సౌత్ సినిమా ఇండస్ట్రీ 2022 బాలీవుడ్ బాక్సాఫీసును శాసించింది… కొల్లగొట్టింది… యశ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, రాం చరణ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తదితరుల సౌత్ హీరోలకు ఇప్పుడు హిందీలో కూడా ఫ్యాన్స్ ఏర్పడిపోతున్నారు… కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, కాంతార సినిమాల్లాగే 2023లో ఓ డజన్ సౌత్ సినిమాలపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది..? అవి 2023లో హిందీ బాక్సుల్ని కొల్లగొట్టబోతున్నాయా..?
- పొన్నియిన్ సెల్వన్-2 :: బాహుబలి, కేజీఎఫ్ సీక్వెల్స్ బాగా క్లిక్కయ్యాయి… అదేరకంగా పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ హిట్టవుతుందా..? నిజానికి మొదటి భాగం ఎక్కువగా తమిళుల్నే ఆకట్టుకుంది… మణిరత్నం ఇంకాస్త కథలో గ్రిప్ పెంచి రెండో భాగాన్ని అన్ని భాషల ప్రేక్షకులకూ నచ్చేవిధంగా తీర్చిదిద్దుతాడా..?
2. సాలార్ :: రాధేశ్యాం మీద బాగా ఆశలు పెట్టుకున్న ప్రభాస్‌కు అది తీవ్ర నిరాశను మిగిల్చింది… అంతకుముందు సాహో కొన్ని ప్రాంతాల్లో డబ్బుల్ని రాబట్టింది… అందుకని హిందీలో మార్కెట్ నిలబెట్టుకోవాలంటే ప్రభాస్‌కు ఒక హిట్ కావాలి… ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ అసలు వచ్చే సీన్ కనిపించడం లేదు… కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సాలార్ పైనే ఇప్పుడు తాజా ఆశలు…
Ads
4. ధూమం :: పుష్ప, విక్రమ్ సినిమాలతో కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ తనకంటూ ఓ మార్కెట్ సృష్టించుకుంటున్నాడు… లూసియా, యూటర్న్ తీసిన పవన్ కుమార్‌తో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు… కేజీఎఫ్, కాంతార నిర్మాతలు హొంబలె ప్రొడక్షన్స్ వాళ్లు తీయబోయే ఫస్ట్ మలయాళం సినిమా ఇది… ఈ సంస్థ అన్ని పాపులర్ భాషల్లో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సంగతి తెలుసు కదా… ధూమం సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత అపర్ణ బాలమురళి హీరోయిన్…
5. ఇండియన్ 2 :: ఇది 1996 భారతీయుడు సినిమాకు సీక్వెల్… అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం… 2022 విక్రమ్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన కమల్‌హాసన్ ఈ సినిమా మీద కూడా ఆశలు పెట్టుకున్నాడు… శంకర్ చేతిలో ఉన్న వేరే సినిమాలతో భారతీయుడు సీక్వెల్ లేటవుతోంది… కానీ 2023లోనే రిలీజ్ చేస్తారు… కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవానీశంకర్, రకుల్ ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్, బాబీ సింహా వంటి భారీ తారాగణమే ఉండబోతోంది సినిమాలో…
6. ఉపేంద్ర కొన్నేళ్ల క్రితం కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో… ఇప్పుడు ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు… పేరు కబ్జా… దీన్ని ఏడు భాషల్లో రిలీజ్ చేస్తారు… తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, కన్నడం… ఉపేంద్రతో పాటు ఇందులో కిచ్చా సుదీప్, శ్రియా తదితరులు కూడా ఉంటారు… 2022 కన్నడ సినీ ఇండస్ట్రీకి ఓ వరం… అదే బాటలో నేనూ పయనిస్తాను అంటున్నాడు ఉపేంద్ర…
7. రాంచరణ్ 15 ;: ఆర్ఆర్ఆర్ తరువాత రాం చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు… ఇప్పుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు… అది ఆగుతోంది, సాగుతోంది… ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అట… కార్తీక సుబ్బరాజు రాసిన స్టోరీ… ఇందులో కైరా అద్వానీ ఉండనుంది… సహజంగానే పాన్ ఇండియా సినిమా…
8. దళపతి 67 :: ఖైదీ, విక్రమ్ బాటలోనే లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు… యాక్షన్ సినిమా… ఇందులో సంజయ్ దత్, విశాల్, గౌతమ్ వాసుదేవ మీనన్, త్రిష కృష్ణన్ కూడా ఉంటారు… విజయ్‌కు బాగా హోప్స్ ఉన్నాయి ఈ సినిమాపై…
9. ప్రాజెక్టు కె :: 500 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా ప్రభాస్ బాగా ఆశలు పెట్టుకున్నాడు… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా దీపిక పడుకోన్ హీరోయిన్… ఆమెకు తొలి తెలుగు సినిమా… అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు… ఎలాగూ పాన్ ఇండియా మూవీయే…
10. ఎన్టీయార్ 30 :: నిజానికి ఈ సినిమా విషయంలో ఓ సందిగ్ధత ఉంది… 2024లో గానీ రిలీజ్ చేయలేమని నిర్మాతలు, దర్శకులు చెబుతుండగా… అంత గ్యాప్ వద్దంటూ జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒత్తిడి తీసుకొస్తున్నారు… ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ మళ్లీ తెర మీద కనబడలేదు… 300 కోట్లతో నిర్మించే ఈ సినిమా తన ఆర్ఆర్ఆర్ ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని జూనియర్ ఆశ… సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు….
11. థంగలాన్ :: ఛియాన్ విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ తరువాత బాగా కష్టపడుతున్న సినిమా థంగలాన్… కబాలి, కాలా తదితర సినిమాలు తీసిన పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది… దీన్ని కూడా అయిదు పాపులర్ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్…
12. తునివు :: అజిత్ ఓ సైలెంట్ కిల్లర్… పెద్దగా ప్రమోషన్లు, ప్రచారం లేకుండానే హిట్లు కొట్టేస్తుంటాడు… తమిళ ఇండస్ట్రీలో ఈమధ్య తరచూ విజయ్ ఫ్యాన్స్‌కూ అజిత్ ఫ్యాన్స్‌కూ నడుమ ఫైట్లు… ఈ నేపథ్యంలో ఓ పాన్ వరల్డ్ సినిమాతో ముందుకొస్తున్నాడు… శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాత… మంజూ వారియర్, సముద్రఖని తదితర నటులు కూడా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్… ఈ 12 సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ కాబోతున్నది ఈ సినిమాయే… తెలుగులో సినిమా పేరు తెగింపు…
Share this Article