బాబా రామ్‌దేవ్ వివాదంలో లేకపోతేనే వార్త… పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్యక్రమంలో తను మాట్లాడుతూ మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలో కూడా బాగానే కనిపిస్తారని, తన కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారని పిచ్చి కూత ఏదో కూశాడు… నిస్సందేహంగా చిల్లర వ్యాఖ్య…
యోగాకు వస్తున్న మహిళలకు దుస్తుల విషయంలో ఏర్పడుతున్న సమస్యలపై ఏదో కాంటెక్స్ట్లో తను ఆ మాట అన్నట్టున్నాడు… ఐనాసరే, వెగటు కూతే… అయితే ఆ వార్తలో ఆకర్షించింది మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత గురించి… ‘‘ఆమెకు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలనే బలమైన సంకల్పం ఉంది… ఆమె వందేళ్ల వరకూ ఇలాగే ఉంటుంది… ముసలిది అయిపోదు..’’ అని వ్యాఖ్యానించాడు… నిజంగా మంచి ప్రశంసే…
మహిళలకు ఎవరికైనా అందంగా కనిపించాలనే ఉంటుంది… తప్పులేదు… ఆమెలోనూ ఉంటుంది… విశేషమేముంది అంటారా..? ఆమె ఎనర్జీ చాలామందికి ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది… బాబా రాందేవ్‌కు కూడా… ఆమెపై చేసిన వ్యాఖ్యల్లో శ్లేష గానీ, అబద్ధం గానీ ఏమీ లేవు… కాకపోతే అదీ అసందర్భపు వ్యాఖ్య… ఆ మీటింగులో ఆమె ఉంది కాబట్టి ఆమె పతంజలి యోగా కార్యక్రమాలకు సహకరిస్తుంది కాబట్టి, ఆమెను ప్లీజ్ చేయడానికి ఏదో కూసినట్టున్నాడు…
Ads
43 ఏళ్ల అమృతది నాగపూర్… తండ్రి కంటి డాక్టర్, తల్లి గైనకాలజిస్ట్… తను సింబయాసిస్‌లో ఎంబీఏ చేసింది… 17 ఏళ్ల క్రితం ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా చేరిన ఆమె ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్… చిన్నప్పుడు స్టేట్ లెవల్ టెన్నిస్ ప్లేయర్… 17 ఏళ్ల క్రితమే దేవేంద్ర ఫడ్నవీస్‌తో పెళ్లయింది… దివిజ అనే బిడ్డ కూడా ఉంది… భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆమె తన రోజువారీ బ్యాంకు డ్యూటీని విస్మరించలేదు… అయితే తన యాక్టివిటీ కేవలం బ్యాంకింగుతో ఆగిపోలేదు…
ఆమె చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న గాయని… ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటుంది… కమర్షియల్ సినిమాలకు పెద్దగా పాడదు గానీ ఏవైనా సోషల్ ఫిలిమ్స్ అడిగితే పాడుతుంది… టైమ్స్ మ్యూజిక్ వాళ్ల కోసం 2022 శివరాత్రి సందర్భంగా ఆమె శివతాండవస్తోత్రం రిలీజ్ చేసింది… 1.3 కోట్ల వ్యూస్ సాధించింది ఆ ఆల్బమ్… మరోవైపు దివ్యాజీ ఫౌండేషన్‌తో కలిసి సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తుంటుంది… ఇండో-చైనా సత్సంబంధాల కోసం 2015లో జరిగిన మానస సరోవర యాత్రను ఆమే లీడ్ చేసింది…
మోడీని జాతిపిత అని వ్యాఖ్యానించడం, ఓ క్రూయిజ్ మీద బాధ్యతరహితంగా, ప్రమాదకరమైన స్థితిలో సెల్ఫీ తీసుకోవడం వంటి రెండుమూడు చిన్న చిన్న కంటవర్సీలు కూడా ఉన్నాయి… కానీ ఆమెకు ఎప్పుడూ ఏదో యాక్టివిటీ ఉండాలి… అదే ఎనర్జీ… నిజమే మరి… ముసలిదైపోవాలని లేదు ఆమెకు, యవ్వనంలోనే ఉండిపోవాలని ఉంది… అందం గురించి కాదు, దాన్ని ప్రదర్శించాలని కాదు… సొసైటీలో ఎప్పుడూ ఏదో ఓ యాక్టివిటీలో ఉండాలని…!!
Share this Article