ముందుగా యలమంచిలి శివాజీ ఆంధ్రజ్యోతిలో రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలను చెప్పుకుందాం… కృష్ణ జైఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, తెలంగాణ వ్యతిరేకి, అప్పట్లో జైఆంధ్ర ఉద్యమకారులు మద్రాసు వెళ్లి, పెద్ద పెద్ద సినిమా నటుల్ని, దర్శకుల్ని కలిస్తే… ఎవరూ ముందుకు రాలేదు, కృష్ణ ఒక్కడే సమర్థించాడు… ఇవన్నీ వోకే… ఇప్పుడు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు…
తనపై ఇప్పుడు ముద్రలు కూడా అవసరం లేదు… అప్పట్లో తనకు నచ్చింది చేశాడు… ఒక ఏడాది సంపాదన ఉద్యమానికి ఇద్దామని కృష్ణ ప్రతిపాదిస్తే ఒక్కొక్క సినిమా సెలబ్రిటీ ఠారెత్తిపోయారట… మంచివాళ్లకు మంచివాడు సినిమా తొలిరోజు వసూళ్లు మొత్తం ఉద్యమానికి ఇచ్చిన కృష్ణ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు… అంతా బహిరంగమే… ఇంతాచేస్తే తను మంగళగిరిలో స్టూడియో కట్టాలనుకుంటే అప్పటి ప్రభుత్వం సాయం చేయకపోతే, ఇక హైదరాబాదులో కట్టేశాడు…
ఇలాంటి అంశాలపై ఇప్పుడు పెద్దగా ఆసక్తి ఉండదు… కొందరికి ఉండొచ్చు కూడా… విశాఖపట్టణంలో ఏదో ఫంక్షన్‌లో పాల్గొన్నప్పుడు తను స్పష్టంగా చెప్పాడు తన శ్రేయోభిలాషులకు… ఈ రాజకీయాల్లో తిరగడం వల్ల గ్లామర్ పోయింది, వరుసగా సినిమాలు దెబ్బతిన్నాయి, అందుకే వాటికి దండం పెట్టేశాను అన్నాడు… నిజానికి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? కృష్ణ ఎప్పుడూ యాడ్స్‌లో కనిపించేవాడు కాదు… ఇప్పటి మహేశ్ బాబుకు పూర్తి అపోజిట్…
Ads
అప్పట్లో ఏదో హోమియో మందుల యాడ్ ఫిలింలో పాల్గొన్నాడట… కృష్ణ స్థాయికి అది బాగాలేదని శివాజీ సహా వెల్‌విషర్లు ఆదిశేషగిరిరావుకు చెప్పడంతో, ఆయన కృష్ణకు చెప్పి ఆ యాడ్ తీసేయించాడు… కృష్ణ సినిమా వ్యవహారాలు, నిర్ణయాల్లో ఆయనదే ప్రధాన పాత్ర… శివాజీ రాసింది చదువుతుంటే మహేశ్ యాడ్స్ గుర్తొచ్చాయి… వద్దూవద్దన్న యాడ్స్ కూడా చేస్తుంటాడు మహేశ్… డబ్బొస్తే చాలు…
కూల్ డ్రింక్స్ సరే, గుట్కా సరోగేట్ యాడ్స్ ఎందుకు చేయాలి..? అమితాబ్ వంటి సీనియర్, వెటరన్ యాక్టర్లే చెంపలేసుకుని, ఆ యాడ్స్ డబ్బులు వాపస్ ఇచ్చారు… మహేశ్‌కు ప్రజారోగ్యం మీద బాధ్యత లేదా..? పైగా సరోగేట్ యాడ్స్ కమర్షియల్స్ రంగానికి సంబంధించి ఓ బ్యాడ్ ట్రెండ్… ఒక తెలుగు చానెల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తూ, కూతురితో కలిసి ప్రమోషన్ యాడ్స్ చేయడం కూడా తన ఫ్యాన్స్‌కే నచ్చడం లేదు… ఐనా తను ఆపడు… ఈ యాడ్స్ విషయంలో మహేశ్‌పై నమ్రత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుందంటారు…
నిజానికి కృష్ణ డబ్బు మాత్రమే కాదు, చాలా అంశాల్లో కొన్ని నైతిక విలువల్ని, ప్రమాణాల్ని, మానవతా ధోరణిని కనబరిచేవాడు… నటుడిగా తను ఏమిటీ అనేది వదిలేస్తే… ఒక మనిషిగా కృష్ణ అంటే కృష్ణే… అంతే… వారసుడిగా వాటిని కొనసాగించే విషయలో మహేశ్‌కు పెద్దగా ఇంట్రస్టు లేనట్టు కనిపిస్తాడు… మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు, స్మారకాల ప్రకటనల్లోనే కనిపిస్తోంది కదా… ప్చ్…!
అన్‌స్టాపబుల్ షోలోనే కావచ్చు, ఏదో ప్రశ్నకు బదులిస్తూ… కృష్ణ నుంచి ‘‘అతి మంచితనాన్ని’’ వారసత్వంగా వద్దనుకుంటున్నానని అన్నట్టు గుర్తు…! నిజమే…!! కృష్ణ, విజయనిర్మల ఇంకేదో ఇంటర్వ్యూలో… ‘‘మాకు రెమ్యునరేషన్లకన్నా చెల్లని చెక్కులే ఎక్కువ’’ అన్నారు… మంచితనంతో కృష్ణ నష్టపోవచ్చుగాక… కానీ మంచితనం వేరు, విలువలు వేరు మహేశ్… కృష్ణ హోమియో మందుల యాడ్స్‌నే వదిలేసి, తరువాత వాటిపై ఆసక్తి చూపలేదు… నువ్వేమో గుట్కా యాడ్స్ కూడా వదలలేదు… తేడా లేదా..?!
Share this Article