Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

85 లక్షలకు చేరిన బిగ్‌బాస్ ప్రైజ్ మనీ… సోషల్ తిట్లతో దిగొచ్చిన టీం…

December 10, 2022 by M S R

కొన్నాళ్లుగా బిగ్‌బాస్ టీంకు ఒకటే పని… విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఎంత కోత పెట్టాలి..? ఎలా కోతపెట్టాలి అని..! పేరుకు యాభై లక్షల ప్రైజ్ మనీ అని ప్రకటించి, మళ్లీ ఈ కోతలేమిట్రా, ఎలాగూ ఈసారి షో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఖర్చులు మిగుల్చుకునే వేషమా అని నెటిజనం, సోషల్ మీడియా, మీడియా వెక్కిరింపులకు, తిట్టిపోతలకు దిగాయి… ఆ టీంకు వాచిపోయినట్టుంది… దిగొచ్చింది…

నిజానికి ఆమధ్య రాజ్ అనుకుంటా… కంటెస్టెంట్ ఏదో పాట పాడి, 5 లక్షలు కోత పెట్టించాడు ప్రైజ్ మనీలో… అంటే 45 లక్షలు… మీలో ఎవరైనా 25 లక్షలు తీసుకుని వెళ్లిపోతారా అని టాప్ త్రీ కంటెస్టెంట్లను అడిగే ఓ ఆనవాయితీ ఉంది కదా… ఎవరైనా టెంప్టయితే 25 లక్షలు తీసుకుపోతే, ఇక విజేతకు మిగిలేది 20 లక్షలు… అంటే గెలవడమే తప్పా..? ఇదీ సోషల్ మీడియా వేసిన ప్రశ్న… అందులోనూ 30 శాతం ముందస్తు ఆదాయపు పన్ను కట్టేస్తే మిగిలేది 14 లక్షలు… ఇదేం షో అనే ఆ విమర్శల సారాంశం…

అందుకని కాస్త బుద్ది తెచ్చుకున్నట్టుంది… రెండుమూడు రోజులుగా మళ్లీ ప్రైజ్ మనీ పెంచే వేషాలకు దిగింది బిగ్‌బాస్ టీం, రకరకాల టాస్కులు పెట్టి, కాస్త కాస్త యాడ్ చేస్తూ పోయింది… ఐనా 47 లక్షలు దాటలేదు… దాంతో శనివారం వీకెండ్ షోలో నాగార్జునతో ఓ చిన్న ట్రిక్ ప్లే చేయించి, 3 లక్షలు కూడా యాడ్ చేసి, మళ్లీ ప్రైజ్ మనీని అరకోటికి చేర్చారు…

Ads

brezza

అంతేకాదు, ఈ షోను స్పాన్సర్ చేస్తున్న సువర్ణభూమి రియల్ ఎస్టేట్ వాళ్లతో 600 గజాల భూమిని ఇవ్వనున్నారు… దాని విలువ 25 లక్షలు అని కూడా నాగార్జునతో మళ్లీ ప్రత్యేకంగా చెప్పించారు… అంటే విజేతకు ప్రైజ్ మనీకి తోడు ఈ 25 లక్షల అదనపు ప్రైజ్ గ్యారంటీ అన్నమాట… గుడ్… ఇక్కడితే ఆపలేదు… మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకాయన్ని పిలిపించి… విజేతకు మారుతి హాట్ టెక్ బ్రెజా కారును బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటింపజేశారు,.. ఈ షోకు మారుతి కూడా స్పాన్సరరే…

దాని విలువ ఆన్ రోడ్ కనీసం 10 లక్షలు… అంటే మొత్తం ప్రైజ్ మనీ 85 లక్షలకు చేరుకున్నట్టే… సీజన్ మొత్తం దివాలా తీసినా సరే, కంటెస్టెంట్లకు దక్కే అమౌంట్ విషయంలో మాత్రం లక్కు బాగానే వర్కవుట్ అవుతుందన్నమాట… రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్… ఎవరు లక్కీ ఫెలో… ఎందుకో రేవంతే అనిపిస్తోంది గట్టిగా…!! ఆల్‌రెడీ మొన్ననే కదా లక్ష్మి ఇంటికి వచ్చింది… ఇది అదనమేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions