ట్విట్టర్‌లో ఎవరో ఒకరి మీద పడాలి… లేకపోతే ఏమీ తోచదు… ట్రోలింగ్ స్థాయిలో కాకపోయినా ఎవరితోనైనా ఆడుకోవాలి… ఈ ధోరణి ఈమధ్య బాగా పెరిగిపోయింది… కొన్నింటిని అనవసరంగా హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్లకు తీసుకుపోతారో మనం ఇంతకుముందే ‘దృష్టిఐఏఎస్’ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇది చాలా తక్కువ రేంజ్… మనమూ నవ్వుకోవచ్చు… ట్రోలింగ్ కాదు, సరదా వ్యాఖ్యలు…
ఓలా క్యాబ్ నెట్‌వర్క్ తెలుసుగా… దాని ఫౌండర్ పేరు భవీష్ అగర్వాల్… ప్యూర్ నార్త్ ఇండియన్… పంజాబీ హిందూ ఫ్యామిలీ… ఈ ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్ అంకిత్ భాటితో కలిసి ఈ ఓలా స్థాపించాడు… తరువాత అది ఇతర దేశాలకూ విస్తరించింది… తక్కువ వయస్సులోనే ప్రభావశీల వ్యాపారవేత్తగా ఎదిగిన భవీష్ చాలామంది యువతకు ఆదర్శం…
సరే, ఇదంతా ఒక పార్ట్… ఏదో పని మీద ఈమధ్య బెంగుళూరు వెళ్లాడు… ఎవరో చెప్పారు, వీణా స్టోర్స్‌లో బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని… తను ఉంటున్న స్టార్ హోటల్ నుంచి నేరుగా ఆ టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు… కాస్త డౌన్ టు ఎర్త్ పోకడే తనది… మరీ హైఫై వేషాలు ఏమీ ఉండవు… వీణా స్టోర్స్ చాలా చిన్న ఆవరణ… కాకపోతే ఇడ్లి, వడ వంటి టిఫిన్లకు ఫేమస్… అక్కడి చట్నీ ఎందుకో జనాన్ని అక్కడికి అడిక్ట్ చేస్తుంది…
Ads
మన భవీషుడూ ఎంచక్కా ఇడ్లి, వడ లాగించాడు… నచ్చింది… నిజమే కదా, అల్పాహారం, బ్రేక్ ఫాస్ట్ అంటే సౌత్ ఇండియన్లదే… ఎన్నిరకాల టిఫిన్లు… రోజూ పండుగే… వడ పావ్, పావ్ బజ్జీ, పొద్దున్నే డోక్లా, జిలేబీ, సమోసా, కచోరీ టైప్ కాదు కదా మనం… ‘ఇప్పటివరకు తన జీవితంలో ఇదే గొప్ప బ్రేక్ ఫాస్ట్, ఇడ్లి-వడ తినడానికి ప్రపంచంలోనే ఇది గొప్ప ప్లేసు’ అని భవీష్ ఆనందంగా ఓ ట్వీట్ కొట్టాడు… ప్చ్, ఆ రోజు జనానికి పెద్దగా పనిలేదు…
జనం ఆ ట్వీట్‌ను ఎంజాయ్ చేస్తూనే భవీష్‌తో ఆడుకోవడం మొదలుపెట్టారు ట్విట్టర్‌లో… ఏమీలేదు, తను చెంచాతో వడ తింటున్నట్టు ఫోటో చూశారు, అంతే… అసలు వీణా స్టోర్స్ ఇడ్లిని, వడను చెంచాలతో తినడం ఎంత నేరమో తెలుసా నీకు..? భయ్యా, నీలాంటోళ్ల కోసమే నరకంలో ప్రత్యేకంగా ఓ ప్లేసు ఉంటుంది, శిక్షలుంటయ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు… అసలు అందులో ఇడ్లి లేదు, ఇడ్లి కాంబినేషన్ లేకుండా కేవలం వడ ఏం బాగుంటుంది..? అసలు ఇదేం బ్రేక్ ఫాస్ట్..? అంటాడు మరొకరు…
అసలు కేవలం చట్నీతో ఎవరైనా వడ తింటాడా ప్రపంచంలో..? ఏది, సాంబార్ ఏది..? సాంబార్‌లో వడ ముక్క మునగకపోతే అది వడ ఎలా అవుతుంది..? అని ఇంకొకరు… ఇంకొన్ని సరదాగా చదవండి…
ఓహ్, భవీష్, గుడ్… కానీ ఇన్నాళ్లూ ఆ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయకపోవడం తప్పు కదా చెప్పు..?
మా జేబులు లూటీ చేస్తూ నువ్వు బెంగుళూరు వెళ్లి ఇడ్లి వడ తింటున్నావా..? హమ్మా…
ఇడ్లిని, వడను చేతులతో మాత్రమే తినాలని ఇడ్లిశాస్త్రం చెబుతోంది, తెలియదా నీకు…
నిజానికి కార్పొరేట్ కంపెనీ దేశీఫుడ్… అంటే ఇండియన్‌నెస్… నువ్వు పూనుకో భయ్యా…
సారీ బ్రదర్, చివరకు ఇడ్లికి కూడా చెంచాలు, ఫోర్కులు కావల్సి వచ్చాయా ఈ రోజుల్లో…
ఓ మై గాడ్… ఇడ్లి, వడ కూడా ఆనందంగా అరుస్తున్నట్టున్నాయి… కమాన్ భయ్యా…
నీ ప్లేటులో ఉన్నది కేవలం వడ, మరి ఇడ్లి- వడ సూపర్ అంటావేమిటి భాయ్…
బ్లేజర్ వేసుకుని ఇడ్లి- వడ తింటే ఆ ఒరిజినల్ టేస్ట్ రాదు సోదరా, తెలియదా ఏం..?
Share this Article