Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిగ్గుపడేది ఏముంది..? వాటర్ క్యాన్లు అమ్మేవాడిని, హోటల్ వర్క్ చేసేవాడిని…

November 6, 2022 by M S R

దేశంలో వందల మంది దర్శకులు… ఎందుకు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికే ఇంత ప్రశంసలు..? అసలు తను పాటల దొంగ… ఆల్‌రెడీ కోర్టులో ఓ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ కేసు కూడా పెట్టింది… అలాంటివాడికి ఎందుకింత మోత..? ఇదే అడిగాడు ఓ మిత్రుడు… నిజమే… సీన్లను సీన్లే ఎత్తేసిన జక్కన్నలకు వేల కోట్ల మార్కెట్… చప్పట్లు, ప్రశంసల దుప్పట్లు… తన జీవితం గురించి నిజాయితీగా మాట్లాడుతున్న ఓ దర్శకుడు కమ్ రైటర్ కమ్ హీరోకు ఎందుకు దక్కకూడదు అభినందనలు…?

జూనియర్ ఎన్టీయార్ అంటే నాకు కాస్త అభిమానం అంటాడు… సింపుల్ రీజన్, ఎన్టీయార్ తల్లి శాలిని తను చదువుకున్న కుందపురలో (కర్నాటక) పుట్టింది కాబట్టి…! ఈ భూత కోళను నువ్వు నమ్ముతావా..? అసలు నువ్వు దేవుడిని నమ్ముతావా..? అనడిగితే… చిన్నప్పటి నుంచీ అవి చూస్తూనే పెరిగాను… నమ్మకం కాదు ఇక్కడ ఇష్యూ.., నా ప్రాంత విశిష్ట అర్చన, ఆ నర్తన, ఆ నమ్మకాల్ని నేనెంత బలంగా బయటి ప్రపంచానికి పరిచయం చేయగలను అనేదే నాకు ముఖ్యం… ఎస్, నేను ఆస్తికుడినే, కాంతార సినిమా రిలీజుకు ముందు ధర్మస్థలికి వెళ్లి పూజలు చేయించాను అన్నాడు…

తడబాటు ఏమీ లేదు… నేను, రక్షిత్ శెట్టి కలిసి అదేదో తమ మొదటి సినిమా ఫ్లాపయితే… మౌత్ టాక్ కోసం థియేటర్ బయట ఫ్రీగా టికెట్లు పంచిపెట్టామని, చాలామంది అవి అమ్ముకుని మద్యం తాగేవాళ్లని కూడా షేర్ చేసుకున్నాడు తప్ప.., అప్పట్లో మా తాతలు నేతులు తాగేవాళ్లు సుమా అని మీసాలు తుడుచుకోవడం లేదు… అంతేకాదు, తాజాగా మరో విషయమూ చెప్పుకొచ్చాడు పింక్‌విల్లా ఇంటర్వ్యూలో… ‘‘సినిమా అంటే నాకు ఓ పిచ్చి… కానీ డిగ్రి చదివేటప్పుడు సినిమాలు చూడటానికే డబ్బుల్లేవు… డాడీని అడగలేం… అందుకని రకరకాల పనులు చేసేవాడిని, వాటర్ క్యాన్లు అమ్మేవాడిని… తప్పేముంది..? బతకాలి కదా… హోటల్ వర్క్ కూడా చేశాను కొన్నాళ్లు…’ అన్నాడు…

Ads

‘‘ఎక్కడో చదివాను… ఓ కన్నడ స్టార్ తనకు ఇండస్ట్రీలో ఏ పరిచయాలూ లేకపోవడంతో మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడనీ, తరువాత సర్కిల్ పెరిగాక, చిన్న వేషాలతో స్టార్ట్ చేసి, తరువాత స్టార్ అయిపోయాడని..! నేనూ అంతే కదా… నాకు నటుడిని కావాలని ఇంట్రస్టు… మాది అసలే తుళునాడు… బెంగుళూరుకు పూర్తిగా అటువైపు… యాస వేరు… అందుకని ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను… పదేళ్లు తిప్పలు… ఏవేవో పనులు చేసి పొట్ట నింపుకున్నాం… తప్పదు కదా… డిగ్రీ అయ్యాక ఫిలిమ్ మేకింగ్ ఓ డిప్లొమా కోర్సు కూడా చేశాను…

మెల్లిగా అసిస్టెంట్ డైరెక్టరయ్యాక 2014లో కిరిక్ పార్టీ హిట్టయ్యాక బతుకు గాడినపడింది… అవును, కాంతార ఇంత హిట్టవుతుందని అనుకోలేదు, అయ్యింది, మంచిదేగా, మరికొన్ని సినిమాలకు భరోసా… ఇలా చెబుతూ పోయాడు… సరే, మరి ఆ పాట చౌర్యం మాటేమిటి..? అంటే తను స్పందించడం లేదు… కానీ ఆ వరాహరూపం పాట గాయకుడు శ్రీనివాస్ ఓ మంచి వివరణ ఇచ్చాడు…

‘‘బయట మాట్లాడుకుంటే సరిపోయేది, కోర్టు దాకా పోనవసరం లేదు… నిజానికి ఎవరు ఏ పాటను తీసుకున్నా, కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని బేస్‌గా తీసుకోవాలి అనుకుంటే 72 మేళకర్త రాగాలు/ జనకరాగాలు/ సంపూర్ణరాగాల నుంచే తీసుకోవాలి… అవే కదా మన దక్షిణ సంగీతానికి పేరెంట్స్… నవరసం, వరాహరూపం రెండు పాటలకూ అదే బేస్… కాకపోతే ఉపయోగించిన వాయిద్యం, అక్కడక్కడా ట్యూన్ సేమ్… కానీ అది కథాకళి, ఇది భూత కోళ… ఆ కంటెంటు వేరు… ఈ సందర్భం వేరు… 

పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడేది ఉంటే ఆ 72 మేళకర్త రాగాల సృష్టికర్తల వారసుల్ని వెతికి వాళ్లకు డబ్బు ఇవ్వాలి… సాధ్యమేనా..? అది జాతి సంపద… అందరూ వాడుకుంటారు… ’’బాగుంది… తప్పు లేకపోయినా సరే, కోర్టు దాకా వెళ్లకుండా, బయటే సెటిల్ చేసుకుంటే సరిపోయేది అంటున్నాడు… ఇదీ రిషబ్ హంబుల్ వాదనే… లేకపోతే శ్రీనివాస్ ఇదంతా మాట్లాడడు… సో, రిషబ్ సమ్ వాట్ స్పెషల్… ఎట్ లీస్ట్, కాంతార నడిచినన్ని రోజులు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…
  • ఓహ్… స్టార్లను తీసుకోకపోవడానికి అదా కారణం..? బాగు బాగు..!!
  • ఫుడ్ లవర్స్ జంట… నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions