దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి…
మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల మంది, నిజమే, వేల మందిని డెస్టినీ కాటేస్తూనే ఉంటుంది… కొందరిని మోసాల రూపంలో… కొందరిని మరీ వికృతంగా ఆరోగ్యాలు, ప్రమాదాల రూపంలో…! ఇండస్ట్రీలో ఎవడికీ ఎవడూ ఏమీ కాడు… ఎవడికి ఎవడూ లేడు… ఉండడు…
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో కీర్తి అనే కంటెస్టెంట్ ఉంది… ఆమె కథ తెలుసు కదా… వోెకే, ఓసారి అనూ అగర్వాల్ దగ్గరకు వెళ్దాం… పుట్టింది ఢిల్లీలో… కొన్నాళ్లు ఆ ఫ్యామిలీ చెన్నైకి షిఫ్టయింది… తరువాత మళ్లీ ఢిల్లీ… అక్కడే చదివింది… మోడలింగ్ చేసేది, రేడియో జాకీగా చేసేది… కానీ సినిమాలు అంటే ఎందుకో అయిష్టం… కానీ మహేష్ భట్ ఒప్పించాడు, ఆషికిలో నటింపజేశాడు…
Ads
అదేమో సూపర్ హిట్… ఆ సినిమాలో దాదాపు 12 మ్యూజిక్ బిట్స్… దాదాపు గంటసేపు మ్యూజిక్ ట్రాకే ఉంటుంది… 30 లక్షల దాకా ఖర్చు పెడితే 5 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా… ఈమెకు గిరాకీ పెరిగిపోెయింది… కానీ సెలెక్టివ్‌గా ఉండేది… ఈ రొటీన్, ఫార్ములా సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదు… తోచినప్పుడు సినిమా చేసేది… లేకపోతే లేదు…
1994 ప్రాంతంలోనే ఆమె ఎంత బోల్డ్ అంటే… క్లౌడ్ డోర్ అనే ఇండో జర్మన్ షార్ట్ ఫిలిమ్‌లో నగ్నంగా నటించింది… ఇప్పుడంటే పెద్ద ఇష్యూ కాకపోవచ్చుగాక, కానీ అప్పట్లో అది ఎంత బోల్డ్, డేరింగ్ స్టెప్..?!
హిమాలయాల్లోని ఆశ్రమాలకు తిరిగేది… 1997లో బీహార్ యోగా స్కూల్‌లో కర్మయోగిగా చేరింది… 1999లో ముంబైకి వస్తున్నప్పుడు తన కారుకు పెద్ద ప్రమాదం జరిగింది… చనిపోయిందనే అనుకున్నారు అందరూ… పట్టించుకునేవారు లేరు… ఎవరో ధర్మాత్ముడు ఆదుకున్నాడు… నెల రోజులు కోమాలో ఉండిపోయింది… బాడీలో ప్రతి ఎముక విరిగిపోయింది… తన గతం మొత్తం మరిచిపోయింది… గాజు ముక్కలు గుచ్చుకుని మొహం మొత్తం ఛిద్రాలు పడిపోయింది…
నేనెందుకు బతికి ఉన్నాను అనుకునే వైరాగ్యం నుంచి… యోగా, ధ్యానంతో మళ్లీ కోలుకుంది… ఆమెను అవే ఆదుకున్నాయి… మునుపటి అందం పోయింది, ఆరోగ్యం పోయింది… పూర్తిగా ఇక యోగ, ధ్యానం శిక్షణలపైనే ఫోకస్ చేసింది… గ్లామర్ ప్రపంచం ఎలాగూ రానివ్వదు కదా… ఇక తాజా వార్త విషయానికి వద్దాం… ఆమధ్య ఆమె బయోపిక్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం తీయడానికి సంప్రదింపులు జరిగాయి… ఎందుకు ఆగిపోయిందో తెలియదు…
కాన్సెప్టు సెంట్రిక్, సినిమా సెంట్రిక్, మ్యూజిక్ డైరెక్టర్ సెంట్రిక్, గెస్ట్ సెంట్రిక్ ఎపిసోడ్లు చేస్తుంటారు కదా ఇండియన్ ఐడల్ వాళ్లు… అదే నేహ కక్కర్, విశాల్ దడ్లానీ, హిమేష్ రేషమియా జడ్జిలు ఈ సీజన్‌కు కూడా… (సౌత్ ఇండియన్ సింగర్లు ఎవరూ లేని నార్త్ ఇండియన్ ఐడల్ అని ‘ముచ్చట’ ఆల్‌రెడీ పబ్లిష్ చేసింది తెలుసు కదా…) అదే ఆదిత్య నారాయణ్ హోస్టింగు…
ఈసారి ఆషికి సినిమా సెంట్రిక్ ఎపిసోడ్ ఒకటి నడిపించారు… కుమార్ సానును పిలిచారు… ఆ సినిమాలో 9 పాటలు తనవే… ఈమెనూ రమ్మన్నారు… వెళ్లింది, స్టేజీపై నడుస్తూ నాలుగు మాటలు షేర్ చేసుకుంది, కంటెస్టెంట్లతో మాట్లాడింది, కుమార్ సాను చప్పట్లు కొట్టసాగాడు, మిగతావాళ్లు కొట్టారు… కానీ అవేవీ రాలేదు, అన్నీ కట్ చేసి, ప్రసారం చేశారు…
ఇది నిజంగా ఆమెను అవమానించినట్టే… ఎవరు పిలవమన్నారు..? పిలిచినప్పుడు సరైన గౌరవం దక్కాలి… లేకపోతే పిలవకుండా ఉండాల్సింది… మొత్తం ఆమె మాట్లాడే సీన్లన్నీ కట్ చేయడం ఇన్‌సల్ట్ చేయడం కాదా..? దాన్నే ఆమె ఇన్‌స్టాలో పోస్టులు పెట్టి బాధపడింది… ‘‘నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు, నిందించడం లేదు, నేను ఓ సన్యాసిని నేను, ఇవన్నింటికీ అతీతంగా మారిపోయాను… కానీ బాధగా ఉంది… చివరకు నేను కనిపించే సీన్లనూ ఎడిట్ చేశారు… దుర్మార్గం… సోనీ వాడు కదా… వాడంతే…!!
Share this Article