అనుమానం దేనికి..? ఒకరకంగా ప్రధాని నుంచి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అభిశంసన ఇది… ఎవరెన్ని రకాలుగా సమర్థించుకున్నా సరే… ప్రధాని మాటల్లోని శ్లేష అదే… ఒకవేళ ఆంధ్రజ్యోతి వార్త నిజం అయిఉంటేనే సుమా…! ఎస్, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల కార్యక్రమాలు జరిగినప్పుడు ‘స్వపరిచయం’ ఎపిసోడ్లు ఉంటాయి… అది మంచిదే… అయితే ఇక్కడ సిట్యుయేషన్ వేరు…
ఇప్పుడున్న బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని బోలెడు మంది వచ్చి చేరుతున్న నయా కాంగ్రెస్ ఇది… వస్తున్నారు, పోతున్నారు… సో, ఆర్ఎస్ఎస్ తరహా పాత విధానాలు బీజేపీలో చాలావరకు కనిపించడం లేదు… ఆశించలేం కూడా…! పైగా సోము వీర్రాజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు… ఆర్ఎస్ఎస్ ప్రచారప్రముఖ్‌లే గాకుండా పార్టీ వర్గాల నుంచి ప్రధానికి వీళ్ల పనితీరు మీద సంక్షిప్త అసెస్‌మెంట్ రిపోర్టు అందుతూనే ఉంటుంది… పైగా ఈ రాష్ట్రానికి వస్తున్నాడు అంటే, ముందుగా అవేవీ తెలియకుండా వస్తాడా..? సో, అన్నీ తెలిసే అడగబడిన ప్రశ్న అది…
Ads
కోర్ కమిటీ భేటీ కాబట్టి, ప్రధాని అలా మాట్లాడి ఉంటాడు… ఓ హెచ్చరిక కావచ్చు, పనితీరు ఏమాత్రం బాగాలేదు అని పరోక్షంగా చెప్పడం కావచ్చు… బయట సమావేశాల్లో అలా పలకరించడు… నిజానికి వీర్రాజు పనితీరు ఉత్త తుప్పాస్… ‘‘మీరు ఇంకేమైనా చేస్తుంటారా..? (ఇతరత్రా వ్యాపారమో, వ్యవసాయమో, ఇతర వ్యాపకమో)’’ అని అడగడం అంటే… పార్టీ పని మీద కాన్సంట్రేషన్ లేదని చెప్పడమే… ఒక్కసారి ఇటువైపు చూడండి… అదే ప్రధాని బండి సంజయ్‌ను తన తెలంగాణ పర్యటనలో రెండుమూడుసార్లు ప్రశంసించాడు…
సభలో ‘మీ అధ్యక్షుడు పిలిస్తే వచ్చాను’ అన్నాడు… భుజం తట్టి ‘బాగా నిర్వహించారు’ అన్నాడు అంటే స్వయంగా ఈరోజు కార్యక్రమాల తీరు పట్ల సంతృప్తి చెందడమే కాదు, తన పనితీరు మీద రిపోర్టు చదివి ఉంటాడు కదా… అదీ అభినందన… నిజానికి సోము వీర్రాజు గానీ, బండి సంజయ్ గానీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఎదిగినవాళ్లే… సంజయ్ సబ్జెక్టు నాలెడ్జి, వ్యక్తీకరణ తీరు, కలుపుకుని వెళ్లే అంశాల్లో చాలామందికి ఫిర్యాదులు ఉండవచ్చుగాక… కానీ హార్డ్‌కోర్ కమిటెడ్ కార్యకర్త… పార్టీ వర్క్‌లో దూకుడు పట్ల ఎవరూ ఫిర్యాదు చేయలేరు… మునుపటివలె గాకుండా ఇప్పుడు స్టేట్ బీజేపీ టీఆర్ఎస్ ధోరణితో నిర్మొహమాటంగా, దీటుగా తలపడుతోంది…
బహుశా పార్టీ సంతృప్తికి అదే కారణం కావచ్చు… కాకపోతే మునుగోడు ఓటమి పార్టీని ఒక్కసారిగా డిమోరల్ చేసింది… గెలిస్తే కథ ఇంకా ఊపులోకి వచ్చి ఉండేది… ఐతే కేసీయార్ తనే దాడులు చేస్తాడు… ఉధృతంగా… బీజేపీ ప్రస్తుత నాయకత్వానికి ఆత్మరక్షణ తప్ప వేరే దిక్కులేదు… తాము స్వయంగా కేసీయార్‌ను కార్నర్ చేసే తెలివితేటలున్నవాళ్లు లేరు… ఈ స్థితిలో జాతీయ నాయకత్వమే పూనుకోవాలి… కానీ హైకమాండ్ ధోరణి ఎవడికీ అర్థం కాదు… సో, జరిగేవి చూడటమే… ఏపీలో చూడటానికి కూడా ఏమీ కనిపించదు… అది వేరే విషాదం అన్నమాట..!!
Share this Article