ఇద్దరు సీఎంలు వచ్చి నివాళి అర్పించారు… తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది… కృష్ణను ఘనంగా, తన రేంజుకు తగినట్టు సాగనంపారు… కరెక్టేనా..? కాదు..! మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇండస్ట్రీలో విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి… సొంత భూములు, పద్మాలయా స్టూడియో ఉండగా… సాదాసీదాగా మహాప్రస్థానం స్మశానంలో దహనక్రియలు జరపాలనే నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన పొలిటికల్ సెలబ్రిటీలే ఆశ్చర్యపోయారట… కుటుంబసభ్యుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట…
ఆ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు..? మహేశ్ బాబు భార్య నమ్రత అంటున్నారు… ఆమె నిర్ణయం తీసుకుని, మహేశ్ బాబుకు చెప్పకుండానే మహాప్రస్థానంలో కన్ఫరమ్ చేసేసరికి, మహేశ్ కుటుంబంలో ఇతరులకు సమాధానం చెప్పలేక ఓ గదిలోకి వెళ్లి బోరుమన్నాడని ప్రచారం సాగుతోంది… అభిమానులకు కూడా మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడం కలుక్కుమనిపించింది… (నిజానికి కృష్ణ అందరూ దూరమైన ఒంటరితనం వల్ల ఒత్తిడికి గురయ్యే గుండెపోటుకు గురయ్యాడనే వేరే చర్చ సాగుతూనే ఉంది… మహేశ్ ఎక్కడ ఉంటాడు..? ఒంటరి కృష్ణ ఎక్కడ ఉండేవాడు..?)
Ads
ఆదిశేషగిరిరావుతోపాటు మహేశ్ బాబు వదిన మృదుల కూడా బాగా హర్టయ్యారట… అంతేకాదు, గల్లా ఫ్యామిలీ కూడా చిన్నబుచ్చుకుని మహేశ్‌ను మొహం మీదే అడిగేశారని స్ప్రెడ్ అవుతోంది… నిజమే… గల్లా జయదేవ్ ఫ్యామిలీ చిన్నదేమీ కాదు… వేల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు, పరిశ్రమలు… పొలిటికల్ ఫ్యామిలీ, తను ఎంపీ… జగన్ తొక్కాలని ప్రయత్నిస్తే, తమిళనాడు వెళ్తాను తప్ప తలవంచను అన్నాడు… అలాంటిది తన సొంత మామ అంత్యక్రియలు ఓ సగటు ఆర్టిస్టుకు జరిగినట్టు మహాప్రస్థానంలో జరిగితే తట్టుకోలేకపోయాడట… గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలని ముందుగా నిర్ణయించి, తరువాత అదీ రద్దు చేయడం కూడా వాళ్లకు నచ్చలేదు…
ఇదంతా ప్రచారమే అనేట్టు లేదు… ఎందుకంటే..? అంత్యక్రియల తెల్లవారే ఈ విమర్శలన్నీ కవర్ చేయడానికి ‘పద్మాలయాలో కృష్ణ మెమోరియల్ ఏర్పాటు, విగ్రహ స్థాపన’ అనే లీకులు… అసలు అంత్యక్రియలపై నిర్ణయమే సరిగ్గా లేదు, ఈ మెమోరియల్ కథల్ని ఎవరు నమ్ముతారు..? పద్మాలయాలో మెమోరియల్ అంటూనే.., నేను స్థలమిస్తాను అని కేసీయార్ హామీ ఇచ్చాడు, విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలమిస్తాను అని జగన్ హామీ ఇచ్చాడు అనే మాటలు దేనికి చెబుతున్నట్టు..?
ఈ స్థితిలో… మొన్న చిన్న కర్మ చేశారు, కృష్ణలో అస్థికలు కలిపారు అనేది కాదు… పెద్ద కర్మ ఎలా చేయబోతున్నారు..? ఎక్కడ..? అనేది ప్రశ్న… కొడుకుగా తన విద్యుక్త ధర్మమేమిటో మహేశ్ ఆలోచించుకోవాలి… కోట్ల మంది ఫ్యాన్స్ మెచ్చుకునేలా వ్యవహరించాలి… నరేష్, పవిత్రల ఓవరాక్షన్, అకస్మాత్తుగా దర్శనమిచ్చిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, నరేష్‌కు షాకిచ్చిన కేసీయార్, నరేష్‌కు చిల్లిగవ్వ కూడా దక్కదా..? మనం ఇవిగో, ఇవి రాసుకుంటున్నాం… మొన్నటిదాకా కృష్ణ ఉన్న బిల్డింగ్ నరేష్‌కే చెందుతుంది… నరేష్‌కు అమ్మ విజయనిర్మల ఇచ్చిపోయిన ఆస్తే బోలెడు… పైగా తను కృష్ణతో తనకు నెత్తుటి బంధం కూడా ఏమీలేదు… తనకు ఆస్తిలో వాటా ఎందుకివ్వాలి..? ఎందుకిస్తారు..? పిచ్చి కథనాలు..!!
Share this Article