కరణం గారి పగ, కాటికి చేరినా పోదు… అని ఓ సామెత… ఉండవల్లి అరుణ్‌కుమార్ బ్రాహ్మల్లో ఏ విభాగమో తెలియదు గానీ… వీరముదురు కరణం… పట్టువదలని విక్రమార్కుడు టైపులో పగవీడని అరుణార్కుడు… రామోజీరావును అప్పుడెప్పుడో వైఎస్ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం టార్గెట్ చేశాడు ఉండవల్లి… సరైన పాయింట్లు పట్టుకుని, వెంటపడతాడు కాబట్టి ఉండవల్లే కరెక్టని ఆయనకు అప్పగించాడు వైఎస్…
వైఎస్ మరణించాక, జగన్‌తో ఉండవల్లికి పెద్దగా సత్సంబంధాలు లేక, కేసీయార్‌కు రామోజీని సాధించడం ఇష్టం లేక, జగన్‌కు కూడా రామోజీని గోక్కోవడం ఇష్టం లేక… ఇక మార్గదర్శి కేసును అందరూ మరిచిపోయారు… కానీ ఉండవల్లి మరిచిపోలేదు… పోడు… ఉండవల్లిని కూడా రామోజీ గ్రూపు పరువునష్టం కేసులు వేసి గోకారు… వైఎస్ లేడు, జగన్ పట్టించుకోడు, ఓసారి ఆడుకుందాం అనుకున్నారు… మామూలుగానే ఉండవల్లి ఊరుకునేరకం కాదు… ఇక గోకితే అభిమానం దెబ్బతినదా..? తిన్నది… ఇంకా తవ్వడం మొదలుపెట్టాడు…
సుప్రీం దాకా కేసు వెళ్లింది… అక్కడా తనే కొట్లాడుతున్నాడు… కేసీయార్, నువ్వెందుకు ఇన్‌ప్లీడ్ కావడం లేదు అనడుగుతున్నాడు, ప్రస్తుతానికి రామోజీతో గోక్కోవడం కేసీయార్‌కు ఇష్టం లేదు కదా, ఉండవల్లితో రాజకీయాలు చర్చించాడు గంటలకొద్దీ… కానీ రామోజీ కేసును మాత్రం లైట్ తీసుకున్నాడు… ఈమధ్య ఈనాడుతో ఉప్పూనిప్పూ యవ్వారం మళ్లీ మొదలైంది కదా… జగన్ కూడా కళ్లు తెరిచి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేశాడు,…
Ads
అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా చిట్‌ఫండ్స్ కంపెనీల మీద దాడులు జరిగాయి… టార్గెట్ మార్గదర్శిలో అక్రమాల్ని రికార్డు చేయడమే… కానీ ఈనాడులో ఓ పెద్ద ఫస్ట్ పేజీ స్టోరీ రాసి రామోజీరావు జగన్ ఇలా కక్షకట్టాడు, మావాళ్లను బెదిరిస్తున్నాడు అంటూ ఎదురుదాడికి దిగాడు… ఇలా…
నిజానికి మొన్నామధ్యే సుప్రీంలో విచారణకు వస్తే, కొట్టుడుపోతుందని మార్గదర్శి ఆశించినట్టుంది… కానీ కథ రివర్స్ కొట్టింది… డిసెంబరు 2న ఈ కేసు విచారణ ఉంది… ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అక్రమాలపై ఆధారాలను సేకరించాలని తలపెట్టినట్టుంది… ఈలోపు ఉండవల్లి మరికొన్ని వేలిడ్ పాయింట్లతో ప్రెస్‌మీట్ పెట్టాడు… ముఖ్యాంశాలు…
‘‘డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీ చెప్పారు… డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారు… కానీ .. ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారు… మార్గదర్శి చిట్‌ఫండ్ పేరిట డబ్బులు సేకరించారు… గతంలో డిపాజిట్ అని ఉండేది.. ఇప్పుడు రిసీట్ అని సేకరిస్తున్నారు… మార్గదర్శికి 3 శాతం కూడా డీఫాల్టర్లు కూడా లేరు… అందులో కిటుకు ఏంటీ..? మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ రూ.139 కోట్లుగా చూపించారు… ఇండియాలో ఉన్న బ్యాంకులు రామోజీకి అప్పగిస్తే… అద్భుతంగా నడిపిస్తారేమో..!’’ అంటూ వెటకారాన్ని దట్టించాడు…
‘‘మార్గదర్శి చైర్మన్ ఇప్పటికీ రామోజీనే… కానీ.. కోర్టులో మాత్రం నేను చైర్మన్ కాదంటున్నారు… రామోజీ నీవు తప్పు చేశావా..? లేదా..?
అనేది వాదనల్లో ముఖ్యం… ఇండస్ట్రియల్‌గా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు… మీడియాను రామోజీ వాడుకుంటున్నారు… రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీం జడ్జి చెప్పారు… రామోజీకి ఉన్న రెండు టోపీల్లో ఒకటి మీడియా… రెండోది ఇండస్ట్రియలిస్ట్… రామోజీ తెలివితేటలకు పద్మవిభూషణ్ కాదు… భారత రత్న ఇవ్వాలి… రాష్ట్ర ప్రభుత్వం దైర్యంగా మార్గదర్శిల్లో తనిఖీలు నిర్వహించింది…’’ ఇలా సాగింది తన ప్రెస్ మీట్…
ఇప్పటికీ డిపాజిట్లు సేకరించడం అనేది నిజమైతే రామోజీరావు ఇంకా లోతుల్లోకి ఇరుక్కున్నట్టే భావించాలా..? పైగా చిట్స్ పాడినవాళ్లు ఒక నెల ముందే తమ బకాయిల్ని కట్టేస్తున్నారు… ఇందులో మర్మమేమిటి..? ఇంకేదైనా దందా దాగి ఉందా..? అంటాడు తను… మొత్తానికి మార్గదర్శి కేసులో ఎప్పటికప్పుడు పదిలీటర్ల పెట్రోల్ పోస్తూ, దాన్ని రావణకాష్టంలా ఆరనివ్వకపోవడంలో మాత్రం ఉండవల్లి సక్సెసయ్యాడు… కేసు ఏమవుతుందో చూడాలిక…!!
Share this Article