వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ దరిదాపుల్లోకి కూడా ఎవరూ చేరలేరు… ఇది నిజం… తను స్కెచ్ వేస్తే ఎదుటోడు గిలగిలా కొట్టుకోవాల్సిందే… నన్ను మించి స్కెచ్చర్, ప్లానర్ లేరనే భ్రమల్లో ఉండే అంతటి చంద్రబాబే అర్జెంటుగా తెలంగాణ ఖాళీ చేసి, ఆంధ్రాకు పరిమితం కావల్సి వచ్చింది కేసీయార్ కొట్టిన ‘వోటుకునోటు’ దెబ్బతో… అలాంటిది కేసీయార్ గ్రహచారం తిరుగుముఖం పట్టినట్టుంది… ఏదో భారీ తేడా కొడుతోంది… నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో వైఫల్యం తాజా ఉదాహరణగా అనిపిస్తున్నది…
పొలిటికల్‌గా తను అనుసరించిన విధానాలు, ఇతర పార్టీలను తొక్కిపారేసిన తీరు ఎలా ఉన్నా సరే… తెలంగాణను మళ్లీ ఎవరూ ‘చింపిన విస్తరి’ చేయకుండా, ఓ స్థిరత్వాన్ని అందించాడు… కానీ ఆ క్రమంలో ఆశలు పెరిగాయి, దారితప్పినట్టున్నాడు… గత ఎన్నికల సమయంలోనే కేసీయార్ నిర్వహించిన యాంటీ-బీజేపీ పాత్ర, నిధుల పంపిణీ మీద బీజేపీకి అసంతృప్తి ఉంది… ప్రధానంగా దానివల్లే బీజేపీ తెలంగాణ మీద కాన్సంట్రేట్ చేసింది…
దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ… ఏ ఎన్నిక తీసుకున్నా సరే, కేసీయార్ వ్యూహరచనలు గతంలోలాగా లేవనీ, జనం తనను నమ్మడం లేదనీ, పైగా వ్యతిరేకత పెరుగుతోందనీ చెప్పడానికి సంకేతాలు… దీంతో తన ప్లానింగ్ మరింత దెబ్బతింటోంది… మునుగోడు ఉపఎన్నిక తను ఎక్స్పెక్ట్ చేయలేదు… బీజేపీ కావాలనే తెచ్చిపెట్టింది… ఇలాంటివి ఇంకా వస్తయ్… విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తే, ఖజానా నుంచే పథకాల పేరిట పైసలు పంపిణీ చేస్తే వోట్లు వాటంతటవే వచ్చిపడతాయనే భ్రమ ఇంకా కేసీయార్‌ను వదిలినట్టు లేదు… హుజూరాబాద్ ఫలితం చూశాకైనా సరే…
Ads
మరోవైపు తన బీఆర్ఎస్ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది… జాతీయ రాజకీయాల్లో ఎక్కడా వీసమెత్తు ‘ముందుబాట’ కనిపించడం లేదు… ఇంకోవైపు మునుగోడు తరుముకొస్తోంది… మరోవైపు బీజేపీ నుంచి ప్రెజర్ పెరుగుతోంది… ఈ స్థితిలో బీజేపీనే ఫిక్స్ చేసి, ఢిల్లీ నుంచి బజారుకు లాగి, హైదరాబాద్ వీథుల్లో బట్టలిప్పాలని ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు… కొద్దిరోజులుగా అనుకున్నట్టుగానే కథ నడిచినట్టుంది… కానీ చివరలో ఏదో తేడా కొట్టింది… ఉల్టాపల్టా అయ్యింది…
ఆ నలుగురికీ వందేసి కోట్లు, కేంద్ర సంస్థల్లో మంచి పోస్టులు అని బీజేపీ ఆఫర్ ఇచ్చిందట… అసలు నలుగురిని కొంటే బీజేపీకి ఇప్పుడు ఫాయిదా ఏముందనే కామన్ సెన్స్ ప్రశ్నకు జవాబు లేదు… నలుగురితో సర్కారు కూలుతుందా..? పైగా ఆ నలుగురూ అంత తోపులా…? అందులో ముగ్గురు ఈ తోవలోనే కదా టీఆర్ఎస్లోకి వచ్చిపడింది… పైగా బీజేపీ ఎవరికి పడితే వాళ్లకు డబ్బు కట్టలు ఇచ్చేసి, ఎమ్మెల్యేలను కొనుక్కురండి అని చెబుతుందా..? ఇలాంటి ప్రశ్నలతో కేసీయార్ ఆశించిన ప్రయోజనం తుస్సుమంది… జనం నవ్వుకున్నారు తప్ప నమ్మలేదు… తన భయభక్తుల్లోని లోకల్ మీడియా నిన్నంతా హంగామా చేసింది, తీరా ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టును కొట్టిపారేసేసరికి ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది…
జాతీయ మీడియాను నమ్ముకుంటే ఎవరూ పట్టించుకోలేదు… హిందీ, ఇంగ్లిషుల్లో కాపీలు స్ప్రెడ్ చేసినా సరే, బేసిక్‌గా స్క్రిప్టే వీక్‌గా ఉండి, ఎవరూ నమ్మలేదు… ప్రత్యేకించి ఎప్పుడైతే సంఘటన స్థలిలో డబ్బు లేదో, దాంతో కేసు తనంతటతనే వీక్ అయిపోయింది… పైగా ఆ సోకాల్డ్ మధ్యవర్తులు ప్రజాప్రతినిధులు కారు, సర్కారీ ఉద్యోగులు కారు, కేసులో సాక్ష్యాధారాలు లేవు…
ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి రచ్చ చేయాలని అనుకున్నా సరే, ఆధారాలు ఏవి..? అవే ఉంటే ఏసీబీ కోర్టు అరెస్టుల్ని కొట్టిపారేసేది కాదు కదా… ఎవరైనా ఢిల్లీ రేంజ్ బీజేపీ పెద్దమనిషి ఫోన్లో దొరికి ఉంటే, పిచ్చికూతలు కూసి ఉంటే టీఆర్ఎస్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు మజా ఉండేది… సో, ‘ఈనాడు’ రాసినట్టు ప్రస్తుతానికి ‘వ్యూహాత్మక మౌనమే’… మాట్లాడితే ఇక కేసీయార్ మాత్రమే… అంతే… ఎవరూ మాట్లాడకండి అనే కేటీయార్ ట్వీట్ ఆ తోవలోనిదే…
బీజేపీ లేటుగానైనా సరిగ్గానే ఎదురుదాడికి దిగింది… ముందుగా షాక్ తిన్నా సరే, తరువాత హైకోర్టుకు వెళ్లడం, యాదాద్రి ప్రమాణానికి సవాల్ విసరడం ఎట్సెట్రా పొలిటికల్‌గా సరైన కౌంటర్లే… కానీ ఎవరుపడితే వాళ్లు మాట్లాడకుండా ఇలాంటి కీలక సందర్భాల్లో రఘునందన్ వంటి నేతలకు ‘‘మాట్లాడే బాధ్యత’’లు ఇచ్చి, మిగతావాళ్లు సైలెంటుగా ఉంటే బీజేపీకే నయం… ఒకవేళ హైకోర్టు గనుక బీజేపీ పిటిషన్ మీద సీరియస్‌గా స్పందిస్తే కథ మళ్లీ వేరే ఉంటది..!!
Share this Article