(Jagannadh Goud…………) పల్లెటూరి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, రెండు నెలులగా కనిపించకుండా పోయిన ఓ లెజెండ్ ప్రస్థానం..!…. చైనా నుంచి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి బిలియనీర్ “జాక్ మా”… చరిత్రలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని లోపాలని మొట్టమొదట చైనాలో ఎండగట్టిన వ్యక్తి కూడా ఆలీబాబా గ్రూప్ “జాక్ మా” గారే…. చైనాలోని ఒక పల్లెటూళ్ళో చదువుకునే ఒక పిలగాడు రోజూ సైకిల్ తొక్కుకుంటూ దగ్గరలోని టౌన్ కి వెళ్ళి విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకి ఉచితంగా టూరిస్ట్ గైడ్ గా పనిచేసేవాడు, ఇంగ్లీష్ భాష ఇంప్రూవ్ చేసుకోవటం కోసం…! ఆ తర్వాత BA ఇంగ్లీష్ చేసి, లెక్చరర్‌గా పనిచేసేవాడు… నెలకి 1000 రూపాయల జీతం (1996 లో)… తనతో పనిచేసే ఇంకో లెక్చరర్ని పెళ్ళి చేసుకున్నాక వచ్చే 1000 రూపాయల జీతం కుటుంబాన్ని పోషించటానికి చాలక 30 ఉద్యోగాలకి అప్లై చేస్తే అన్నిటిలో రిజక్ట్ కాబడ్డాడు…
హోటల్ లో పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుంది అని KFC రెస్టారంట్ కి ఇంటర్యూకి వెళ్తే వచ్చిన 24 మందిలో 23 మందిని తీసుకున్నారు కానీ జాక్ మాని తీసుకోలేదు ఆయన ఆకారం చూసి… ఎవరో ఒక స్నేహితుడు ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఉద్యోగాలు వెతకటం చూపిస్తాడు… కానీ, చైనాకి సంబంధించిన సమాచారం కానీ ఉద్యోగాలు కానీ దానిలో లేవు… టెక్నాలజీ ఏమీ తెలియకపోయినా చైనా పేజేస్ అనే వెబ్ సైట్, ఆ తర్వాత ఆలీబాబా డాట్.కామ్ ని స్థాపించి ఇప్పుడు చైనాలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు జాక్ మా… చైనా నుంచి ఫొర్బ్స్ మ్యాగజైన్లో స్థానం సంపాదించిన మొట్టమొదటి వ్యాపారవేత్త నాకు తెలిసి అతనే… చైనా నుంచి బయటి వ్యాపార ప్రపంచానికి ఎక్కువ తెలిసిన వ్యక్తి జాక్ మా…
Ads
సంకల్పం, సాధించాలనే పట్టుదల కలిగిన ప్రతి ఒక్కరికీ జాక్ మా ఒక ఆదర్శం. అమెరికా అధ్యక్షుడు అవ్వగానే డోనాల్డ్ ట్రంప్, జాక్ మా ని పిలిపించుకొని అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు ఎలా క్రియేట్ చెయ్యాలి అని ఆయన్ని అడిగాడు… అది జాక్ మా సామర్ధ్యం… వార్టన్, MIT, హార్వర్డ్, కెల్లాగ్స్ మొదలగు ది బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఆయన్ని పిలిపించుకొని పాఠాలు చెప్పించుకుంటై… 57.9 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 20 వ అత్యంత ధనవంతుడు జాక్ మా… చైనాలో చైనా అధ్యక్షుడు తర్వాత అత్యంత పవర్ పుల్ వ్యక్తీ జాక్ మా నే… ఇంకా ప్రపంచంలోని శక్తివంతమైన 100 మందిలో జాక్ మా ఒకరు…
ఏమీ తెలియకపోయినా పల్లెటూరు నుంచి కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచిన జాక్ మా నిజంగా చాలామందికి ఆదర్శం. మొదట్లో నా దగ్గర డబ్బులు లేవు, టెక్నాలజీ తెలియదు, ప్రణాళిక లేదు. కానీ, నాకొచ్చే 1000 రూపాయల్లో ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేశా. వేసిన ప్రతి అడుగు ఆలోచించి వేశా, అందుకే ఈ స్థాయికి వచ్చా. ఇప్పటికీ టెక్నాలజీ కంటే కల్చరే ముఖ్యం అంటారు జాక్ మా…
ఏదైనా సరే “Don’t complain, Try to solve it” అంటారు ఈ 55 యేళ్ల యువకుడు “జాక్ మా”… అక్కడి ప్రభుత్వంలోని లోపాలని గత నవంబర్ 2020 లో ఎత్తి చూపితే జాక్ మా పై ప్రతీకార చర్యలకు పూనుకుంది చైనీస్ గవర్నమెంట్… జాక్ మా వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది… అంతేగాక, ఆయనకు చెందిన ANT ఫైనాన్షియల్ ఐపీవోను అడ్డుకొంది… దీంతో, ఆలీబాబా గ్రూప్ సంపదతో పాటు జాక్ మా ఆస్తులు కూడా కరిగిపోయాయి… అయినా ఇప్పటికీ ప్రపంచంలో 20 వ అత్యంత ధనవంతుడు జాక్ మా గారు… చైనాలో నియంతృత్వ పార్టీ అధికారంలో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ లోపాలని విమర్శిస్తే తన వ్యాపారాలకి నష్టం కలిగిస్తారు అని తెలిసినా నిజాలని నిర్భయంగా చెప్పిన వ్యక్తి జాక్ మా గారు… You are the real inspiration for the youth… ఎందరో మహానుభావులు, అందరిలో జాక్ మా ఒకరు… “రాబోయే తరానికి వారధి జాక్ మా”. హాట్సాఫ్
Share this Article