ఇప్పటితరంలో చాలామందికి ఒకప్పటి కమెడియన్ రాజబాబు గురించి తెలియకపోవచ్చు… ఏఎన్నార్, ఎన్టీయార్‌లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు అతను ఒక దశలో… కానీ హీరో హీరోయే… కమెడియన్ కమెడియనే… అందుకే తను కూడా హీరో కావాలనుకున్నాడు… కుదరలేదు… 1983లో కావచ్చు తన మరణించాడు… ఆ తరువాత ఇద్దరు కొడుకుల్ని ఆయన భార్య చదివించుకుంది, ఇద్దరూ అమెరికాలో సెటిలయ్యారు…
ఇవన్నీ చెప్పింది రాజబాబు తమ్ముడు చిట్టిబాబు… అవును, రాజబాబు తొమ్మిది మంది తమ్ముళ్లలో ఒకరు చిట్టిబాబు, మరొకరు అనంత్ బాబు… చిట్టిబాబు వయస్సు, ఆర్థిక వివరాలు, కుటుంబం గురించి పెద్దగా తెలియదు కానీ… తను కూడా సినిమా నటుడే… కానీ చాన్నాళ్లుగా కనిపించడం లేదు… అనంత్ అప్పుడప్పుడూ కనిపించేవాడు… ఆ చిట్టిబాబు హఠాత్తుగా జీతెలుగులో వచ్చే ఓ సీరియల్‌లో కనిపించాడు… కానీ ఫాఫం, ఏమిటిలా అయిపోయాడు అనిపించింది…
ముసలితనం వచ్చేసింది… అప్పట్లో ఏదో నాగార్జున సినిమాలో విలన్ పక్కన రాజనాలను తీసుకొచ్చి పెట్టారు కదా… విలనీ సలహాదారు పాత్రలో… ఈ సీరియల్‌లో కూడా చిట్టిబాబుది అలాంటి పాత్రే… అయితే మరీ టీవీలో ఓ అనామక పాత్ర చేయడం డబ్బు కోసమా..? నటన కొనసాగింపు కోసమా..? తనకే తెలియాలి… తన అసలు పేరు పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి అలియాస్ పుణ్యమూర్తుల చిట్టిబాబు…
Ads
స్టార్ మాటీవీలో వచ్చే మరో సీరియల్ జానకి కలగనలేదులో కూడా నటిస్తున్నట్టున్నాడు… 2018లో వచ్చిన ఇది నా లవ్‌స్టోరీ తన చివరి సినిమా… అడపాదడపా మూడునాలుగేళ్లకు ఓ పాత్ర… అంతే… అంతకుమించి తన కెరీర్ జోరుగా ఏమీ సాగలేదు… సినిమా ఇండస్ట్రీలో అంతే, కమెడియన్‌గా క్లిక్కయితే ఎదురులేదు, అది అలాగే కొనసాగడం పెద్ద టాస్క్… ఆలీ, సునీల్ తదితరులకు ఆ విద్య తెలుసు… ప్చ్, చిట్టిబాబుకు తెలియదు… పోనీ, కేరక్టర్ ఆర్టిస్టుగా చేద్దామా అంటే విపరీతమైన పోటీ… కొత్తతరం నటీనటులు వచ్చేస్తున్నారు ఫీల్డులోకి… తప్పుకోక తప్పదు, కాకపోతే చేతనైనన్ని రోజులు ఏదో తాపత్రయం… అంతే..!!
Share this Article