Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గీతు… సొసైటీలో చాలామందికి ఓ ప్రతీక ఆమె… ఈ ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్…

November 6, 2022 by M S R

గీతు రాయల్… గలాటా గీతు… పేరు ఏదైనా కావచ్చుగాక… ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో సగటు మనిషి ధోరణికి ఆమె ఓ సూచిక… ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ మంచివాళ్లు ఉండరు అనుకునేదాన్ని సార్… కానీ లోకంలో మంచివాళ్లు కూడా ఉంటారని ఇక్కడికి వచ్చాక తెలిసొచ్చింది…’’ ఇదీ ఆమె బిగ్‌బాస్ హౌజు నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు ఏడుస్తూ చెప్పిన మాట… ఫాఫం, హౌజులో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు… ఉప్పునిప్పు తరహాలో ఆమెతో కొట్లాడిన వాళ్లు సైతం బాధపడ్డారు…

ఒక కోణంలో చూస్తే… ఆమె ఇన్నాళ్లూ బతికింది ప్రేమరాహిత్యంలో..! బాగా కష్టాలుపడింది… ఆరోగ్యపరంగా, అదృష్టపరంగా, ఆర్థికంగా… బిగ్‌బాస్ రూపంలో తను ఫోకస్ కావడానికి ఓ మంచి చాన్స్ వచ్చింది… అందుకే ఆమె ఆ చాన్స్‌ను అమితంగా ప్రేమించింది… గెలవాలి… గెలుపు కోసం ఏమైనా చేయాలి… ఎవడూ మనవాడు లేడిక్కడ… ఆటే ముఖ్యం… ఎలా ఆడాను అనేది ముఖ్యం కాదు… అందరినీ మించి ఆడానా లేదా… అందరితోనూ ఆడుకున్నానా లేదా… ఇదే ఆమె మనస్తత్వం… టిపికల్… కానీ సొసైటీలో అందరూ సందర్భాన్ని బట్టి అలాగే కదా ఉండేది…

ఇది ఆమె బిగ్‌బాస్ గేమ్ కోసం తెచ్చిపెట్టుకున్న ధోరణి కాదు… బేసిక్‌గా తన తత్వమే అంత… లోకాన్ని, చేదు అనుభవాల్ని చూసీ చూసీ లోకమంతా చెడ్డదే, ఈ లోకంతో నాకు పనేముంది, నాకు కావల్సింది దక్కుతుందా లేదా అని స్ట్రెయిట్‌గా చూడటమే ఆమెకు అలవాటైంది… ఇలా చాలామంది ఉన్నారు లోకంలో… అదే హౌజులో ఉన్న కీర్తి అనే కేరక్టర్‌ గీతుకు పూర్తి భిన్నం…

Ads

గీతు… తన మాటలు కటువు… తన చేతలు కరుకు… తన ఆటతీరు చిరాకు… ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు… ఇన్నాళ్లూ ఆమె చేసిన ప్రతి తప్పునూ బిగ్‌బాస్ చూసీచూడనట్టు పోయాడు… మోశాడు… అది ఆమెకు మరింత అలుసు… ఓహో, ఎలా ఆడినా సరే ఏదో ఓ ఎక్సెప్షన్ ఉంటుందిలే అనుకుంది… కానీ ఒక దశ దాటాక ఆడియెన్స్‌కు చికాకు మొదలైంది… సోషల్ మీడియా, సైట్లు కూడా గీతక్క-రోతక్క అంటూ ఫుల్ నెగెటివ్ స్టాండ్ తీసుకున్నాయి… అవీ ఆడియెన్స్‌ను ప్రభావితం చేశాయి… వెరసి ఆమె బయటికి రాకతప్పలేదు…

హౌజు నుంచి బయటికి వెళ్లిపోవడానికి అంతగా ఏడ్చిన కేరక్టర్‌ను మనం గతంలో చూడలేదు… కలలు ఒక్కసారిగా పగిలిపోయిన బాధ… కాకపోతే ఆమెకు ఓ నిజం తెలిసొచ్చింది… లోకం అంతా చెడ్దది కాదు… నాకెవరూ లేరు, నేనెవరికీ ఏమీ కాను అనే స్థితి నుంచి… కొంతమందితో మానసికంగా కనెక్టయింది… మనుషులు, సంబంధాల విలువ తెలిసొచ్చింది…. మంచీ చెడ్డా వేర్వేరుగా ఉండవు… సిట్యుయేషన్‌ను బట్టి, మన సంబంధాలను బట్టి ఎదుటోళ్లు రియాక్టవుతారు… నాగార్జున చెప్పింది కూడా అదే… సో, మిగతా ఎలిమినేషన్లతో పోలిస్తే గీతు ఎలిమినేషన్ కాస్త ఎమోషనల్… ఫిలాసఫికల్…

కీర్తి గురించి మధ్యలో అనుకున్నాం కదా… గీతుకు ఈమె క్వయిట్ అపోజిట్… తన చేదు అనుభవాలు, నష్టాలతో గీతు మనుషుల్ని ద్వేషించడం మొదలు పెట్టింది… అది ఓ అడమెంటాలిటీ వైపు ఆమెను నెట్టేసింది… కానీ కీర్తి అలా కాదు… ఆమె బతుకంతా కష్టాలే… ఇప్పటికీ ఆమె దేహంలో ఎన్ని ప్లేట్లు, ఎన్ని బోల్టులు ఉన్నాయో ఆమెకే తెలియదు… తల్లి కాలేదు… పెంచుకున్న బిడ్డ దక్కలేదు… కానీ బతుకంటే ఇవన్నీ దాటుకుని మూవ్ కావాల్సిందే కదా అనుకుంటున్నది ఆమె… పోరాటమే… హౌజులో ఎవరితో మాట్లాడినా సంస్కారం తప్పదు… నిజం… లోకంలో రెండేరకాల మనుషులు ఉంటారు… 1) గీతు 2) కీర్తి… లోకాన్ని ద్వేషిస్తే తిరిగి మనకు లభించేది అదే… ఇది ఒకరి బతుకు… ఇదంతా డెస్టినీ అనుకుని జీవితంలో ముందుకు కదలాల్సిందే అనుకునేది మరో బతుకు… క్వయిట్ కాంట్రాస్టు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions