Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మిక గాలి తీసేసిన రిషబ్… ఆమెలో రగులుతూనే ఉన్న ‘పెళ్లి రద్దు’ కోపం…

November 24, 2022 by M S R

గ్లామర్ ప్రపంచంలో కలవడాలు, విడిపోవడాలు పెద్ద విశేషమేమీ కాదు… లివ్ ఇన్ రిలేషన్స్, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు నడుస్తూనే ఉంటయ్… నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు… అంతెందుకు, నీనా గుప్తా అయితే వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ఓ అమ్మాయిని కని, సింగిల్ మదర్‌గా ఉంటోంది… బోలెడు ఎక్స్‌ట్రీమ్ కేసులుంటయ్… సుస్మితాసేన్ తనకన్నా చాలా చిన్నవాడు రోహమన్‌తో కలిసి బతికింది, వదిలేసింది, మళ్లీ ఇప్పుడు పిలుస్తోంది…

బ్రేకప్పుల తరువాత కూడా కనిపిస్తే పలకరించుకుంటారు, అవసరమైతే కలిసి నటిస్తారు… అవును, నటిస్తారు… మామూలు మానవసంబంధాలకు ఢోకా రానివ్వరు… కానీ రష్మిక ఏమిటో గానీ, కడుపులో రక్షిత్ శెట్టి పట్ల పెరిగిన కోపాన్ని అలాగే కడుపులో కంటిన్యూ చేస్తోంది… పెంచుతోంది… అది ఎక్కడివరకూ వెళ్లిందంటే… రక్షిత్ శెట్టి స్నేహితుల మీదకు కూడా ప్రసరిస్తోంది… దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు… ఈ నెగెటివిటీ ఆమెను ఎప్పుడో దెబ్బ కొట్టే ప్రమాదమైతే ఉంది…

అందరూ ఒకప్పుడు తినీతినక అవకాశాల కోసం, కనబడిన ప్రతి అడ్డమైనోడినీ అర్థించినవాళ్లే… లక్కీగా కిరిక్ పార్టీ అనే సినిమా హిట్టయింది… హీరోగా చేసిన రక్షిత్ శెట్టితోపాటు హీరోయిన్‌గా చేసిన రష్మిక, దర్శకుడు రిషబ్ శెట్టి క్లిక్కయ్యారు, మంచి ఫ్రెండ్సయ్యారు… తరువాత రక్షిత్‌తో ఆమెకు ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది, నాలుగు రోజులకే పెళ్లి గాకుండానే బంధం తెగిపోయింది… ఆమెలో కోపం మాత్రం అలాగే ఉండిపోయింది…

Ads

This Hits Hard 😂 🤣😂 #RishabShetty 🔥🔥 pic.twitter.com/sd9n2NFken

— Filmy Corner ꭗ (@filmycorner9) November 21, 2022

మొన్నామధ్య కాంతార గురించి ఎవరో అడిగితే… నేను చూడలేదు, టైమ్ లేదు అని అడమెంటుగా జవాబు చెప్పి వెళ్లిపోయింది… రక్షిత్ మీద కోపం రిషబ్ మీద ఎందుకు ఉండాలి..? అదెందుకు బహిరంగంగా ప్రదర్శించాలి…? ఎందుకంటే, రక్షిత్, రిషబ్ తదితరులు ఓ బలమైన ఫ్రెండ్స్ గ్యాంగ్ కాబట్టి..! ఈమధ్య ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ కిరిక్ పార్టీ సినిమాలో చాన్స్ గురించి ఏదో అడిగారు… దానికి ఆమె బదులిస్తూ… ‘‘ఓ అందాల పోటీలో నెగ్గాను, పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో ఫోటోలు వచ్చాయి, తరువాత ఓ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఫోన్ వచ్చింది’’ అని చెబుతూ… సోకాల్డ్ ప్రొడక్షన్ హౌజ్ అన్నట్టుగా గాల్లోకి రెండు చేతులు పైకెత్తి కొటేషన్స్ సిగ్నల్ చూపించింది…

ఆ శ్లేష, ఆ వెటకారం అక్కర్లేదు నిజానికి… రిషబ్ ఎక్కడో ఆ వీడియో చూసినట్టున్నాడు… కాంతార చూసేంత టైమ్ లేదనడం, ఈ సోకాల్డ్ ప్రొడక్షన్ హౌజ్ అనే సంకేతాలతో ఎక్కడో బాగా మండినట్టుంది… నిజానికి ఆ కిరిక్ పార్టీలో చాన్స్ రిషబ్ ఇచ్చాడు ఆమెకు… రక్షిత్ శెట్టి దానికి నిర్మాత కూడా..! తరువాత ఏదో ఇంటర్వ్యూలో రిషబ్‌ను ఎవరో అడిగారు… ‘‘ఇప్పటికిప్పుడు మంచి ఫిమేల్ లీడ్ రోల్ ఇవ్వదలుచుకుంటే ఎవరికిస్తారు..? కీర్తి సురేష్, సమంత, సాయిపల్లవి, రష్మికల్లో ఎవరు’’… ఇదీ ప్రశ్న…

రష్మిక

‘‘స్క్రిప్టు పూర్తయ్యాక ఎవరు సూటయితే వాళ్లను తీసుకుంటాను… నిజానికి సమంత నచ్చుతుంది నాకు… సాయిపల్లవి కూడా… వాళ్లతో కలిసి పనిచేస్తాను… కానీ ఇలాంటివాళ్లు నాకు నచ్చరు, చేయలేను…’’ అని చెబుతూ అచ్చం రష్మిక ఇచ్చినట్టే ‘‘కొటేషన్ సిగ్నల్స్’’ చూపించాడు… అంటే రష్మికలాంటోళ్లు నచ్చరు అని బలంగానే వ్యక్తీకరించాడు… మామూలు కౌంటర్ కాదు ఇది… పైగా సాయిపల్లవి, సమంతలు నచ్చుతారు అని చెప్పడం అంటే ఆమె వేస్ట్ అని పరోక్షంగా గాలి తీసేసినట్టే… మనం చెప్పుకునేది ఏమిటంటే… ఎప్పుడో జరిగిపోయింది, వదిలేయాలి, రక్షిత్ శెట్టి క్యాంపు మీద ఈ కోపాన్ని పెంచుకుంటూ పోవడం, ప్రదర్శించడం అవసరమా..? అది మంచిది కాదు, సినిమా ఇండస్ట్రీలో అస్సలు పనికిరాదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions