ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం ప్లస్ ఆనందం రెండూ కలిగాయి… నారా బ్రాహ్మణికి సంబంధించిన వీడియో అది… ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లో పెట్టాడు… అది ఏమిటీ అంటే..? ‘‘నారా బ్రాహ్మణి ఒక ప్రొఫెషనల్ బైకర్… Passionate Travaller… yes, మీరు విన్నది, చూసేది నిజమే… జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు… వీడియోలో 1:20 సెకండ్స్ తర్వాత మాట్లాడతారు … వాళ్ల ట్రావెల్ experiance ఎలా ఉందో వాళ్ల మాటల్లోనే చూసేయండి…” ఇదీ పోస్టు…
ఎక్సలెంట్… బ్రాహ్మణిని చూస్తుంటే అప్రిసియేట్ చేయాలనిపిస్తుంది… హైలీ ఎడ్యుకేటెడ్… అత్తింట్లో అణుకువగా ఒదిగిపోయింది… మామ మాజీ ముఖ్యమంత్రి, తండ్రి పాపులర్ హీరో… భర్త సీఎం కావాలనుకునే నాయకుడు… చుట్టూ ఫుల్ ఎన్‌లైటెన్ పీపుల్… అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆలోచించి వేయాల్సిందే… ఈ స్థితిలోనూ ఆమె హెరిటేజ్ సారథ్యం స్వీకరించింది… ఆమెదే దాదాపు నిర్ణయాధికారం…
Ads
మోడరన్ లేడీ… మోడరన్ అవుట్ లుక్… అంతేకాదు, డైనమిక్ కూడా… హెరిటేజ్ వైపు రాజకీయాల వాసన రానివ్వలేదు… చుట్టూ రాజకీయమే ప్రపంచంగా బతికే కేరక్టర్లున్నా సరే, తన పర్సనల్ అంశాల్లోకి రాజకీయాల్ని రానివ్వలేదు… అదే సమయంలో తన ఇష్టాల్ని ఏవీ పణంగా పెట్టలేదు… బైక్ మీద లద్దక్ సాహసయాత్ర… సాహసమే…
ఫిట్‌నెస్ ఉండాలి, సహకరించాలి… అన్నింటికీ మించి దేనికీ తలవంచని అభిరుచి ఉండాలి… బైకర్స్ అందరూ ఓ గ్రూపుగా లద్దక్ టూర్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు… ఎవరి కిట్లు వాళ్లవే… నిజానికి మంచి టూర్ అది… అనుకోకుండా ఈ వీడియో బయటికొచ్చింది గానీ, పెద్దగా మీడియా ఫోకస్‌లో ఉండదు ఆమె, తన పనేదో తనది…
తన మీద రాజకీయ ప్రత్యర్థులు వెగటు పోస్టులు పెడుతున్నా సరే ఎప్పుడూ రియాక్టయినట్టు కూడా కనిపించలేదు… వెల్ మెచ్యూర్డ్… సరే, తన యాత్ర మీద కాస్త వివరాల్ని తనతో వచ్చిన మిత్రుల బ్లాగుల్లో గానీ, పోస్టుల్లో గానీ చెబితే బాగుంటుంది.,. చాలామంది ఔత్సాహికులకు స్పూర్తి… (ఈ పోస్టుపైనా వెకిలి కామెంట్లు పెట్టకండి ప్లీజ్…) (ఈ వీడియో నిజమైనదే అని నమ్ముతున్నా… ఐనా ఇలాంటి విషయాల్లో ఫేక్ వీడియోలు ఎందుకొస్తాయిలే…)
Share this Article