ఊరు… ఇండియా- పాకిస్థాన్ విభజన వేళ పాకిస్థాన్‌లో ఉంచారు… మరి అక్కడ చడీచప్పుడు లేదేం..? ఉండదు.,. ఎందుకంటే..? రిషి జన్మతః హిందువు కాబట్టి… ఇప్పటికీ ప్రాక్టీసింగ్ హిందూ కాబట్టి… ఆయన అత్తామామలు ఇండియాకు చెందిన నారాయణమూర్తి, సుధామూర్తి కాబట్టి… వాళ్ల కుటుంబాలు ఇప్పటికీ హిందూ సంప్రదాయాల్ని పాటిస్తాయి కాబట్టి… ఇండియా ఓన్ చేసుకోవడానికీ అవే కారణాలు… (అయితే రిషి పూర్వీకులు వలస వెళ్లేనాటికి ఇండియా- పాకిస్థాన్ విడిపోలేదు… కాబట్టి పాకిస్థానీ రూట్స్ అనీ, ఇండియన్ రూట్స్ అనీ ప్రత్యేకంగా చెప్పలేం… కుదరదు…)
Ads
గుజ్రన్‌వాలాలో ఓ ఖత్రీ కుటుంబం వాళ్లది… రిషి పూర్వీకుల గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం కెన్యా, టాంజానియా, బ్రిటన్ అని చెప్పుకుంటున్నాం కదా… విశ్వకుటుంబం అది… నాట్ ఇండియన్, నాట్ పాకిస్థానీ… రాందాస్ శునాక్… ఈయన రిషి తాత… తండ్రి వైపు తాత… 1935లోనే నైరోబీ వలసవెళ్లాడు… ఆయన భార్య సుహాగ్ రాణి మొదట ఢిల్లీ వెళ్లి, అత్తగారిని తీసుకుని నైరోబీకి చేరుకుంది… ఆమెకు ఆరుగురు పిల్లలు… అందులో ఒకడు యశ్వీర్ శునాక్…
ఇది తండ్రి వైపు నుంచి… మరి తల్లి వైపు నుంచి… వాళ్లు అంతకుముందే తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు… టాంజాన్యికాలో ఉండేవాళ్లు… అదిప్పుడు టాంజానియాలో కలిసిపోయింది… అక్కడికి పంజాబ్ నుంచి వచ్చి రైల్వే ఇంజినీర్‌గా పనిచేసే రఘువీర్ శునాక్తో రిషి మామ్మ స్రక్షకు పదహారో ఏట పెళ్లయింది… ఆమె పిల్లల్లో ఒకరు రిషి అమ్మ ఉష…
యశ్వీర్ నేషనల్ హెల్త్ సిస్టంలో ఓ జాబ్ సంపాదించాడు… ఉష ఓ చిన్న మెడికల్ షాపు నడిపించేది… రిషి కూడా యంగ్ ఏజ్‌లోనే రాజకీయాల్లోకి వచ్చాడు… ఎంపీగా గెలుస్తున్నాడు వరుసగా… స్టాన్‌ఫర్డ్‌లో చదువుతున్నప్పుడు నారాయణమూర్తి బిడ్డ అక్షతతో ప్రేమాయణం… నాలుగేళ్లు డేటింగ్… మొదట్లో నారాయణమూర్తి రిషిని అల్లుడిగా రిజెక్ట్ చేశాడు… తరువాత కాసేపు భేటీకి అంగీకరించాడు… తరువాత పెళ్లికే అంగీకరించాడు… రిషి, అక్షతలకు ఇద్దరు పిల్లలు… అనౌష్క, కృష్ణ…
ఓవరాల్‌గా ఇదీ రిషి శునాక్ ఫ్యామిలీ ముఖచిత్రం… కేవలం 42 ఏళ్లకే ప్రధాని అవుతున్న రిషి జీవితం నిజానికి ఎప్పుడూ వడ్డించిన విస్తరిలాగే ‘శుక్ర మహర్దశ’ అనుభవిస్తోంది… అంతకు ముందే ఆస్తిపరుడు… అక్షతను చేసుకున్నాక రిచ్చెస్ట్ కేటగిరీలో చేరిపోయాడు… అమెరికా అంటే తనకు ఇష్టం… అక్కడ ఓ ఇల్లు కూడా కొనుక్కున్నాడు… బ్రిటన్‌లో చెప్పనక్కర్లేదు… మంచి లావిష్ లైఫ్ స్టయిల్… ఇంకేం కావాలి..? వద్దూవద్దన్న సొంత పార్టీ సభ్యులే, వేరే దిక్కులేక, నువ్వే దిక్కుర భయ్ అని చెప్పి, కుర్చీ మీద కూర్చోబెడుతున్నారు… ‘‘అందుకే అనేది… రాసి పెట్టి ఉండాలండీ…’’
Share this Article