అన్ని పత్రికల్లోనూ సేమ్ వార్త… బీఆర్ఎస్ పార్టీవర్గాలు పేర్కొన్నట్టుగా… అంటే పార్టీయే ఆఫ్ ది రికార్డుగా పంపించిన నోట్ కావచ్చు బహుశా… త్వరలో ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ, రైతు విభాగాల ఏర్పాటు, పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఢిల్లీలో కేసీయార్‌ను కలిశారు, ఏపీ నుంచి కూడా బోలెడు మంది, వేగంగా బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి… సేమ్, ఇదే కంటెంటు… ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉంటే, మీడియా తనంతటతనే రాయాలి, అంతేతప్ప ఇలా రాయించుకుంటే వచ్చే మైలేజీ ఏముంటుంది..? అసలు తెలంగాణలోనే పార్టీలో గగ్గోలు పుడుతుంటే, ప్రజల దృష్టిని ఇంకోవైపు మళ్లించడమా ఇది..?
మల్లారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు కథ కొనసాగుతూనే ఉంది… పలు జిల్లాల్లో మంత్రులకూ ఎమ్మెల్యేలకు పొసగడం లేదు… నియోజకవర్గాల్లో లీడర్ల మధ్య పొరపాచ్చాలు, రచ్చ… ఇన్నాళ్లు కఠిన క్రమశిక్షణ అవన్నీ బయటికి రాకుండా అణిచేసింది… కానీ ఆగడం లేదు… ఇదంతా ఒకవైపు… మరోవైపు పార్టీలో అన్‌రెస్ట్, అభద్రతను పెంచే వ్యూహాన్ని బీజేపీ రచిస్తోంది… ఇప్పటికే కేసీయార్ కూతురు కవితను ఈడీ పక్కాగా ఢిల్లీ మద్యం కేసులో ఫిక్స్ చేసింది… నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్న బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో మొదలైంది…
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులోకి బీజేపీ ముఖ్య నేతల్ని లాగి, కేసీయార్ టార్గెట్ చేస్తున్న తీరుతో బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఢిల్లీ సమాచారం… దూకుడుగా ముందుకొస్తున్న కేసీయార్ ఇప్పుడు జాతీయ స్థాయిలో అప్రధానమే అయినా మొదట్లోనే కట్ చేయాలనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనగా చెబుతున్నారు… తన యాంటీ-హిందూ పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలని నిర్ణయమట… కేసీయార్ తీసుకున్న నిర్ణయం కారణంగా, సీబీఐ నేరుగా రాష్ట్రంలో ప్రవేశించి కేసులు ఏమీ పెట్టలేదు, అందుకని ఈడీనే ముందు పెడుతున్నారు…
Ads
కవిత కేసును ఇంకా బిగిస్తూనే, ఏ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును బీజేపీని బదనాం చేయడానికి కేసీయార్ ప్రయత్నిస్తున్నాడో, దాన్ని బీఆర్ఎస్ వైపే తిప్పే పనిలోపడింది ఈడీ… ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చెబుతున్నదీ అదే… నేనే ఆ కేసులో ఫిర్యాదుదారును, అదే కేసులో ఈడీ అధికారులు నన్నే ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు అంటున్నాడు… ఎలాగూ కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల యవ్వారం కాబట్టి ఈడీ ఎంట్రీ ఇచ్చింది… రివర్స్ గేమ్ స్టార్టయింది… ఆ రోహిత్‌రెడ్డితోనే స్టార్ట్ చేసింది…
ఆ రోహిత్‌రెడ్డితోనే స్టార్టయింది… అంటే, ఈ లెక్కన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకూ ఈ దర్యాప్తు సెగ తప్పకపోవచ్చు… ఇంకోవైపు కేసీయార్ ఏర్పాటు చేసిన ‘సిట్’ తదుపరి స్టెప్ ఏమిటో అంతుచిక్కడం లేదు… ఈడీ ఈ నలుగురి ఎమ్మెల్యేలకు కేసును బిగిస్తుంటే, అది మిగతా ఎమ్మెల్యేల్లో ఓరకమైన అభద్రతకు దారితీసే సూచనలైతే ఉన్నాయి… దీనికితోడు జిల్లాల్లో పార్టీవర్గాల విభేదాలకు కేసీయార్ ఎలా చెక్ పెడతాడనేది ఇంట్రస్టింగు పాయింట్ కాగా, ఎప్పుడో ఎన్నికలు జరగబోయే ఏపీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీచేయనుందనే అంశాన్ని చర్చకు పెట్టడం వల్ల ఫాయిదా ఏంటి…? మరో కీలకప్రశ్న… అసలు బీఆర్ఎస్ భావజాలం అనగానేమి..?
Share this Article