పార్ధసారధి పోట్లూరి ……. మూడవ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అంటే 80 ఏళ్ల తరువాత మొదటి సారిగా అమెరికాకి చెందిన 101వ ఎయిర్ బోర్న్ డివిజన్ [Screaming Eagles]కి చెందిన లైట్ ఇన్ఫాంట్రీ ఫోర్స్ [light infantry force] యూరోపు దేశం అయిన రొమేనియాలో దిగింది ! ఆర్డర్ ఇచ్చిన గంటలోపే అంతా సిద్ధం చేసుకొని రంగంలోకి దిగిపోతుంది ఈ ఫోర్స్!
ఈ డివిజన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నార్మన్డీ [Normandy] దగ్గర జరిగిన భీకర పోరులో జర్మన్ సైన్యాన్ని చిత్తు చేసి జర్మనీలోకి చొచ్చుకుపోవడానికి కారణం అయ్యింది ! నార్మన్డీ ఘటన తరువాత జర్మనీ క్రమ క్రమంగా బలహీనపడి చివరకి లొంగిపోయింది. ఇదే డివిజన్ మళ్ళీ వియత్నాం యుద్ధంలో కూడా పాల్గొంది కానీ విఫలం అయ్యింది… వియత్నాం సైనికుల, ప్రజల గెరిల్లా యుద్ధ తంత్రంని అర్ధం చేసుకోవడంలో విఫలం కావడం అది…
ఇప్పుడు ఈ స్క్రీమింగ్ ఈగిల్స్ లక్ష్యం ఉక్రెయిన్ లో పోరాడుతున్నసైనికులతో కలిసి రష్యన్ దళాలతో బాహా బాహీ తేల్చుకోవడానికే ! అమెరికాకి చెందిన 101th ఎయిర్ బోర్న్ డివిజన్ దాడి [Strike] చేయడానికి ఉపయోగిస్తుంది ! రెండు రకాలుగా ఉపయోగిస్తారు ఎయిర్ బోర్న్ ని. 1. తమ సైన్యానికి మద్దతుగా ఆకాశంలో నుండి విమానాల ద్వారా ప్యారాచూట్స్ సహాయంతో కిందకి లాండ్ అయి వేగంగా కదులుతూ శత్రువుని దెబ్బ తీస్తారు ! 2. అప్పటికే శత్రు దేశ భూ భాగంలోకి చొరపడి పోరాడుతున్న తమ సైనికులకి మద్దతుగా నేరుగా శత్రు భూ భాగంలోనే ఆకాశం ద్వారా లాండ్ అయి రహస్యంగా కదులుతూ ముందుకు వెళతారు. ఎక్కడ లాండ్ అయి ఎలా ఎక్కడికి వెళ్లాలో ముందుగానే మ్యాపుల ద్వారా తెలియచేస్తారు. ఇప్పుడు GPS అందుబాటులోకి వచ్చింది కాబట్టి సులభంగా యుద్ధం చేయగలుతారు.
Ads
అమెరికా నేరుగా ఎందుకు జోక్యం చేసుకుంటున్నది ?
సెప్టెంబర్ 29,2022న బ్రిటన్ కి చెందిన నిఘా విమానం [reconnaissance] నల్ల సముద్రం [black sea ] మీద అంతర్జాతీయ జలాల మీద పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తుండగా హఠాత్తుగా రష్యాకి చెందిన Su-24 ఫైటర్ జెట్ ఒకటి బ్రిటన్ నిఘా విమానంలోని రాడార్ మీద ప్రత్యక్షo అయింది ! బ్రిటన్ పైలట్ లు రష్యన్ Su -24 విమాన పైలట్ తో మాట్లాడడానికి ప్రయత్నించే లోపే రష్యన్ పైలట్ ఎయిర్ to ఎయిర్ మిసైల్ ని ప్రయోగించాడు బ్రిటన్ నిఘా విమానం మీద !
దాంతో ఖంగు తిన్న బ్రిటన్ పైలట్లు గ్రౌండ్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చారు ఎమర్జెన్సీ లాండింగ్ కోసం… అదే సమయంలో బ్రిటన్ నిఘా విమానం యొక్క GPS కో ఆర్డినేషన్ ని నమోదు చేయమని కంట్రోల్ టవర్ ని కోరారు. రష్యన్ పైలట్ ప్రయోగించిన ఎయిర్ to air మిసైల్ నుండి తప్పించుకున్న బ్రిటన్ నిఘా విమానం దగ్గరలో ఉన్న రన్ వే మీద లాండ్ అయ్యింది!
అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏదన్నా విదేశీ విమానం తమ దేశ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించినప్పుడు ఆయా దేశానికి చెందిన జెట్ ఫైటర్ కావొచ్చు లేదా పెట్రోలింగ్ చేస్తున్న విమానం కావొచ్చు ముందు అవతలి విమాన పైలట్ కి హెచ్చరిక జారీ చేయాలి మా ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించావు కాబట్టి వెనక్కి వెళ్లిపొమ్మని ! ఇలా మూడు సార్లు హెచ్చరికలు చేసినా అవతలి విమాన పైలట్ అలాగే ముందు వెళ్తుంటే అప్పుడు మిసైల్ ని ప్రయోగించవచ్చు ! ఇది ప్రోటోకాల్ ! తప్పక పాటించాలి ! అదే ఏ దేశానికి చెందని ఎయిర్ స్పేస్ లో ఉన్న విమానం మీద ఎలాంటి హెచ్చరిక లేకుండా మిసైల్ ని ప్రయోగిస్తే అది యుద్ధం చేస్తున్నట్లుగా భావిస్తుంది ఏ దేశం అయినా ! బ్రిటన్ నాటో కూటమి దేశం కాబట్టి అమెరికా ఇప్పుడు రొమేనియాలో తన 101 వ ఎయిర్ బోర్న్ డివిజన్ ని మోహరించింది. ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు వెంటనే ఎయిర్ డ్రాప్ ద్వారా ఉక్రెయిన్ లో దించవచ్చు.
బ్రిటన్ రష్యాల మధ్య చర్చలు :
సెప్టెంబర్ 29 న రష్యన్ పైలట్ చేసిన మిసైల్ ప్రయోగం మీద బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ [Ben Wallace] రష్యాకి చెందిన రక్షణ మంత్రితో ఫోన్ లో మాట్లాడాడు. అయితే రష్యన్ రక్షణ మంత్రి మా పైలట్ పొరపాటు పడ్డాడు, దానికి నేను చింతిస్తున్నాను మీరు యధా ప్రకారంగా మీ పెట్రోలింగ్ విధులని చేసుకోవచ్చు అని హామీ ఇచ్చాడు !
అవకాశం కోసం వేచి చూస్తున్న నాటో కూటమి దేశాలు రష్యన్ పైలట్ చేసిన తప్పుని బాగానే వాడుకోదలుచుకున్నాయి! దాని పర్యవసానమే రొమేనియాలో అమెరికన్ ఎయిర్ బోర్న్ డివిజన్ మోహరింపు !
అమెరికా – రష్యా ల మధ్య చర్చలు :
గత వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు రష్యన్ – అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్స్ మధ్య టెలీఫోన్ లో చర్చలు జరిగాయి.
అమెరికన్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ [Lloyd Austin]: మీరు ఉక్రెయిన్ లోని నోవా కఖోక్వ డామ్ [Nova Kakhokva dam] ని కూల్చివేసి ఉక్రెయిన్ ని వరదలతో ముంచెత్తాలనే ప్లాన్ లో ఉన్నారని జెలెన్స్కీ చెపుతున్నారు.
రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు [Sergei Shoigu]: అలాంటి ప్లాన్ మావద్ద ఏమీ లేదు. ఉక్రెయిన్ సైన్యం ప్రయోగిస్తున్న రాకెట్ల వల్ల నోవా కఖోక్వ డామ్ కూలిపోతే అది మా బాధ్యత కాదు.
గత నెల రోజులుగా నోవా కఖోక్వ డామ్ ని కూల్చి వేసి రష్యా ఉక్రెయిన్ ని వరదలతో ముంచెత్తడానికి ప్లాన్ చేస్తున్నది అంటూ వోలోది మిర్ జెలెన్స్కీ తరుచూ ఆరోపణలు చేస్తున్నాడు రష్యా మీద ! బహుశా ఇది జరగవచ్చు ఎందుకంటే ముందు జెలెన్స్కీ చేత ఆరోపణలు చేయించి కొన్నాళ్ళు ఆగి వాళ్ళ చేత నోవా కఖోక్వ డామ్ ని కూల్చివేయించి, ఆ నెపం రష్యా మీదకి నెట్టి, నాటో దేశాలు ఉక్రెయిన్ లో అడుగుపెట్టి రష్యన్లతో యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
రష్యా మెయిన్ లాండ్ క్రిమియాతో కలిపే బ్రిడ్జ్ కూల్చివేత తరువాత రష్యా మిసైళ్ళతో విరుచుకుపడి ఉక్రెయిన్ లోని విద్యుత్ ప్రాజెక్టుల మీద చేసిన దాడి ఫలితంగా ఉక్రెయిన్ పూర్తిగా రెండు రోజులు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ పూర్తిగా విద్యుత్ సరఫరా పునరిద్ధరించబడలేదు!
ఇప్పటికే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలని రష్యాలో కలుపుకుంటున్నట్లు డిక్రీ జారీ చేశాడు పుతిన్ ! కానీ ఉక్రెయిన్ దళాలు రష్యా ఆక్రమించుకున్న ఖరోశాన్ దగ్గర తీవ్ర పోరాటం చేస్తున్నది రష్యన్ సైన్యంతో!
ప్రస్తుతం అమెరికన్ ఎయిర్ బోర్న్ డివిజన్ రొమేనియాలో దిగడానికి కారణం ఉక్రెయిన్ తో సరిహద్దు కలిగి ఉంది రొమేనియా ! ఏ క్షణంలో అయినా ఉక్రెయిన్ లో దించడానికి వీలుగా దాదాపుగా 2400 మంది సైనికులని నాటో దేశాలు అయిన రొమేనియా, హంగరీ, స్లోవేకియాలతో పాటు బల్గేరియా దేశాలలో మోహరించింది. ప్రస్తుతం అమెరికన్ ఎయిర్ బోర్న్ లైట్ ఇన్ఫాంట్రీ డివిజన్ కి చెందిన స్ట్రైక్ ఈగిల్ ఫోర్స్ అదనపు దళాలు 4,700 మంది ! ఇప్పటికే రొమేనియా లో దిగిన ఎయిర్ బోర్న్ డివిజన్ పారాట్రూపర్లు యుద్ధ సన్నద్ధానికి సూచనగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
కొన్ని ముఖ్య సంఘటనలు :
1. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే మాజీ సోవియట్ రిపబ్లిక్ అయిన బెలారస్ దేశ సరిహద్దులలో తన సైన్యాన్ని మోహరించాడు. హెవీ ఎక్విప్మెంట్ తో మరో డివిజన్ కూడా సిద్ధంగా ఉంది ఉక్రెయిన్ లోని ప్రవేశించడానికి !
2. పుతిన్ తన MIG-31 లకి సూపర్ సానిక్ మిసైల్స్ ని తగిలించి దాడి కోసం సిద్ధంగా ఉంచాడు!
3. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ని ఒప్పించి బెలారస్ సైన్యాన్ని కూడా రష్యన్ సైనికులతో కలిసి ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దుల నుండి దాడి చేయడానికి ఒప్పించాడు కానీ ఉక్రెయిన్ మీద యుద్ధంలో తమ దేశం పాల్గొనడాన్ని బెలారస్ ప్రజలు ఇష్టపడడం లేదు.
4. అమెరికన్ ఎయిర్ బోర్న్ డివిజన్ బ్రిగేడియర్ జెనెరల్ జాన్ లుబాస్ [John Lubas] మరియు కల్నల్ ఎడ్విన్ మత్తాయ్డెస్స్ [Edwin Matthaidess] లు ఇద్దరూ బ్లాక్ హాక్ హెలికాప్టర్ లో గంట పాటు రొమేనియా, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు నిన్న. ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం స్టడీ చేశారు. ఒక వేళ దాడి చేయాల్సి వస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అని! ఇది యుద్ధ సన్నాహక చర్యగానే భావిస్తున్నారు నిపుణులు.
5. ఉక్రెయిన్ కి సముద్రతీర పోర్ట్ లు ఉన్న ఓదేస్సా తో పాటు ఖేరోశాన్ లని తన అధీనంలోకి తీసుకొని ఉక్రెయిన్ కి ఎలాంటి సముద్ర తీరప్రాంతం లేకుండా చేసి అప్పుడు నల్ల సముద్రంలో తన నౌకా దళాలని మోహరించాలనే ప్లాన్ లో ఉన్నాడు.
6. అయితే మొదటిసారిగా రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 తో అమెరికన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 ని తన ఎయిర్ బోర్న్ డివిజన్ కి చెందిన స్ట్రైక్ ఈగిల్స్ కి సహాయంగా ఉక్రెయిన్ లోకి పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. F-35 తో పాటు యూరో ఫైటర్ ని కూడా నాటో ఉక్రెయిన్ లో దించడానికి ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు తెలుస్తున్నది.
7. ఏది ఎలా ఉన్నా S-400 కనుక F-35 జెట్ ని కూలిస్తే ఈ జరగపోయే ఫైనల్ వార్ లో రష్యా విజయం సాధించినట్లే ! లేదూ, రష్యా చిత్తుగా ఓడిపోతుంది !
మొదటి సారిగా నాటో కూటమి దేశాలని రష్యా ఒంటరిగా ఎదుర్కోబోతున్నది ! అదీ ఈ మధ్యనే జర్మనీ తన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఉక్రెయిన్ లో బహిరంగంగానే మోహరించింది అది విజయవంతంగా రష్యా ఫైటర్ జెట్ లని భయపెడుతున్నది. ‘’గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ ‘’….
Share this Article