మొన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… 400 కోట్ల మార్క్ కోసం కాదు, కాంతార ఓటీటీ ప్రసారం ఆగిపోయింది… వరాహరూపం పాట కోసమే ఆగింది… అది సెటిల్ చేసేవరకు ప్రసారం చేయను అని అమెజాన్ వాడు భీష్మించాడు… డబ్బులు ఇవ్వలేదు… అదీ సంగతి… అదే నిజం… ఇప్పుడు ఆ పాటను తీసేశారు… అదే కంటెంటుతో ఏదో కొత్త పాట కంపోజ్ చేయించి పెట్టారు… అప్పుడు గానీ అమెజాన్ వాడు ప్రసారానికి సై అనలేదు… కాకపోతే ఈ కొత్తపాట మరీ కాంతార ప్రాణం తీసేసింది… బాగాలేదు…
నెటిజనంలో తీవ్ర నిరాశ… మొత్తం ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లలో ఇదే చర్చ… ఒక్కసారిగా కాంతార ఇమేజ్ సగానికి డౌనయిపోయింది… నిజమే, ఆ వరాహరూపం ఆ క్లైమాక్స్‌కు భలే సింకైంది… ప్రేక్షకులను ఉర్రూతలూగించింది… ఈ కొత్త పాటలో అంత పంచ్ లేదు… ఆ ట్యూనూ సరిగ్గా లేదు… ఒరిజినల్ ఒరిజినలే… ఇది అవసరార్థం అప్పటికప్పుడు అల్లబడిన పాట కదా… ఆ సహజత్వం ఏదో లోపించింది… అదీ అసంతృప్తి… అందుకే #BringBackVarahaRoopam ట్రెండింగ్ నడుస్తోంది…
అప్పుడెప్పుడో తాము రిలీజ్ చేసిన నవరసం అనే పాటను కాపీ కొట్టి వరాహరూపం క్రియేట్ చేశారని థైక్కుడం బ్రిడ్జి అనే మ్యూజిక్ కంపెనీ కోర్టుకు ఎక్కింది… దాంతో వరాహరూపం పాట వాడుకోకుండా కొజిక్కోడ్ జిల్లా సెషన్స్ కోర్టు స్టే విధించి, మొత్తం ప్లాట్‌ఫారాల నుంచి తీసేయాలని అప్పట్లో ఆర్డర్ వేసిందిగా… యూట్యూబ్ సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల నుంచి పాటను తీసేశారు… కానీ ఓటీటీ వెర్షన్‌లో ఏం చేస్తారనే ఆసక్తి ఉండేది… కోర్టు బయట రాజీ కోసం ప్రయత్నించినట్టు లేదు సరిగ్గా… లేదా ఎక్కువ డిమాండ్ చేసినట్టున్నారు…
Ads
ఈ సినిమా తీసిన హొంబళె ఫిలిమ్స్ వాళ్లు హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు కానీ కోర్టు వాటిని నిన్న కొట్టేసింది… ఆ తీర్పు ఏమొస్తుందో తెలియదు కాబట్టి అధికారికంగా ఇన్నాళ్లూ ఓటీటీ ప్రసారం తేదీని చెప్పలేకపోయారు… ఇప్పుడిక రెడీ చేసుకున్న కొత్త పాటను పెట్టేసి, ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… ఆ పాట తొలగింపుతో మొత్తం సినిమా ప్రాణమే తీసేసినట్టు అవుతుంది… ఐనా తప్పడం లేదు వాళ్లకు… న్యాయం గెలిచింది అని థైక్కుడం బ్రిడ్జి కంపెనీ ఓ ట్వీట్ కొట్టింది…
కానీ దీనివల్ల ఇద్దరికీ నష్టమే… కోర్టు బయట రాజీకి దిగివస్తే అయిపోయేది… ఇండస్ట్రీ అన్నాక వివాదాలు వస్తూనే ఉంటాయి… సామరస్య పరిష్కారమే ఉత్తమం, ఆ సోయి సదరు మలయాళ మ్యూజిక్ కంపెనీకి లేనట్టుంది… హొంబళె ఫిలిమ్స్ వాళ్లు 400 కోట్లు కుమ్మేసుకున్నారు… ఓటీటీ వాడు ఒప్పుకున్న మొత్తం ఇవ్వకతప్పదు… ఊహించనంత డబ్బు వచ్చిపడింది… వివాద పరిష్కారం కోసం ఉదారంగా ఎక్కువ డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు… ఐనా నో రిజల్ట్…
నిజానికి రెండు పాటలూ నిశితంగా గమనిస్తే… స్థూలంగా ట్యూన్ అక్కడక్కడా పోలి ఉన్నట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది… కానీ రెండూ వేర్వేరు… కాకపోతే మోడరన్ మ్యూజిక్‌కు కర్నాటక మ్యూజిక్‌తో ఫ్యూజన్ రెండు పాటల్లోనూ పోలిక… అది కాపీ ఎలా అవుతుంది..? పైగా కంటెంట్ వేరు… అన్నింటికీ మించి రెండు వీడియోల్లోనూ కనిపించే ఆదివాసీ అర్చనరీతులు పూర్తిగా వేరు… ఒకటి కథాకళి, మరొకటి భూత్ కోళ… ఒకటి మలయాళం, మరొకటి కన్నడం… సో, మొత్తానికి కాంతార ఓటీటీ వెర్షన్ గొంతు కోసేశారన్నమాట…!!
Share this Article